బడ్జెట్ రాజకీయాలు 2019 ఎన్నికల కోసమే…

2018 కేంద్ర బడ్జెట్ నేడు తీవ్ర వివాదంగా మారుతున్నది. మరో మారు సెంటిమెంట్ రాజకీయాలకు ఆంధ్ర ప్రదేశ్ పావుగా మారే పరిస్దితులు ఉత్పన్నమవుతున్నాయి. 2014 విభజన సందర్భంలొ కూడా ఇలాంటి రాజకీయాలే నడిపి కొన్ని రాజకీయ పార్టీలు లబ్ధి చెందితే, మరి కొన్ని రాజకీయాలు పార్టీలు నష్టపోయినాయి. అంతిమంగా ప్రజలు భారీమూల్యం చెల్లించుకున్నారు. బడ్జెట్ లో ఏపికీ జరిగిన అన్యాయం గురించి చర్చించే ముందు అన్యాయం పై మాట్లాడుతున్న రాజకీయపార్టీల నిజాయితీ ఎంత అన్నది ఇక్కడ ప్రధానం. అసలు రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఎప్పుడు ? ఏ రూపంలో జరిగింది ? ఎప్పుడు స్పందించాలి ? మన రాజకీయా పార్టీలు స్పందిస్తున్నన్నది ఎప్పుడు, ఎందుకు అన్నది ఇక్కడ ప్రదానం.

విభజన కారణంగా జరిగిన నష్టం:  ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో పాలకులు అనుసరించిన కేంద్రీకృత పాలన కారణంగా అన్నిరకాల మౌలికవసతులు కలిగిన ప్రాంతంగా ఒక్క హైదరాబాదు మినహ మరో ప్రాంతం అభివృద్ది చెందలేదు. అలాంటి హైదరాబాదును విభజన కారణంగా కోల్పోవడంతో ఆమేరకు ఆదాయాన్ని కోల్పోవడంతో బాటూ, నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి తగిన మౌలిక వసతులు కలిగిన ప్రాంతం కాలేకపోయింది. మరో ముఖ్యమైన విషయం కీలమైన విద్యా,వైద్య కేంద్రాలు కూడా ఏపీ లో లేకపోవడం. కాని కేంద్రం నుంచి రావాల్సిన చట్టబద్దమైన హమీలను రాబట్టుకోవడం లోగానీ విడిపోయిన కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చడానికి రాష్ట్రం ఎంచుకున్న మార్గం సమస్యను ఏమాత్రం పరిష్కరించుకునే పద్దతిలో లేకపోవడమే కాదు మరింత జటిలంచేసేలా ఉంది. విభజన కారణంగా ఏపి కొంత మేరకు నష్టపోయింది వాస్తవం. కాని దాన్ని విపరీతంగా నేడు కూడా ప్రచారంలో పెట్టడం కేవలం రాజకీయం తప్ప మరోటి కాదు.

