చైనీస్ యాప్ ల నిషేధం ఎందుకు విస్తరించడం లేదు, కారణాలివిగో…

యుద్దాలిపుడు ఏ  మాత్రం లాభసాటి కాదు.  విపరీతంగా ఆర్థిక భారం మోపుతాయి. ఎంతో మంది ప్రాణాలు తీస్తాయి. ప్రజలందరి యుద్ధ భారం పడుతుంది. దేశమంతా కష్టాలనుభవిస్తుంది. యుద్ధ సమయంలో ఏమర్జన్సీ విధిస్తారు.ఆహారం రేషనింగ్ విధిస్తారు. వార్ టాక్స్ ఉంటుంది. ప్రతిసరుకుని మితంగా వాడుకుని మిలటరీకి ఎక్కువగా కేటాయించాలి. ఇంతాచేసి యుద్ధంలోసాధించేది లేదు. గాయలుతప్పయుద్ధం ఏమీ మిగిలించదు.అందుకే అంతర్జాతీయ యుద్ధాలు 1945 తర్వాత రాలేదు. వచ్చినవన్నీసరిహద్దుల వివాదాలే. ఈ వివాదాల్లో కూడా ప్రాణ నష్టం, దేశానికి అర్థిక నష్టం వచ్చింది తప్ప కొట్లాడుకున్న దేశాలు సాధించింది లేదు. ఎవరూ ఒక అంగుళం భూమిని అక్రమించుకున్నది లేదు.  ఎపుడో వ్యవసాయిక యుగంలో అంతర్జాతీయ వర్తకం వీల్లేదు కాబట్టి రాజులు ప్రక్కనున్న రాజ్యాలను జయించేందుకు జైత్రయాత్రలు జరిపి ఆ భూభాగాలు అక్రమించకుని అక్కడి నుంచిపన్నులు విసూలు చేసుకునే వారు, అక్కడ వాణిజ్యం కల్పించే వారు.దీనికోసం జరిపే యుధ్దాలలో వేలాది మందిచనిపోయే వారు.  అధునిక కాలంలో, పెట్టుబడుల క్షణాల్లో ప్రపంచమంతా తిరిగి వాణిజ్యం, వర్తకం చేస్తున్నాయి కాబట్టి వ్యాపారం చేసి సంపాయించేందుకుయుద్ధం చేయనవసరంలేదని అంతా గుర్తించారు. అందుకే 1945 తర్వాత యుద్ధాలేవు. ఎక్కడయినా జరిగినా వాటినుంచి నష్టపోవడమే తప్పనష్టం లాభం లేదు.
ఇలా కాకుండా, దేశాలు, కొన్ని వేల మైళ్ల దూరాన ఉన్నప్పటికి రెండు సంతకాలు చేసి వాణిజ్య వర్తక వప్పందం చేసుకుంటే పరిశ్రమలు పెట్టుకోవచ్చు, పెట్టుబడులు ఇమ్మాడు కోవచ్చు.ఇంపోర్టు ఎక్స్ పోర్టు డ్యూటీలతో ప్రభుత్వాదాయాలు పెంచుకోవచ్చు.కోట్లాది మంది ప్రజలకు ఉద్యోగాలొస్తాయి. పైసా ఖర్చులేకుండా వేలకోట్ల రుపాయలు సంపాదించడం శాంతికాలంలో జరుగుతుంది. అందుకే ప్రఖ్యాత సాంఘిక తాత్వికుడు ప్రొఫెసర్ నోవా యువల్ హరారే చక్కగా “ While war became less profitable, peace became more lucrative than ever,” అన్నారు. యుద్ధాల కాలం అయిపోయింది. రెండుదేశాలు పీస్ ఫుల్ గా ఉంటే లాభమెక్కువ. కొట్లాడితే టెన్షన్ ఎక్కువ. అందుకే యుద్ధాల కాలం చెల్లిపోయిందని ఆయన చెబుతున్నారు. ఇదిభారత్ చైనాలకు వర్తిస్తుంది.
భారత్ చైనా ప్రపంచంలో అతి ప్రాచీన నాగరిక దేశాలు, గొప్ప సంస్కృతిక సంబంధాలున్న దేశాలు. బార్డర్ గొడవ తీసేస్తే రెండు దేశాల మధ్య స్నేహపూర్వక చరిత్రయే ఎక్కువ. రెండు దేశాల మధ్య వాణిజ్య వేల సంవత్సరాల నాటిది. అయితే,  మొన్న రెండుదేశాల మధ్య గొడవ జరిగింది. భారతదేశం నుంచి 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనావైపు నుంచి అంతకంటే ఎక్కువ మంది చనిపోయారని చెబుతున్నారు. అంతకు మంచి ఉద్రిక్తతలు ముందుకు పోయే అవకాశంలేదు. దానివల్ల నష్టమేమిటో రెండుదేశాలు గుర్తించాయి కాబట్టి ఇరుదేశాలు గొప్పగా దౌత్యమార్గాలలో ఉద్రిక్తత సడలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. చాలా ఉన్నత స్థాయిలో  చర్చలు సాగిస్తున్నాయి. చర్చలు సఫలమవుతున్నాయి. ఉద్రిక్త ప్రాంతాలనుంచి  సైన్యాలను ఉపసంహరించుకుంటున్నాయి.
ఈ మధ్యలో చైనా మీద భారత్ దేశం ట్రేడ్ దాడి మొదలు పెట్టింది. 59 చైనా యాప్ లను నిషేధించింది. కొంతమంది ట్రేడ్ వార్ మొదలయిందన్నారు. అయితే,  ఇది చాలా చిన్న టోకెన్ ప్రొటెస్ట్ మాత్రమే. ఈ యాప్ ల రద్దు వల్ల చైనా ఆత్మాభిమానం, ఎకానమీ గాయపడేంత దెబ్బతగలదు. ఇందులో చాలా యాప్ లు ఇంకా రెవిన్యూ సంపాదించడంలేదు. ఇందులో బాగా సక్సెస్ అయిన యాప్ టిక్ టాక్ . దాని రెవిన్యూ 25  మిలియన్ డాలర్లు మించలేదు. ఈ 59యాప్ ల్ల చైనా ఆర్థిక వ్యవస్థకు చేకూరుతున్న లాభం పెద్దగా లేదు. అందుకే చైనా కూడా తీవ్ర ఆందోళన (Strongly concerned) వ్యక్తం చేసింది తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. చైనా మీదనిజంగా ఆర్థిక దెబ్బతీయాలనుకుంటే వేరే మార్గాలు లేవా? చైనాలో ప్రకంపనలు పుట్టించే కంపెనీల జోలికి భారత్ ఎందుకు వెళ్లలేదు. ఇదే ఇపుడు జరుగుతున్నచర్చ.
చైనా ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రప్రభావంచూపే రంగాలను బహిష్కరిస్తే భారత్ కు వచ్చే నష్టమేమిటో ప్రభుత్వానికి తెలుసు కాబట్టే వాటి జోలికి వెళ్లకుండా, చిన్న యాప్ లు, గాలిపటాలు, ఆటబొమ్మలు,క్యాండిల్స్ వంటి ని నిషేధించే పనిలో పడింది. ఇలాంటి అంతగా ఆర్థిక ప్రాముఖ్యం లేని వాటిని దిగుమతి చేసుకోకుండా నిషేధించడం వేరు, భారీ పరిశ్రమల ఉత్పత్తులను నిషేధించడం వేరు అని ప్రముఖ ఆర్థిక నిపుణుడు స్వామినాథన్ అయ్యర్ వ్యాఖ్యానించారు.
ఈ రోజు ఆయన ఎకనమిక్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ యాప్ లనే నిషేధించింది తప్ప ఇతర భారీ పరిశ్రమల ఉత్పత్తుల జోలికి వెళ్ల లేదో వివరించారు. “ ఇలాంటి చిన్న ఉత్పత్తులను నిషేధించినా భారత దేశంలో సరుకుల ధరలు పెరగవు.ఎందుకంటే, ఈ ఆటబొమ్మలను, క్యాండిల్స్ ను, గాలిపటాలను భారతదేశలోం కూడా తయారు చేస్తారు. దేశం లో కొరతేమీ ఉండదు. అలా కాకుండా చైనా నుంచి దిగుమతి  చేసుకుంటున్న భారీయంత్రాలను, ఇక్కడి పరిశ్రమలు ముఖ్యంగా ఎరువులు కర్మాగారాలు, ఫార్మ కంపెనీలు దిగుమతి చేసుకునే నిషేధించడం కష్టం. ఎందుకంటే, వీటిని దిగుమతి చేసుకోవడం నిలిపివేస్తే, ప్రపంచంలో ఏదేశమూ వాటిని భారత్ కు  సరఫరా చేసే స్థితి లేదు. ఒక వేళచేసిన చైనా అందించే ధరలకు ఎవరూ అందించలేరు,”అని స్వామినాథన్ అయ్యర్ అన్నారు.
చైనా నుంచి భారత్ 7.2 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్ కాంపొనెంట్స్ ను దిగుమతిచేసుకుంటూ ఉంది. వీటిని భారత్ ఇంత భారీగా చౌకగా అందించే మరొక దేశంప్రపంచం లేదు. తర్వాత కంప్యూటర్లు,కంప్యూటర్ కాంపొనెంట్లు, ఎలెక్ట్రికల్ సర్క్యూట్స్, కాంపొనెంట్స్,  సెమికండక్టర్ చిప్స్, కాంపొనెంట్స్  చైనా నుంచే వస్తాయి.  చైనా దిగుమతుల్లో వీటి వాట 11 శాతం. ఇవి కాకుండా   ఫార్మా, టాయ్స్-గేమ్స్, పాదరక్షలు, జౌళి వస్తాలు, ఎరువులు, బొగ్గు, ఆర్గానిక్ కెమికల్స్ కూడా భారీగా చైనానుంచి వస్తాయి. వీటిని ఇప్పటికిప్పడు సరఫరా చేసే మరొక దేశమే లేదు. అందుకే చైనా కోపమొచ్చినా, భారత ప్రభుత్వం వీటిని నిషేధించలేదు. వీటిని నిషేధిస్తే చైనా నష్టపోతుంది. భారత్ అంతకంటే ఎక్కువగా నష్టపోతుందని స్వామినాథన్ అంటున్నారు.
ASEAN దేశాలలో దేనితో కూడా చైనాకు మంచిసంబంధాలు లేవు. అయితే, ఏ దేశమూ చైనాను నిషేధించలేదు. సరిహద్దు వివాదాలు, వాణిజ్యం వేర్వేరు. వాటిని కలిపేస్తే ఇరు పక్షాలు  నష్టపోతాయి. చైనా నుంచి తక్కువ ధరలకు కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, సెమికండక్టర్ చిప్  రసాయనాలు భారత్ దిగుమతి అవుతున్నాయే  కాబట్టే వాటి ఆధారంగా భారత్ అంతర్జాతీయ వాణిజ్యంలో ఇతర దేశాలతో పోటీ పడగలుగుతూ ఉంది.
ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం 2018 లో భారత్ చైనా నుంచి 90 బిలియన్ డాలర్ల విలువయిన యంత్రాలను, ఎలెక్ట్రానిక్స్ ను, కెమికల్స్ , కన్స్యూమర్  గూడ్స్ ని దిగుమతి చేసుకుంది.
 సోషల్ మీడియా గోలలో కొట్టుకుపోయి, భారీ పరిశ్రమల ఉత్పత్తులను నిషేధిస్తే మునిగేదెవరో భారత ప్రభుత్వానికి తెలుసు. అందుకేయాప్ ల బ్యాన్ తర్వాత,  బ్యాన్ చైనా అరుపులు తగ్గిపోయాయి. ఇతర ఉత్పత్తులకు విస్తరించలేదు.
చైనా ను  ట్రేడ్ వార్ ప్రకటించాలనుకుంటే  ఇలాంటి యాప్ లనుకాదు, చైనాని ఆయువు పట్టున కొట్టే పరిశ్రమలను మీద నిషేధం విధించాల్సి ఉండింది.
Oppo, Vivo, Xiaomi, Haier, Lenovo కంపెనీలు చైనా ప్రతిష్టకు సంబంధించిన కంపెనీలు. చైనా వీటిని నేషనల్ సక్సెస్ స్టోరీగా చెప్పకుంటుంది. చైనా టెక్నాలజీ పవర్ ను ప్రపంచానికి చాటిచెప్పిన కంపెనీలలో ఇవి కూడా ఉన్నాయి. వీటన్నింటికి ఇండియా లో భారీ మార్కెట్ ఉంది. ఉదాహరణకు స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో Xiaomi ఎంత విజయవంతమయిందో చెప్పనవసరంలేదు. 2019 మొదటి క్వార్టర్ లో Xiaomi smartphone  మార్కెట్ షేర్ 30.6 శాతం. ఇది రెండో స్థానంలో ఉన్న శ్యామ్ సంగ్ (22.3శాతం) కంటే చాలా ఎక్కువ. ఈ కంపెనీలు ఇండియాలో యూనిట్లు పెట్టినపుడు ఆయా రాష్ట్రాలు గర్వపడ్డాయి. వీటిని నిషేధించాలని భారత్ భావించనేలేదే. ఎందుకు?
కారణం సింపుల్. సరిహద్దున 20 మంది సైనికులు బాయడం బాధకరమయన సంఘటన. ఇలాంటివి మళ్లీ జరగరాదు. అందుకే భారత్ చాలా సంయమనంతో ప్రవర్తించి యాప్ లను టోకెన్ గా నిషేధించింది తప్ప చైనా మీద అల్ అవుట్ వార్ డిక్లేర్ చేయలేదు. ఇలాంటి యుద్ధం వల్ల నష్టపోవడం తప్ప సాధించిందేమీ ఉండదు. ఇండియా ఒకటినిషేధిస్తే మరొకటి నిషేదిస్తుంది.దీనివల్ల ఉద్రికత్త పెరగడం రెండు దేశాలకు వచ్చేదేమిలేదు.స్నేహంగా ఉంటే ఇద్దరు చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు. పరిశ్రమలు పెట్టుకోవచ్చు. దీనితో కోట్ల ఉద్యోగాలొస్తాయి. సంపద పెరుగుతుంది. ప్రజలు పేదరికం నుంచి బయపడతారు. ఇదే రెండు దేశాలు తీరులో కనిపిస్తింది. ఇది అభినందించాల్సినవిషయం. సోషల్  మీడియా గొంతుచించుకుంటూనేఉంటుంది. ప్రపంచక్యాపిటలిజం ఇక ముందు ఎపుడూ యుద్ధంలోకి ప్రవేశించదు. యుద్ధం క్యాపిటజలిం లక్షణం కాదు.