కాళేశ్వరం బేష్ అన్నఫైనాన్స్ కమిషన్

తెలంగాణ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకోసం నిధులు వెచ్చిస్తున తీరు పట్ల కేంద్ర ఫైనాన్స్ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.కాళేశ్వరం పనుల వేగాన్ని చూసి 15 వ ఆర్దిక సంఘం ఆశ్చర్యపోయింది.దేశ చరిత్రలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఒక నమూనా అవుతుందని ఆర్ధిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా  వ్యాఖ్యానించారు. ఇంటింటికి స్వచ్చమైన తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పథకం,భారీ సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం దేశంలోని అన్నీ రాష్ట్రాలకు మోడల్ కానున్నట్టు 1 5 వ ఫైనాన్సు కమిషన్ కార్యదర్శి అరవింద్ మెహతా అభిప్రాయపడ్డారు.రైతులకు సాగునీరు, ప్రజలందరికీ సురక్షిత తాగునీరందించే ప్రభుత్వ సంకల్పం గొప్పదని ఆయన అన్నారు. కాళేశ్వరం పనులను శనివారం నాడు క్షేత్ర స్థాయిలో  పరిశీలించిన  బృందం సభ్యులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను15వ ఆర్ధిక సంఘం కార్యదర్శి ఆరవింద్ మెహతా  పరిశీలించారు. అతి తక్కువ  వ్యవధిలో  ఇంత అద్భుతంగా పనులు జరగటం  సంతోషంగా ఉందని ఆయన అన్నారు. మరొ నాలుగు నెలల్లో  15వ ఆర్ధిక సంఘం ప్రతినిధులందరమూ వస్తామని  అరవింద్ మెహతా తెలిపారు. సిద్ధిపేట సమీపంలో నిర్మాణంలో ఉన్న  కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన 11 వ ప్యాకేజీ రంగనాయకి సాగర్ పనులు, అన్నారం బ్యారేజీ లను సందర్శించారు. రంగనాయకి సాగర్ టన్నెల్ లో పనులు జరిగే తీరుపై అరవింద్ మెహతా  సంతృప్తి వ్యక్తం చేశారు. సండ్లాపూర్లోని రంగనాయక సాగర్ వద్ద ఏర్పాటు చేసిన ఫాటో ఎక్సబిషన్, కాళేశ్వరం ప్రాజెక్టు మ్యాప్ ల  ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ జోషీ, రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు  వివరించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, దానికి అవసరమైన నిధులు, ఖర్చు వివరాలను అరవింద్ మెహతా కు తెలిపారు. రంగనాయక సాగర్ టన్నెల్ , కాలువల నిర్మాణం , ప్రాజెక్ట్  నిర్మాణం జరుగుతున్న పనులపై 15 వ ఫైనాన్సు కమిషన్ కార్యదర్శి  తెలుసు కున్నారు. ముఖ్యమంత్రి కే. సి. ఆర్ పట్టుదల, రాష్ట్ర  ఇరిగేషన్ మంత్రి  మంత్రి హరీష్ రావు కృషి తో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో  ప్రాజెక్ట్ ల  నిర్మాణం జరుగుతున్నట్టు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ జోషీ చెప్పారు.  ఈ ప్రాజెక్టును షెడ్యూలు ప్రకారంపూర్తి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని యస్. కె. జోషి  అన్నారు.   సాగునీటి ప్రాజెక్టుల  నిర్మాణం ద్వారానే  వ్యవసాయం అభివృద్ధి  చెందుతుందని, తద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థ పురో గతి సాధ్యమవుతుందని 15వ ఆర్ధిక సంఘం కార్యదర్శి ఆరవింద్ మెహత  అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థిక సంఘం ముఖ్య ఉద్దేశం కూడా  సమగ్ర గ్రామీణ అభివృద్ధి అని ఆయన తెలియజేశారు.ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల రీత్యా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నట్టు   15 వ ఆర్ధిక సంఘం  వ్యాఖ్యానించింది.స్ట్రక్చర్ల  నిర్మాణాలు, ప్రణాళిక, పనులవేగం,పనులు జరుగుతున్నతీరు తమను ఆకట్టుకున్నాయని అన్నారు. రేయింబవళ్లు మూడు షిఫ్టులలో భారీగా జరుగుతున్న  పనుల వేగాన్ని బట్టి వచ్చీ వానాకాలం నాటికల్లా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి మైలు రాయి దాటుతుందనే విషయంలో తనకు సందేహం లేదని అరవింద్ మెహతా  అభిప్రాయపడ్డారు..ఈ తరహా వేగవంతమైన పనులు ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు.కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, 18 లక్షల  ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం తో పాటు మరో 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టు అని ఆయన ప్రశంసించారు. సకాలం లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే,  ప్రాజెక్ట్ వ్యయం పెరగదని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక సవాలుగా తీసుకున్నట్టుగా తమ పరిశీలనలో అర్ధమైందన్నారు. జాతీయ అభివృద్ధిలో కాళేశ్వరం నిస్సందేహంగా భాగస్వామి అవుతుందని అరవింద్ మెహతా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం కాళేశ్వరంను నిర్ణీత గడువు లోగా పూర్తయ్యేలా ప్రణాళికా బద్దంగా ఎలా పని చేస్తున్నదో, సి.ఏం.కెసిఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఎలా సమీక్షిస్తున్నారో  ప్రభుత్వ  చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.జోషి వివరించారు. రాష్ట్రాలలో నిధుల వినియోగంపై ఫైనాన్స్ కమిషన్ తనిఖీ లో భాగంగా 1 5 వ ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి తెలంగాణలో పర్యటిస్తున్నట్టు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అన్నారం బ్యారేజి దగ్గర మీడియాకు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం అవతరించి మూడున్నరేళ్లే అయినా ఎంతో సాహసంతో ముఖ్యమంత్రి కె సి ఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణ పనులను చూసి ఫైనాన్స్ కమిషన్ సంతోషాన్ని ప్రకటించినట్టు ఆయన చెప్పారు.రాష్ట్రం లో అభివృద్ధి కార్యక్రమాలను అత్యంత వేగంగా అమలు చేసేందుకే అప్పులు చేస్తున్నట్టు వివరించారు. మిగులు బడ్జెట్ తోనే తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు రామకృష్ణారావు అన్నారు.అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అందనున్న  ఫలాలను బేరీజు వేసిన తర్వాతే  నిధులు ఆచితూచి   ఖర్చుచేస్తున్నట్టు ఆయన వివరించారు.అభివృద్ధి కార్యక్రమాలకోసం నిధుల సేకరణ, వాటిని ఖర్చు చేస్తున్న తీరు పట్ల ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి సంతృప్తిని వ్యక్తంచేసినట్టు ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ తెలిపారు. 15 వ ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి వెంట తెలంగాణ ప్రభుత్వ  చీఫ్ సెక్రెటరీ యస్.కె.జోషి, రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణ రావు, సిద్ధిపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ అమేయ కుమార్, జిల్లా కలెక్టర్   పి. వెంకట్రామా రెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, కాళేశ్వరం సి.ఈ.లు  చీఫ్ ఇంజనీర్ హరిరామ్ , వెంకటేశ్వర్లు, ఎస్.ఈ.సుధాకరరెడ్డి  వేణు,ఈ.ఈ ఆనంద్ లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *