ఎన్టీఆర్, మహేష్ రిజెక్ట్ చేసిన కథ అది!

సినీ పరిశ్రమలో ఒక హీరోతో అనుకున్న సినిమాలు మరో కథానాయకుడితో చేయడం సర్వసాధారణమే. అయితే కొన్ని కథలు..కొంతమంది హీరోలు రిజెక్ట్ చేస్తే.. ఆ కథను సదరు దర్శకుడు మరొకరితో  తెరకిక్కించి హిట్ కొట్టడం.. లేదంటే ఫ్లాప్ అవ్వడం కూడా మామూలే. అలాంటిదే రీసెంట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో జరగడం చర్చనీయాంశమైంది.
రచయితగా మంచి పేరు సంపాందించుకున్న వక్కంత వంశీ దర్శకుడిగా మారటం కోసం ఓ కథను సిద్ధం చేసుకున్నాడు.. ఈ కథను ఎన్టీఆర్‌కు, మహేష్‌కు ఇద్దరు వినిపించాడు. అయితే కథలో కొన్ని మార్పులు చెప్పడంతో వంశీ ఆ కథను అల్లు అర్జున్‌కు వినిపించాడు. వెంటనే కథ ఓకే చేశాడు బన్నీ. ఆ సినిమానే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా రొటిన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయంగా నిలిచింది. సో..ఎన్టీఆర్, మహేష్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసి ఒక ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు అల్లు అర్జున్.
ఇది కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *