చేదు వార్త, అంతరిక్ష యాత్రకు ఇస్రోకు మహిళలే దొరకడం లేదు…

చేదు వార్త. తొందర్లో భారతదేశం చేయబోతున్న తొలి అంతరిక్ష యాత్ర గగన్ యాన్ లో మహిళలెవరూ ఉండటం లేదు. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించింది.
కారణం, టెస్ట్ పైలెట్స్ ఎవరూ దొరకడం లేదు. మొదట్లో గగన్ యాన్ లో ఒక మహిళ ఉంటారని ప్రకటించారు. అయితే, ఇది సాధ్యం కావడం లేదు. భవిష్యత్తులో మరొక సారి అంతరిక్ష యాత్ర జరిగిదేకా భారతీయ మహిళ వేచి చూడాల్సిందే.
రాకేశ్ శర్మ భారత దేశపు తొలి అంతరిక్ష యాత్రికుడయ్యాడు. అయితే, ఇదెపుడో 1984లో జరిగింది. అంటే ఇప్పటికి 35 సంవత్సరాలయింది. ఇపుడు ఇస్రో గగన్ యాన్ చేపడుతూ ఉంది. అయితే, ప్రకటించినట్లు ఇందులో మహిళ వ్యోమగామి ఉండటం లేదు. సాధారణంగా పైలట్ల నుంచే వ్యోమగాములను ఎంపిక చేస్తారు. భారత దేశ పైలట్లలో ఇలాంటి టెస్ట్ పైలెట్లెవరూ అందుబాటులో లేరు. ఆశ్చర్యం. నిరాశ పరిచే ఈ వార్తను ఇస్రో అధికారులు ప్రకటించారు. భవిష్యత్తులో ఈ అవకాశం రావచ్చని అన్నారు. బారతీయ మహిళ రికార్డు సృష్టించలేకపోతున్నది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75  సంవత్సరాలు అయిన సందర్భంగా గగన్ యాన్ లాంచ్ చేస్తున్నారు. ఇందులో ఇద్దరు లేదా ముగ్గురు వ్యోమగాములుంటారు. అయితే, ఈచారిత్ర యాత్రలోఒక  మహిళలేక పోవడం లోటే.
చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 లలో మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర సాంకేతిక సబ్బంది చాలా కీలకమయిన పాత్ర పోషించారు. ఇది భారత జాతి గర్వించ దగ్గ విషయం. అయితే, భారతదేశం తొలిసారి భారతీయులను అంతరిక్షంలోకి పంపిస్తున్నపుడు మహిళలెవరూ అర్హులయిన వారు ఇంత పెద్ద భారత దేశంలో అందుబాటులో లేకపోవడమే విచిత్రం.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/keonjhar-collector-ashish-thakare-removes-plastic-with-sal-leaf-cutlery/

