తిరుపతికి విదేశీ విమానాలు ఎందుకు రావడం లేదు?

(నవీన్ కుమార్ రెడ్డి)

ప్రపంచ ప్రఖ్యాత  పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి విదేశాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం రేణిగుంట విమానాశ్రయానికి కాంగ్రెస్ ప్రభుత్వ అంతర్జాతీయ విమానాశ్రయం హోదా నిచ్చేందుకు పునాది రాయి వేసింది. నిధులు కేటాయించడం జరిగింది. పనులు వేగవంతంగా చేయడం జరిగింది!

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతీయ విమానాలే తప్ప అంతర్జాతీయ విమానాలు రావడం లేదు.  కారణం నిధుల అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేందుకు  మంజూరు లేక పనులు నత్తనడకన సాగుతున్నాయి!

బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయంగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి పక్కన పెట్టారు.

చిల్లిగవ్వ కూడా నిధులు మంజూరు లేదు దీనిపై చిత్తూరు జిల్లా బిజెపి నాయకులు ప్రశ్నించకపోవడం శోచనీయం!

కేంద్ర విమానయాన శాఖ మంత్రి, బీజేపీ ప్రముఖులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు త్వరలో అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని ప్రకటించడం అనేది “అరచేతిలో వైకుంఠం” చూపడమే!

బిజెపి నాయకులు ప్రతినిత్యం కేంద్ర మంత్రులకు,బిజెపి ప్రముఖులకు విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్నారు దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు కానీ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనుల గురించి బిజెపి ప్రముఖుల దృష్టికి తీసుకోకపోవడం లోని ఆంతర్యం ఏమిటి?

A.P సీఎం తో పాటు,మన ఎంపీ లు సైతం పార్లమెంట్ లో బిజెపి పై ఒత్తిడి చేసి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి నిధులు మంజూరుతో పాటు అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించే విధంగా చొరవ చూపాలి!

రేణిగుంట విమానాశ్రయానికి కోవిడ్ ముందు సుమారు 23 డొమెస్టిక్ విమాన రాకపోకలు జరిగేవి కోవిడ్ తర్వాత కేవలం 13 విమానాలు మాత్రమే రాకపోకలు కొనసాగిస్తున్నాయి!

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభమైతే మన ప్రాంతంలో పండే పంటలను రైతులు ఎగుమతి చేసుకునే అవకాశంతో పాటు ఆర్థిక వ్యాపార లావాదేవీలతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది!

(నవీన్ కుమార్ రెడ్డి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *