గుడ్ న్యూస్:  కోవిడ్ నయమయ్యాక ఇమ్యూనిటి యమ స్ట్రాంగ్ : శాస్త్రవేత్తలు

కోవిడ్ కు విరుగుడు ఎపుడెపుడు వస్తుందా ఆత్రంగా ఎదురుచూస్తున్నవాళ్లందరికి గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ క్యాలిఫోర్నియా లోని లా జోలా ఇన్ స్టిట్యూట్ ఫర్ ఇమ్యునాలజీ ( La Jolla Institute for Immunology) నుంచి వస్తున్నది. గుడ్ న్యూస్ ఏంటంటే…ఒకసారి కరోనా వైరస్ సోకి జబ్బు నయమయిన వారిలో కోవిడ్ -19 యాంటి వైరల్ ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ తయారవుతుంది. అంటే మరొక సారి కోవిడ్ రావడం చాలా కష్టం.
దీనితో  కరోనా వ్యాక్సిన్ తయారు చేసేవాళ్లంతా మరింత ఉత్సాహంగా పనిచేయవచ్చు. ఈ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను ప్రఖ్యాత శాస్త్ర పరిశోధన జర్నల్  సెల్  (Cell)లో ప్రచురించారు.
“కోవిడ్ -19 నుంచి కోలుకున్న వారిలో ఏదో ఒక స్థాయిలో ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటే మేము ఆందోళనచెందేవాళ్లం, అదిఆందోళన కలిగించే విషయం,’ అని  ఈ ఇన్స స్టి ట్యూట్ కు చెందిన  సెంటర్ ఫర్ ఇన్ ఫెక్షియస్  డిసీజెస్ అండ్ వ్యాక్సిన్ రీసెర్చ్ (Center for Infectious Diseases  and Vaccine Research)కు చెందిన  ప్రొఫెసర్  అలెజాండ్రో సెట్టె తెలిపారు.ఆయనే ఈ రీసెర్చ్ పేపర్ ను రాసింది కూడా. ‘ ఇలా కోవిడ్ నయమయిన వారిలో కరోనావైరస్ స్పైక్ ప్రొటిన్  కుశరీరంలో రోగనిరోధక టి సెల్ స్పందన చాలా బలంగా తయారయింది. ఇపుడు కోవిడ్ -19 కు వ్యతిరేకంగా సాగుతున్న పరిశోధన లక్ష్యం కూడా ఇదే,’ అనిఆయన చెప్పారు.
 (“ … but what we see is  a very robust T cell response against the spike protein, which is the target of the most ongoing COVID-19 efforts as  well as other viral pro other proteins.”)
పరిశోధన కోసం సెట్ బృందం 20 మందిని ఎంపిక చేసుకుంది. వీరంతా కోవిడ్ 19 నుంచి కోలుకున్నవారు.  కోవిడ్ అంటుకున్నాక, రోగుల రోగ నిరోధక శక్తి ఎలా పనిచేస్తుందనేది, శరీరంలో వైరస్ కు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తి ఏమేరకు అభివృద్ధి అయిందనే దాన్నిఅర్థం చేసుకునేందుకు ఇదిబాగా పనికొచ్చింది. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్  రూపొందించేందుకు ఈ విజ్ఞానం చాలా అవసరం.
కరోనా మనిషి శీరర కణజాలం లో చొచ్చుకుపోయేందుకు  వైరస్ కు  పొడవాటి కొమ్ముల పాత్ర చాలా ఉంటుంది. అందువల్ల ప్రపంచంలోని శాస్త్రవేత్తలో దృష్టంతా ఈ కొమ్ముల ప్రొటీన్ (spike protein)  పడింది. దీనిని నిర్వర్యం చేస్తే కరోనా వైరస్ శరీరకణాల్లోకి ప్రవేశించలేదు. కరోనా మనిషి శరీక కణజాలంలోకి ప్రవేశించాలంటే ఈ కొమ్ములతో కణం మీద వాలుతుంది. అపుడు ఈ స్పైక్ ప్రొటీన్  మనిషి కణంలోని రక్షణపొరకు అతుక్కుంటుంది. అపుడు ఈ రెండు రెండు పొరలు కలసి పోయి, వైరస్- శరీర కణంలో  ఒకటై పోతుంది. అపుడు వైరస్ లోని జన్యు పదార్థం కణంలోకి ప్రవేశిస్తుంది.

Like this story? Please share it to a friend!

ఈ పరిశోధన విశేషమేమిటంటే, ఈ శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన వ్యక్తులందరిలో కరోనా అంటుకుని,సహజంగా నయమయింది. రోగంవచ్చాక వాళ్లెవరూ హాస్పిటల్ లో చేరలేదు. అందుకే మందులతో అవసరం లేకుండా వారిలో సహజంగా రోగనిరోధక వ్యవస్థ (Immune system) వైరస్ కు వ్యతిరేకంగా ఎలా మార్పు చెందిందనే తెలుసుకునేందుకు వీలయింది. సాధారణంగా వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించాక కొన్ని అసాధారణమయిన మార్పలు తీసుకువస్తుంది.ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తి ఎలా బడిందో తాము అర్థము చేసుకున్నామని సెట్టె చెప్పారు.
“We specifically chose to study people who had a normal course and didn’t require hospitalization to provide a solid benchmark for what a normal immune system response looks like, since the virus can do some very unusual things in some individuals: Alessandro Sette
ఈ స్టడీకి ఎంపిక చేసిన 20 మందిలో  టి-సెల్ (T-cell) చాలా ఆరోగ్యకరంగా ఉంది.ఈ టిసెల్ యే మనిషి ఇమ్యూన్ సిస్టమ్ లో కీలక పాత్ర పోషించేది. టి-సెల్ బలంగా ఉండటమనేది శీరరం వైరస్ కు వ్యతిరేకంగా యాంటీ బాడిలను తయారుచేసిందనేందుకు నిదర్శనం. ఇవే తర్వాత  కరోనా ఇన్ ఫెక్షన్ ఉన్న సెల్స్ ను అంతం చేస్తాయి. టిసెల్స్ అనేవి తెల్ల రక్తకణాలే. శరీరంలోకి వచ్చే రకరకాల రోగకారకాలకు (pathogens)తగ్గట్టుగా మనిషి ఇమ్యూన్ వ్యవస్థను మార్చడంలో ప్రధాన పాత్ర పోషించేది టి సెల్సే.
కోవిడ్-19 సైన్స్ కి ఎంతో శుభ సమయం ఎందుకంటే యాంటిబాడీలలో కోవిడ్ -19కి ఒక సమాధానం దొరికందని  సెట్ బృందం చెబుతూ ఉంది.