తొలి అంతరిక్ష ప్రయాణం చరిత్రలో ఒక మైలురాయి వంటిది. ఇలాంటి ప్రయాణంలో మహిళల లేకపోవడం వెలితే.
మానవుడి అంతరిక్ష యాత్ర 1961లో నాటి సోవియట్ రష్యా యూరి గగరిన్ ను పంపడంతో మొదలయింది.
తర్వాత తొలిసారి మహిళను భూ ఉపరితలం నుంచి 100 కిమీ పైబడిన ఎత్తుకు పంపి రష్యామరొక రికార్డు సృష్టించింది. 1963 జూన్ 16న సోవియట్ అంతరిక్ష నౌక వోస్తోక్ 6 లో కాస్మొనట్ వాలంటీనా తెరిష్కోవా అంతరిక్షంలోకి ప్రవేశించి, ఆ సాహసయాత్ర చేసిన తొలి మహిళ అయ్యారు. భూ కక్షలో ఆమె మూడురోజులుండి 48 అర్బిట్స్ చుట్టారు. ఆమె సైన్యం నుంచి రాలేదు. సాధారణ పౌరురాలు. ఇలా కూడాఆమె అంతరిక్ష యాత్ర రికార్డే. తొలి స్పేష్ వాక్ చేసిన మహిళకూడా రష్యనే. ఆమెపేరు స్వెట్లానా సవిత్ స్కాయా(1982).అంతేకాదు, అప్పటికి ఆమె రెండుసార్లు స్పేస్ యాత్ర జరిపి కూడా రికార్డు సృష్టించారు.
ఇక అమెరికా విషయానికి వస్తే, రష్యా తొలి మహిళను పంపాక 23 సంవత్సరాలకు అమెరికా శాలీ రైడ్ అనే మహిళను 1978లో అంతరిక్షంలోకి పంపింది.చాలెంజర్ షటిల్ లోనుంచి ఆమె ఫార్మష్యూటికల్ ప్రయోగాలు చేశారుు. అయితే, ఆమె ఛాలెంజర్ షటిల్ ప్రేలుడుతో చనిపోయారు.
కల్పనా చావ్లా అంతరిక్షంలోకి ప్రవేశించిన తొలి భారతీయ మహిళ. అయితే, ఆమె అమెరికా సిటిజన్ మొదట ఆమె 1997లో స్పేస్ షటిల్ కొలంబియాలో మిషన్ స్పెషలిస్టుగా, రొబొటిక్ ఆర్మ్ ఆపరేటర్ గా వెళ్లారు. అయితే, రెండో యాత్రలో జరిగిన ప్రమాదంలో ఆమెచనిపోయారు. కొలంబియా స్పేష్ షటిల్ తిరిగి వస్తూ భూవాతావరంలోకి ప్రవేశించే ముందు షటిల్ పేలిపోవడంలో అందులో ఉన్నఆరుగురుచనిపోయారు. ఇందులో కల్పన ఒకరు. ల్యాండింగ్ ఇంకొక 16 నిమిషాలలో ఉండగా ఈ ఘోరం జరిగింది. ఆమె స్మారకార్థం భారతదేశం వాతావరణ పరిశోధన ఉపగ్రహం మెట్ శాట్ కు కల్పన పేరు పెట్టింది.
అంతరిక్షంలోకి ప్రవేశించిన రెండో భారతీయ మహిళ సునీత విలయమ్స్. ఈమెకూడా అమెరికా సిటిజనే. అంతరిక్ష యాత్ర లో ఆమె జరిపిన స్పెస్ వాక్ లు ఒక పెద్ద రికార్డు. అమె మొత్తంగా అయిదు సార్లు అంతరిక్షయాత్ర జరిపారు. ఏడు సార్లు స్పేస్ వాక్ చేసి మొత్తంగా 50 గంటల 40 నిమిషాల స్పేస్ వాక్ లో గడిపారు.
అయితే, ఇపుడు భారత దేశం ప్రతిష్టాత్మకంగా తొలి అంతరిక్ష యాత్రకు మహిళ దొరక్కపోవడం విచారకరం. భారత రక్షణ దళాలు మహిళ విషయంలో సమానత్వం పాటించడం లేదన్నది అందరికి తెలిసిందే. దీని వెనక పురుసాధిక్య మైండ్ సెట్ ఉందనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. 2018లో ఆర్మీచీఫ్ బిపిన్ రావత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యయే దీనికి నిదర్శనం. మహిళలకు యుద్ధవిధులకు పనికిరారని ఆయన అనడం పెద్ద గొడవ సృష్టించింది.
ఒక వైపు ఇస్ట్రో వ్యోమగాములకోసం సైన్యంలో వెదుకుతూఉంది. మరొక వైపు మహిళలకు ఇందులో చోటులేదని ఆర్మీచీఫ్ చెబుతున్నారు. ఈ కాంట్రడిక్షన్ వల్లే భారత దేశపు తొలి అంతరిక్ష యాత్రలో మహిళ ఉండటంలేదు.
అయితే, కొందరి అభిప్రాయాలెలా ఉన్నా,  మహిళలకు మంచిరోజులొస్తున్నాయనక తప్పదు. జనరల్ బిపిత్ రావత్ ఏమి చెప్పినా 2019లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ పైలట్ భవ్నా కాంత్ యుద్ద విధులకు అర్హత సంపాదించారు. ఇప్పటినుంచి మహిళలకు శిక్షణ ఇస్తే తప్ప ఇస్రో భవిష్యత్తు గగన్ యాన్ లకు మహిళలు దొరకరు. భారతదేశంలో అంతరిక్షయాత్రకు మహిళలే దొరకరడం లేదన్నది ఇబ్బందికరమయిన విషయమే.
ఇంతవరకు ప్రపంచదేశాలనుంచి 530 మంది (2017 నాటి లెక్క) అంతరిక్ష యాత్రలు చేస్తే ఇందులో 60 మంది మహిళలున్నారు.

Photo credit : educationsatguru