ఈయన్ని వదిలించుకోవడ కష్టమే, వైసిపి భరించాల్సిందే: సుధాకర్ రెడ్డి విశ్లేషణ

నర్సాపురం వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యేట్టున్నారు. ఆయనను వదిలించుకోవడం రూలింగ్ పార్టీకి అంతసులభం కాదని అర్థమవుతూ ఉంది. ఎందుకంటే, ఆయనను లోక్ సభనుంచి  అనర్హుని చేయించేందుకు పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు లేదు. పార్టీనుంచి బహిష్కరించినంత్రామాత్రాన అది ఆటోమాటిక్ గా అనర్హతకు దారితీయదు. అందువల్ల స్పీకర్ ఆయనను అనర్హుడిగా ప్రకటించే అవకాశాలు తక్కువ.
అందుకే ఇపుడు వైసిపి కొత్త పల్లవి ఎత్తుకుందని. జగన్ కరిష్మాతో లోక్ సభ ఎన్నికల్లో గెలిచింనందు ఇక పదవి నుంచి రాజీనామా చేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు సీనియర్ జర్నలిస్టు ఎన్ బి సుధాకర్ రెడ్డి.
ఒక మంత్రి ఇలా డిమాండ్ చేయడం ఏమిటి? అంటే రఘురామ రఘరామ కృష్ణం రాజును డిస్ క్వాలిఫై చేయించడం కష్టమని పార్టీకి అర్థమయిందనట్లే లేక్క కాదా అన్నది సుధాకర్ రెడ్డి అభిప్రాయం.  ‘వైఎస్ జగన్ చరిష్మాతో రఘురామ గెలిచావు. పార్టీ విధానాలు నచ్చకుంటే రఘురామ ఎంపీ పదవికి రాజీనామా చేయాలి’ అని అవంతి శ్రీనివాస్ అంటున్నారు.
దీని రఘరామ కృష్ణ రాజు సమాధానమిచ్చేశారు. ‘నా విజయంలో నా ఛరిష్మా కూడా ప్రముఖపాత్ర పోషించిందని చాలా సార్లు చెప్పాను. మళ్లీ మీకు కూడా చెప్తున్నాను.నా వరకు మీకు మల్లే ఒక్కరి వల్లే గెలవలేదు. నాకు రాజీనామా చేయవలిసిన అవసరం ఏ మాత్రం లేదు.’ అని రఘరామ చాలా స్పష్టంగాచెప్పారు.
నా పైన మీరు సాక్షి లో ఇచ్చిన ఈ ప్రకటన తో మీ పదవి పదిలం గా ఉండాలని మనస్పూర్తి గా ఆశిస్తున్నానని ఆయన చురకవేశారు. దీని మీద సుధాకర్ రెడ్డి విశ్లేషణ: