ఆరు వందల ఏళ్లనాటి చెట్టును తొలగించారు

ఆ చెట్టుకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. అక్కడ ఉన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఆ చెట్టు నీడనిచ్చి, సేదతీర్చడంతో పాటు దైవ సామానంగా పూజలందుకుంది. అంతటి చరిత్ర కలిగిన ఆ చింత చెట్టును ఇకపై లేకుండా పోయింది. ఇంతకు ఆ చింత చెట్టుకు ఉన్న హిస్టరీ ఏంటో చదవండి..

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బండపేటలో సుప్రసిద్ద రాచన్న స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న ఈ చింత చెట్టు వయసు సుమారు ఆరు వందల ఏళ్ల ఉంటుందని చెబుతుంటారు. కాల క్రమంలో ఈ చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఆలయానికి అందం తెవడంతో పాటు ఈ ఆవరణంలో భాగమైంది. ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఈ చెట్టుకు భక్తులు దైవంతో సమానంగా పూజించే వారు. అయితే అనేక శాఖలుగా విస్తరించడం, వయోభారంతో చెట్టు చితికి పోయింది. కొమ్మలు విరిగి కింద పడుతున్నాయి.

తెలంగాణతో పాటు కర్ణాటక, మహరాష్ట్రల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. దీంతో భక్తుల భద్రత దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఆలయ పాలక మండలి తీసుకన్న నిర్ణయం మేరకు ఈ చెట్టును తొలగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *