మంత్రి తలసాని లేదన్నా, తెలంగాాణలో బర్డ్ ఫ్లూ

ఒక  వైపు తెలంగాణలో పశుసంవర్థక శాఖ మంత్రి  తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాాణలో బర్డ్ ప్లూ లేదని రెండు రోజులకొకసారి ప్రకటనలు చేసి, చికెన్ మార్కెట్ పడిపోతకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా రాష్ట్రంలో బర్ద్ ఫ్లూ వార్తలు ఆగడం లేదు. మొత్తానకి రాజధాని హైదరాబాద్ లో బర్ద్ ఫ్లూ భయం కనిపిస్తూ ఉంది.

చికెన్ సెంటర్లు దాదాపు ఖాళీగా కనిపిస్తున్నాయి. మొన్న ఆదివారం నాడు  మటన్ షాపుల్లో రష్ పెరిగితే,  చికెన్ షాపులు వెలవెల బోయాయి.   కోడిగుడ్ల ధరలు కూడా పడిపోయాయి. గుడ్లు కొనడం చాలా మంది మానేశారు. ఏదో మొండిగా, బాగా ఉడికేస్తే ఏమికాదులే అనుకునే చికెన్ ప్రియులు మాత్రమే ధైర్యం చేసి చికెన్ కొంటున్నారు.

తెలంగాణలో రాజకీయ నాయకులకు, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్లలో చాలా మంది కోళ్ల ఫారాలు నడుపుతున్నారని, బర్డ్ ఫ్లూ వార్తలు వ్యాపిస్తే, వీళ్ల వ్యాపారం దెబ్బతింటుందని ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా బర్ద్ ఫ్లూ వార్తలు వ్యాపించకుండా జాగ్రత్త తీసుకుంటున్నారని సోష ల్ మీడియాలో ఒక వాదన బాగా ప్రచారమయింది. అందుకే గత ఏడురోజుల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ రెండు సార్లు అధికారులతో  సమీక్షించి తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేదని ప్రకటించారు.

ఈ రోజు సాక్షి లో నిజామాబాద్‌ జిల్లా బర్ద్ వార్త వచ్చింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లి సమీపంలోని  దుర్గాభవాని పౌల్ట్రీ ఫామ్‌లో 24 గంటల్లోపే 1,500 కోళ్లు మృతి చెందాయి. వార్త కలకలం సృష్టించింది. క్షణాల్లో వైరలయింది. సోషల్ మీడియా పిక్ ప్ చేసి వైరల్ చేసింది.

ఈ ఫామ్ లో  రెండు షెడ్లలో సుమారు 8,000 కోళ్లు పెంచుతున్నారు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా సుమారు వేయి కోళ్లు మృతి చెందాయి. బుధవారం ఉదయాన్నే ఈ విషయం ఫామ్‌ సిబ్బంది గమనించారు. ఈ విషయాన్ని వెంటనే  యజమానికి తెలిపారు. చనిపోయిన కోళ్లను జేసీబీ సాయంతో సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. మధ్యాహ్నం వరకు షెడ్లలో మరో 500 పైగా కోళ్లు కూర్చున్న చోటే కూలబడి చనిపోయాయని ‘సాక్షి’రాసింది.

మండల పశువైద్యాధికారి డాక్టర్‌ గోపికృష్ణ ఈ  విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భరత్, ఏడీ (ల్యాబ్‌) కిరణ్‌ దేశ్‌పాండే  పౌల్ట్రీ ఫామ్‌ను సందర్శించారు. ఫామ్‌ యజమానితో మాట్లాడారు. చివరి వ్యాక్సినేషన్‌ ఎప్పుడు చేశారు, దాణా ఎవరూ సరఫరా చేస్తారు లాంటి వివరాలు తెలుసుకున్నారు. బతికి ఉన్న కోళ్ల రక్త నమూనాలను, చనిపోయిన కోడిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. కాగా, ఒక్కరోజే సుమారు 1,500 కోళ్లు మృతి చెందడంతో యానంపల్లి తండవాసులతో పాటు మండలవాసులు ఆందోళన చెందుతున్నారు. కోళ్ల హఠాన్మరణానికి కారణం ధృవీకరణ కావలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *