కలబంద మొక్క ఒక్కటి ఇంట్లో ఉంటే ఎన్ని ఉపయోగాలో…..

కలబంద(Aloe Vera) లేని ఇల్లు లేదు అనటంలో ఏమాత్రం సందేహం లేదు.. ఎందుకంటే ఈ మొక్క వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులోను ఈ మొక్క ఎక్కడైనా సులువుగా పెరుగుతుంది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని పెంచాల్సిన పని లేదు. కలబందను ఔషధాలలో (medicines), పలురకాల కాస్మెటిక్స్ (cosmetics) లోను వాడుతున్నారు. దిష్టి తగలకుండా గుమ్మానికి కూడా వేలాడదీస్తూ ఉంటారు.
# ఇందులో విటమిన్ “ఏ, సి, బి కాంప్లెక్స్”  విటమిన్లు (vitamin A, vitamin C, B complex vitamins) పుష్కలంగా ఉన్నాయి. అందుకే అంతర భాగాలకు, బాహ్య సౌందర్యానికి కలబంద విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది.
# నఖశిఖ పర్యంతం కలబంద ఉపయోగం అద్భుతం. జుట్టు నుండి కాలి గోటి వరకు దీని ప్రయోజనం పొందవచ్చును.
# కలబంద రసం తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది.
#శరీరంలో చెడు కొవ్వు తగ్గించటానికి, అధిక బరువు తగ్గటానికి అలోవెరా జ్యూస్ మంచి సాధనం.
# కలబందలో యాంటీ బ్యాక్టీరియల్ (anti bacterial), యాంటీ ఇంఫ్లమ్మెటరీ (anti inflammatory), లక్షణాలు ఉండటం వలన కీల నొప్పులు, వాపులు తగ్గించటం లో ఉపయోగ పడుతుంది.
# శరీరం లో మలినాలను తగ్గించి కణాలను తిరిగి ఉత్పత్తి చేస్తుంది.
# ఉదయాన్నే పరగడుపుతో కలబందను తీసుకోవటం వలన ఉదార సంబంధ సమస్యలు తగ్గుతాయి.
# స్త్రీలకు నెలసరి సమస్యలు (menstrual problems) పరిష్కరించటంలో కలబంద బాగా పని చేస్తుంది. ఉదయాన్నే పరగడుపుతో కలబంద ముక్క తీసుకుని పై పొరను తొలగించి శుభ్ర పరిచి తింటే ఆడవారికి సంబంధించిన సమస్యలు చాలా వరకు నయం అవుతాయి. చేదు అనిపిస్తే కొంచెం పంచదార చల్లుకుని తినవచ్చు.
# కాన్సర్ (cancer), గుండె జబ్బులకు (heart diseases), కిడ్నీ సమస్యలకు (kidney problems) ఇలా రక రకాల సమస్యలకు కలబంద మంచి ఔషధం.
# కలబంద గుజ్జును (Aloe Vera gel) పగిలిన మడమలకు రాస్తే పగుళ్లు తగ్గుతాయి.
# జుట్టు సమస్యలను కూడా కలబంద నివారిస్తుంది. కలబందను చీల్చి దాని లోపలి గుజ్జును రసంలా చేయాలి. కొబ్బరి నూనె, కలబంద రసం సమ భాగాలుగా తీసుకుని రెంటిని కలిపి పొయ్యి మీద సన్నని సెగపైన ఉంచి కలుపుతూ ఉండాలి. సగం అయ్యేవరకు ఉంచి తర్వాత దించేయాలి.
-> ఈ నూనెను రోజు గోరు వెచ్చగా చేసి తలకు పట్టించి బాగా మర్దన చేయాలి. ఇలా ఆరు నెలలు చేస్తే జుట్టు తెల్లబడటం తగ్గుతుంది. జుట్టు బలంగా ఉంటుంది.
# చుండ్రు నివారణకు (anti dandruff), హెయిర్ ఫాల్(hair fall) తగ్గటానికి కలబంద గుజ్జును తలకి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు కూడా మెరుస్తుంది.
# చర్మ సౌందర్యానికి కలబందతో రకరకాల ఫేస్ పాక్స్ (face packs) ట్రై చేయొచ్చు.
-> మోచేతులు, మోకాళ్ళపైన నలుపు పోవాలంటే  కలబంద రసం లో కొంచం కొబ్బరి నూనె వేసి కలిపి నల్లగా ఉన్న చర్మం పైన రాస్తే నలుపు తగ్గుతుంది.
-> మొటిమలు తగ్గటానికి హాఫ్ టీ స్పూన్ కలబంద రసంలో హాఫ్ టీ స్పూన్ చందనపు పొడి(sandal powder), హాఫ్ టీ స్పూన్ ముల్తానీ మట్టి (multani mitti) కలిపి ముఖంపై ప్యాక్ లా వేయాలి.
-> కలబంద రసం ముఖ్నికి పట్టించి ఆరిన తర్వాత కడిగేసిన ముఖం కాంతివంతం గా ఉంటుంది.
-> కలబంద రసం కాలిన గాయాలపై రాస్తే గాయాలు మానిపోతాయి.
  ఇంత విలువైన కలబందతో అనుబంధం పెంచుకుందాం…. ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని పంచుకుందాం!!

photo credits : wiki media commons