ఆంధ్రాలో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు: మంత్రి

ఆంధ్ర ప్రదేశ్ లో పరీక్షల నిర్వహణ ఫై విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందన

 

ప్రస్తుతం అయితే పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ పరీక్షలునిర్వహించాలని ప్రభుత్వం, వద్దు వాయిదావేయాలని రాజకీయపార్టీలు, తల్లితండ్రులు కోరుతున్నారు. ఈ విషయం ప్రతిష్టంభన  తల్లితండ్రులను విద్యార్థులను బాగా గందరగోళానికి గురి చేసింది. కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఇ బోర్డు పరీక్షలను  రద్దుచేశాక, అనేక రాష్ట్రాలు తమ బోర్డు పరీక్షలను వాయిదా వేశాయి. తెలంగాణ కూడ వాయిదా వేసింది.అయితే, ఆంధ్రప్రదేశ్ మాత్రం పరీక్షలు నిర్వహించాలనే ధోరణి ప్రదర్శిస్తూ వచ్చింది. దీనితో బాగా విమర్శలు వచ్చాయి. దీని మీద ఈ రోజు మంత్రి స్పష్టతనిచ్చారు.

ఇది కూడా చదవండి: జగన్ తనకు తాను “పరీక్ష” పెట్టుకుంటున్నారా?

.ఆల్ ఇండియా పరీక్షలకు సిద్ధం అవడానికి కూడా విద్యార్థులకు సమయం ఇవ్వాలి.ఇలాగే విద్యార్థుల ఆరోగ్య భద్రత కు ఎటువంటి ఇబ్బంది లేదనే పరిస్థితి ఎదురైనపుడే  పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

పరీక్షల నిర్వహణ మీద నిన్న అధికారులతో సమావేశం అయి చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘విద్యార్థుల తల్లిదండ్రులకు ఎటువంటి భయం లేని సమయంలోనే పరీక్షలు ఉంటాయి. ప్రైవేట్ యాజమాన్యాలకి మద్దతుగా కొన్ని రాజకీయ పార్టీలు పరీక్షలు పై రాజకీయం చేస్తున్నాయి. ఒక తండ్రిగా అయితే నేను పరీక్షల నిర్వహణకు మద్దతిస్తా. ఆప్షన్స్ చూడకుండా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు,’ అయన పేర్కొన్నారు.

పరీక్ష రద్దు చేయడానికి ఒక నిమిషం పట్టదని ఆయన వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *