ఎన్నికల కమిషన్ తో ఆంధ్ర ఉద్యోగులు ఫుల్ హ్యాపీ!

ఎలక్షన్ కమిషన్ తాము గతం లో కోరిన విధంగా ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులకు కొన్ని మినహాయింపులు ఇవ్వటం పట్ల AP JAC నేతలు అమరావతి ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ రోజు ఉద్యోగుల తో కమిషనర్ నిమ్మగడ్డ రమేషకుమార్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మరి కొన్ని సమస్యలను కమిషఅన్ ముందు ఉంచారు.

ఎన్నికల విధులలో పాల్గోనే సిబ్బందికి ఏర్పాటుచేయవలసిన 1.కనీస వసతి/ సౌకర్యాలు గురించి, 2. ఎన్నికల సిబ్బందికి రక్షణ చర్యలు 3.ఉద్దేశ్య పూర్వకంగా కక్ష్య సాధింపు చర్యలు మరియు 4. పోలింగ్/కౌంటింగ్ పూర్తయిన మరుసటి రోజు *’ఆన్ డ్యూటీ’* గా పరిగనించడం తదితర అంశాలపై AP JAC అమరావతి పక్షాన  ఈ రోజు వినతిపత్రం ఇస్తూ సమావేశంలో SEC గారికి వివరించటం జరిగిన్ఎది.

ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి కనీస సౌకర్యాలు.. అనగా రవాణా, భోజన, వసతి, భద్రత, కోవిడ్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు, పోలింగ్ సిబ్బందికి సరిపడా భత్యం, నిధులు తదితర అంశాలపై అలాగే మహిళసిబ్బందికి ప్రత్యేక వసతి ఏర్పాటు చేసేవిధంగా ఆదేశాలు ఇవ్వాలని మరియు పోలింగ్ సిబ్బందికి ఇచ్చే భత్యం అలవెన్సులు పెంచాలని కోరారు.

విధులలో పాల్గొనే సిబ్బందికి మాస్కులు, శానిటైజేషన్, గ్లోవ్సు లు, PPE కిట్స్, ఫేస్ షీల్డ్ లు అందచేయాలని కొరటమైనది.
ఓటు వేయటానికి వచ్చే ప్రజలకు ధర్మల్ స్క్రీన్ టెస్ట్ చేయటంతో పాటు శానిటైజేషన్ చెయ్యాలి. తదితర అంశాలను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడమైనది.

ఇలాగే,  ఎన్నికలలో పాల్గొనే అధికారులు/ సిబ్బందికి నైతిక, ప్రేరణాత్మక, ఆత్మస్థైర్యం కలిగించాల్సిన కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గారి మీదనే ఉన్నదని, పోలింగ్ అధికారులు/ సిబ్బంది గురించి తీసుకునే రక్షణ చర్యల విషయంలో ప్రధానంగా ఎన్నికల ప్రక్రియలో పాటించవలసిన పద్ధతుల్లో (Procedural lapses) జరిగే చిన్న చిన్న పొరపాట్లకు ఉద్యోగులును, అధికారుల పై తీవ్రమైన చర్యలకు ఉపక్ర మించారదని, ఎలాంటి తప్పు చేయకుండానే రాజకీయ పార్టీల ఫిర్యాదులపై ప్రభుత్వం నుండి ఎలాంటి బదిలీలు చేయకుండా చూడాలని, ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని పేర్కొన్నారు.

రాజకీయ పార్టీలు ప్రేరేపించిన విధంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు/ఉద్యోగుల పై ప్రధానంగా ఇటీవల కొన్ని పంచాయితీలు ఏకగ్రీవాల సందర్భంగా రాష్ట్రంలోని దాదాపు నలభై (40) మంది MPDO లను భాద్యులు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం చాలా బాధాకరమని, ఎలాంటి తప్పులు చేయలేదని ప్రధానంగా చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు నివేదికలు ఇచ్చినందున, SEC గారు సదరు చర్యలపై పునరాలోచించి వెంటనే వారికి ఎన్నికల భాద్యతలు అప్పగించాలని కొరడమైనది. వారందరిని తిరిగి ఎన్నికల విధులు అప్పగించడం వలన వారిలో మానసిక స్థైర్యం, ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిపైన ఉన్నదని తెలిపారు.

.ఎన్నికల విధులలో పాల్గోనే సిబ్బందికి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేటప్పటికి అదే రోజు అర్ధరాత్రి దాటే పరిస్థితి ఉన్నందున ఎన్నికల విధులలో వున్న వారికి మరుసటి రోజు కూడా ” *ఆన్ డ్యూటీ గా*” పరిగణించాలని కోరడమైనది.

పై విషయాలపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఎన్నిక కమీషనర్ గారు తప్పకుండా పై విషయాలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని, డీజీపీ గారిని కలిసిన సందర్భంగా పరిష్కారం కోసం కృషి చేస్తానని, ఇప్పటికే పైన తెలిపిన అనేక విషయాలపై కమిషన్ స్పష్టత ఇచ్చిందని తెలిపారు. సమావేశమ్ లో  రాష్ట్ర కోశాధికారి VV మురళీకృష్ణ నాయుడు,   జనకుల శ్రీనివాసరావు, వైస్ ఛైర్మన్ బి.కిషోర్ కుమార్, రెవెన్యూ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణ మూర్తి, కృష్ణా జిల్లా చైర్మన్ దొప్పలపూడి ఈశ్వర్, APRSA నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, రమణ మూర్తి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *