ఆమెరికా ఉద్యోగాల మీద ట్రంప్ దెబ్బ, ఇండియన్ ఐటి కంపెనీల మీద వవక్ష

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్  భారతీయు యువకుల అమెరికా ఉద్యోగాల మీద పెద్ద దెబ్బ వేశాడు. వీళ్లు అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు అవసరమయిన హెచ్ 1 బి (H1B) వీసా ఇవ్వడం భారీ కొత విధించాడు. హెచ్ వన్ బి వీసాలు జారీ చేయడంలో అమెరికా ప్రభుత్వం భారతీయ కంపెనీల పట్ల వివక్ష చూపుతూ ఉంది. అమెరికన్ కంపెనీలకు ఈ వీసాలిస్తూ, భారతయ కంపెనీల దరఖాస్తులను తిరస్కరిండం బాగాపెరిగింది.
ముఖ్యంగా ఐటి ఉద్యోగాలకోసం వచ్చే వాళ్ల హెచ్ వన్ బి వీసాలను పెద్ద సంఖ్యలో తిరస్కరించినట్లు  నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) అనే అధ్యయన సంస్థ వెల్లడించింది.
సాఫ్ట్ వేర్ కంపెనీలు అందునా అమెరికాలో ఉన్న ఇండియన్ కంపెనీలు భారతీయ యువకులను అమెరికాకు రప్పించుకుండా ఉండేందుకు ఈ నాన్ ఇమిగ్రేషన్ వర్క్ పర్మిట్ వీసాలను తిరస్కరించడం మొదలుపెట్టారు.
యుస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (UCIS) డేటా ప్రకారం, హెచ్ వన్  బి వీసాల కోసంచేసిన దరఖాస్తులను తిరస్కరించడం నాలుగింతలు పెరిగింది. 2015 లో కేవలం 6శాతం దరఖాస్తులను మాత్రమే తిరస్కరించే వారు, ఇపుడు రిజెక్టవుతున్న దరఖాస్తులు 24 శాతానికి పెరిగాయని ఈ సంస్థ వెల్లడించింది.
హెచ్ వన్ బి వీసా అనేది నాన్ ఇమిగ్రేషన్ వీసా. ఈ వీసాని అమెరికన్ కంపెనీలు కొన్ని రకాల ప్రత్యేక నైపుణ్యాలున్న విదేశీ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు అనుమతిస్తూ  జారీ చేసే వీసా ఇది.
ఇండియా, చైనా వంటి దేశాలనుంచి ప్రతి సంవత్సరం సాఫ్ట్ వేర్ కంపెనీలు లక్షలాది మంది ఇంజనీర్లను హెచ్ వన్ బి వీసాకింద అమెరికాకు రప్పిస్తూ ఉంటాయి.
ట్రంప్ వచ్చాక భారతీయ కంపెనీల  మీద గురిపెట్టాడనే విమర్శలొచ్చాయి. అయితే, భారత ప్రభుత్వం తొలినుంచి అమెరికా విధాానాలను విమర్శించడంలో చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటుంది. అందుకే భారతీయు ఐటి నిపుణులకు హెచ్ వన్ బి వీసాను తిరస్కరిస్తున్నారన్న విషయం ఎపుడూ పెద్దగ చర్చల్లోకి రాలేదు. లక్షలాది మంది ఉద్యోగాలు తగ్గిపోయినా భారత్ గొడవ చేయలేదు.
అయితే, ఈ విమర్శను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ అధ్యయనం రుజువు చేసింది.
అమెరికా ఐటి మేజర్ కంపెనీలయిన  అమెజాన్, గూగల్, ఇంటెల్, మైక్రో సాఫ్ట్ వేర్  వంటి కంపెనీలలో హెచ్ వన్ బి వీసాల దరఖాస్తులను తిరస్కరించడం 2015లొ కేవలం 1 శాతమే ఉండింది. 2019 నాటికి వచ్చే సారి ఇది వరుసగా 6 శాతం, 8శాతం,ఏడు శాతం, మూడు శాతానికి పెరిగింది.యాపిల్ కంపెనీ రిజెక్షన్ మాత్రం రెండు శాతంగానే ఉంది. దీనితో భారతీయ కంపెనీలను పోల్చుదాం.
ఇక భారతీయ కంపెనీల విషయానికొస్తే వీసా దరఖాస్తులను తిరస్కరించడమనేది చాలా చాలా పెరిగింది.ఉదాహరణకు టెక్ మహేందర్ దరఖాస్తును తిరస్కరించడమనేది నాలుగు శాతం  నుంచి 41 శాతానికి పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసుల సంస్థల రిజెక్షన్  6 శాతం నుంచి 34 శాాతానికి పెరిగింది. ఇక విప్రోలో నయితే హెచ్ వన్ బి వీసా దరఖాస్తులను తిరస్కృతి  మరీ ఎక్కువగా 7 శాతం నుంచి 54 శాతానికి పెరిగింది. ఇక ఇన్ఫోసిస్ నుంచి దరఖాస్తులను తిరస్కరించడం 2 శాతం నుంచి 45 శాతానికి పెరిగింది.
అమెరికన్ కంపెనీలకు సాఫ్ట్వేర్ సర్వీసులందించే ఐటి కంపెనీలయిన కాప్ జెమిని, యాక్ సెంచుర్ వంటి కంపెనీల హెచ్ వన్ బి  వీసాలను తిరస్కరించడం 2019  మొదటి మూడు క్వార్టర్స్ లో 30 శాతానికి చేరుకుంది.
అమెరికన్ కంపెనీలయిన అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్,గూగుల్ హెచ్ వన్ బి వీసాలకు ప్రాముఖ్యం ఇచ్చి భారతీయ కంపెనీల మీద వివక్ష చూపుతున్నట్లు ఈ అధ్యయనం చాలా స్పష్టంగా చెబుతుంది.