విబజన కారణంగా జరిగిన నష్టం: 1. రాజధాని హైదరాబాదును కోల్పోవడం, ఫలితంగా కొంత మేరకు ఆదాయం తగ్గింది. మౌళిక వసతులు కలిగిన ప్రాంతం కోల్పోయాం 2. వైద్య, విద్యా కేంద్రాన్ని కూడా కోల్పోయాం. రెండూ కూడా కీలకమైనవే కావచ్చు. అయితే జరిగిన, జరుగుతున్న చర్చ ఏమిటి? కేంద్రం ఇస్తే ఇక బతకలేం అన్న స్థితికి రాష్ట్ర ప్రజల మానసిక స్థితిని మార్చినారు. కానీ లెక్కలు ఏమి చెపుతున్నాయి విడిపోయిన నాటికి మొత్తం బడ్జెట్ 1,27,866 కోట్ల రూపాయిలు అయితే అందులో హైదరాబాదు జిల్లా ఆదాయం 20,022 కోట్ల రూపాయిలు. అంటే మొత్తంలో దాదాపు 16 శాతం విడిపోయిన కారణంగా అర్థికంగా నష్టపోయింది. 12 వేల కోట్లు అనుకోవచ్చు. ఆ మొత్తం చెప్పుకోదగ్గ నష్టమే. విభజన అనంతరం కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం పన్నుల వాటాలో 32 శాతం నుంచి రాష్ట్రాలకు 42 శాతం పెంచడం. ఆంద్ర ప్రదేశ్ కు పెరిగిన నిదులు ప్రతి ఏటా 20 వేల కోట్లు పైనే. ఇక్కడ ఉదయించే ప్రశ్న,  ఇది అన్నిరాష్ట్రాలకు ఇవ్వలేదాఅనేది. నిజమే ఇచ్చినారు. కానీ హైదరాబాదు కోల్పోయిన కారణంగా ఏర్పడిన ముఖ్యమైన ఆర్థికలోటుకు కొంత మేరకు ఊరట లభించినట్లే. అంతే కాదు ఈ కాలంలో 1.20 లక్షల కోట్లమేరకు అప్పులు తెచ్చినారు. 13 జిల్లాల చిన్న రాష్ట్రం 1.20 లక్షల కోట్ల అప్పు, కేంద్రం పన్నుల వాటాలో తెచ్చిన మార్పు కారణంగా ఏటా 20 వేలకోట్ల రాబడి మొత్తంగా 2 లక్షల కోట్లు ఈ కాలంలో వచ్చినాయి. హైదరాబాదు ఆదాయం కోల్పోయిన కారణంగా జరిగిన నష్టం ఏడాదికి 10 వేల కోట్లు. ఇంకా విభజన నష్టం గురించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం అన్యాయం. మరోకీలకమైన విషయం విద్యా, వైద్య కేంద్రం ఈ విషయంలో పూర్తి తప్పు రాష్ట్రప్రభుత్వానిదే ఎందుకంటే చట్టంలో 10 సంవత్సరాలు  హైదరాబాదులోని విద్యా, వైద్య సంస్దలలో ఏపి విద్యార్థులకు కోటా ఉంది. అందుకే ఉమ్మడి ఎంసెట్. ఈ 10 ఏండ్లలో అలాంటి సంస్థలు పూర్తిగా రాష్ట్రంలో రూపుదిద్దుకుంటాయి. మరి హైదరాబాదు కేంద్రంపై ఏపి ప్రజల హక్కును ఫణంగా పెట్టింది ఎవరు? హైదరాబాదును కోల్…

2

విభజన చట్టంలో నిర్దిష్టంగా నిర్ణీత కాలంలో చేయాల్సిన పనులు, సాధ్యాసాధ్యాలను పరిశీలించే చర్యలు కొన్ని. ఈ విషయంలో తొలి ముద్దాయి కేంద్రం. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడం దయ కాదు- అది ప్రజల హక్కు. ఇచ్చినవిగా తనగొప్పగా, ఇవ్వలేనివి నాటి కాంగ్రెస్ పార్టీ తప్పుగా ప్రచారం చేస్తుంది నేటి కేంద్ర ప్రభుత్వం. విభజన చట్టంలో ఏపీకి రైల్వేజోన్( రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం విశాఖ అని పేరు పెట్టాయి) కడప ఉక్కు, కోస్తా కారిడార్ లాంటివి నిర్మాణానికిగాను సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఉన్నది. స్పష్టంగా ఇవ్వమని చెప్పలేదని అందుకే ఇవ్వలేదు అంటూ మాట్లాడుతున్నారు. చట్టంలో స్పష్టంగా చెప్పింది సాధ్యాసాధ్యాలను విభజన జరిగిన నాటినుంచి 6 మాసాలలో ప్రక్రియను పూర్తి చేయాలని ఉంది. అంటే 2014 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి. కాని ప్పటికీ పరిశీలిస్తూనే ఉన్నారు. దుగ్గరాజుపట్నం 2018 మార్చి నాటికి మొదటి దశను కేంద్రమే పూర్తి చేయాలని ఉంది. రాయలసీమ, ఉత్తరాంద్రకు ఆర్ ఆర్ ప్యాకేజి ఇవ్వాలని ఉంది అది ఎంత అన్నది కూడా ఇప్పటికి నిర్థారించలేదు. గాలేరు నగరి, హంద్రీ నీవా కు నిదులు ఇవ్వాలి ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదు. హైదరాబాదు కేంద్రంలో ఉన్న సంస్థల విషయంలో ఎటువంటి పురోగతి లేదు. పై విషయంలో కేంద్రం బాధ్యతగా వ్యవహరించడంలేదు. అదే సందర్బంలో విభజన చట్టానికి భిన్నంగా రాష్ట్రంకూడా ఉండరాదు. రాజధాని ఎంపిక శివరామకృష్ణన్ నివేదిక ఆదారంగా కేంద్రం ఇచ్చే సూచన తర్వాత అంతమ నిర్ణయం తీసుకోవాలి. కాని కేంద్రం సూచనతో సంబంధం లేకుండానే నిర్ణయం తీసుకున్నారు. రాజధాని లో మౌళిక వసతుల ఏర్పాటు, రాజ్ భవన్, సచివాలయం లాంటివాటికి సహకరించాలి. అయతే ఇప్పటి వరకు నిర్ధిష్టమైన పూర్తి వివరాలను కేంద్రంకు ఇచ్చినారా ? అందుకు సాంకేతికంగా అనుమతులు ఉన్నాయా. కేంద్రం శాశ్వత నిర్మాణాలకు నిధులు ఇస్తుంది. కాని ఏపి నిర్మిస్తున్నది తాత్కాలిక నిర్మాణాలు. అలాంటప్పుడు కేంద్రం బడ్జెట్ లో రాజధానికి నిదులు ఇవ్వడం లేదని ఎలా ప్రశ్నిస్తున్నారు. పోలవరంకు సాధారణ బడ్జెట్ నుంచి కేటాయించాలి. అందుకు బిన్నంగా నాబార్డు నుంచి కేంద్రం ఇస్తామనడం రాష్ట్రం అందుకు అంగీకరించి నేడు బడ్జెట్ లో నిదులు కేటాయించలేదు అనడం సహేతుకంగా లేదు. విభజన చట్టంలోని అంశాలకు అవసరం అయ్యే ఖర్చును కూడి ప్యాకేజీ అని పేరు పెట్టి అదేదో అద్బుతం అని రెండు పార్టీలు రాష్ట్రం అంతా తిరిగి మంచి జరిగింది అంటూ ప్రచారం చేసి నేడు ఏదో నష్టం జరిగింది అనడం రాజకీయం కాకపోతే ఏమౌతుంది? జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగింది. అపుడు సమర్థించి నేడు ప్రత్యేకంగా నష్టం జరగక పోయినా ఏదో జరిగిపోయిందని మాట్లాడటం కచ్చితంగా ఎన్నికల రాజకీయమే అవుతుంది.

2019 ఎన్నికలే లక్ష్యమా….

జాగ్రత్తగా పరిశీలిస్తే 2019 ఎన్నికలు లక్ష్యంగా అధికారపక్షం వ్యవహరిస్తుంది అన్న అనుమానం కలగకమానదు. కేంద్రం విభజన చట్టం స్థానంలో ప్యాకేజీ అన్నపుడు , సాదారణ పద్దునుంచి కాకుండా నాబార్డు నుంచి పోలవరంకు నిదులు అన్నపుడు అంగీకరించడమే కాకుండా అది తన గొప్పదనం అని ప్రకటించడం. విభజన చట్టంకు భిన్నంగా హైదరాబాదు పై హక్కును వదులు కోవడం, రాజధాని నిర్మాణం చేయడం లాంటి నష్టాలను చేసి నేడు బడ్జెట్ సందర్భంగా కొత్తగా జరిగిన నష్టం ఏమీ లేక పోయినా అధికార పక్షం చేస్తున్న పోరాటం దేని కోసం?  2019 ఎన్నికలు సమీపిస్తున్నాయి ఆ ఎన్నికలలో కచ్చితంగా అధికారపక్షం గత ఎన్నికలలో ఇచ్చిన హమీలు, తన పాలన పద్దతులు ప్రధానంగా చర్చకు వస్తాయి. అధికారపక్షం వ్యవహరం చూస్తుంటే వాటి ప్రాతిపదికన ఎన్నికలకు పోవడం బహుషా ఇష్టం లేనట్లు ఉంది. గతంలో జరిగిన నంద్యాల ఎన్నికలలో కూడా తన విధానాలపై కాకుండా నంద్యాలకు ఎన్నికలకు ముందు తాము చేసిన, చేయబోయే అబివృద్ది పనులు చూసి ఓట్లు వేయమని కోరి విజయం సాధించారు. కానీ అలాంటివి రాష్ట్రం మొత్తం చేయడం సాధ్యం కాదు కనుక 2014 తరహా సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించాలని అనుకుంటున్నట్లుగా అధికారపక్షం వ్యవహరం కనిపిస్తుంది.

-మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి

రాజకీయ విశ్లేషకుడు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *