Home Features పాపులర్ బ్రాండ్ అయిన ‘టీ సెల్లర్’… సామాన్యుడి అసమాన సక్సెస్ స్టోరీ

పాపులర్ బ్రాండ్ అయిన ‘టీ సెల్లర్’… సామాన్యుడి అసమాన సక్సెస్ స్టోరీ

163
0
(pic credit: Diya Snacks)
చాలా ఊర్లలో బాగా పేరున్న టీ హోటళ్లుంటాయి. అట్లాగే వాటికేమాత్రం తీసిపోని  టీ బండ్లూ ఉంటాయి. కొన్ని హోటళ్లెలాగయితే చాయ్ కేంద్రాలయిపోతాయో, కొన్నిచోట్ల రోడ్డు మీది బండ్లు అద్భతమయిన టీకి  బ్రాండ్ నేమ్ అయిపోతాయి. హైదరాాబాద్ బేసిగ్గా టీ సిటీ.అందుకే ఎక్కడైనా మంచిటీ దొరుకుతుంది.  ఎక్కాడైనా నా  కిష్టమయిన ‘చీనికమ్ పత్తి తేజ్’ (ఇరానీ హోటల్లో నయితే ఏక్దమ్  కడక్) అద్భుతంగా దొరుకుతుంది.
హైదరాబాద్ లో  ఇరానీ చాయ్ హోటళ్లకయితే, కెఫె నీలోఫర్, రెడ్ రోజ్, కెఫె బహార్, లామాకాన్,సర్వి, నయాగరా, బ్లూసీ, ప్యారడైజ్, మదీనా…టీ కి ఫేమస్.
కానీ, బండ్లకు ఇలాంటి పేర్లుండవు.  వాటి గురించి చెప్పడం కష్టం. ప్రతి క్రాస్ రోడ్డులో తప్పకుండా ఒక బండి  ఆప్రాంతంలో పాపులర్ బ్రాండ్ అయివుంటుంది.  తార్నాక సెంటర్ లో టీ షాపు లాగా. పేర్లున్నా గుర్తుండవు. చౌరాస్తా పేరే వాటికి స్థిరపడుతుంది.
ఇలాంటి షాపుల్లో టీ అద్భుతంగా కాచడమే కాదు, టీ తయారీని ఒక గొప్ప కళ గామలుచుకుంటారు. వీటిన్నింటికి ఇసింగ్ అక్కడి షాపులో కనిపించే కలుపుగోలు తనం.
లాక్ డౌన్ రాకముందు హైదరాబాద్ నాగోల్ సెంటర్లో ఒక బండి ఉండేది. దూరాన నిలబడి ఐలూ అని పిలిస్తూనే ఐలయ్య మనం ఎంతమంది ఉన్నామో అక్కడినుంచే లెక్కగట్టి, ఎంత స్ట్రాంగో వూహించి ట్రేలో పంపిస్తాడు. ఈ స్నేహమే ఈ టీబండ్ల ట్యాగ్ లైన్.
అయితే,  ఇవన్నీ ఒక ఎత్తు, చెన్నై సెంట్రల్ స్టేషన్ పక్కనున్న టీ షాప్ ఒక ఎత్తు.  ఇలాంటి రోడ్ సైడ్ టీ హోటల్ ఇండియాలో మరొకటి ఉండదు. ఇక్కడి టీ రుచే వేరు. ఈ  టీ గురించి వోనర్ ఆర్ రాజీవ్ చెప్పే రహస్యాలన్నీ రాస్తే ఒక ఆయుర్వేద గ్రంధమవుతాయి.  రాజీవ్ చేప్పే టీ విషయలన్నీ వింటే అతగాడు టీ హోటలేనా అనిపిస్తుంది.   ఈ చిన్న చాయ్ దుకాణానికి  రాజీవ్ ‘దియా స్నాక్స్ ’ (Diya Snacks) అని పేరు పెట్టుకున్నాడు గాని, నేనైతే దాన్ని  ‘టీ వైద్యశాల’ అని పిలుస్తాను. అదే కరెక్టు మాట. రైల్వే స్టేషన్ కు హడావిడిగా వచ్చిపోయే వాళ్లు గమనించారో లేదో గాని, రాజీవ్  టీని ‘టీ’ లాాగా కాకుండా అదొక దివ్యౌషధంలా తయారు చేసిస్తాడు. వైద్యానికి రాజీవ్ టీకి చాలా అనుబంధం కూడా ఉంది.

రాజీవ్ మొదటి టీ హోటల్ మద్రాస్ మెడికల్ కాాలేజీ పక్కన ప్రారంభించాడు. డాక్టర్ పోరగాళ్లంతా ఇక్కడి టీ కొచ్చే వాళ్లు. వాళ్లకెందుకో నార్మల్ టీ నచ్చలేదు. వర్షాలొచ్చిన చిత్తడిలో వాతావరణం చలిచలిగా ఉన్నపుడు  ఘాటైనా టీ కావాలన్నారు. అది జలుబుకు దగ్గుకు బాగా పని చేస్తుందని చెప్పారు. కొందరయితే, బ్లాక్ టీ లో తులసి ఆకులడిగారు. ఇంకొందరికి శొంటి టీ కావాలి. మరికొందరికి అల్లం ఘాటు  కావాలి.   అంతే, రాజీవ్ ‘టీ  ఔషధం’ అన్వేషణ మొదలయింది. ఇవి కాకుండా అసలు ఎన్నిరకాలు హెర్బల్ టీలు తయారుచేయవచ్చు, ఎలా తయారు చేయవచ్చు,  తాను తయారు చేసే  కషాయానికి టీ రుచి ఉండాలి, ఔషధ గుణం ఉండాలి.  ఈ బిజినెస్ ఆతృత రాజీవ్ ని    వాళ్ల నాయనమ్మ దగ్గరకు,వూర్లో ఉన్న  ఇతర ఆయుర్వేద వైద్యుల దగ్గరకు  తీసుకెళ్లింది. నాయనమ్మ ఎన్ని రహస్యాలు చెప్పిందో.

ఈ స్టోరీ మీకు నచ్చితే, మీ మిత్రులందరికి షేర్ చేయండి

రాజీవ్ అటవీ ప్రాంతం నుంచే వచ్చాడు.కేరళ పాలక్కాడ్ అటవీ ప్రాంతంలోని శ్రీక్రిష్ణాపురం వాళ్ల ఊరు. అక్కడ నానా అకుల, బెరడ్ల, వేర్ల రసాలను జబ్బులకు మందులుగా తాగడం అలవాటు. ఈ ఎథ్నిక్ మెడికల్ రహస్యాలు నాయనమ్మ దగ్గిర నుంచి నేర్చుకుని  మద్రాసు టీ బండి మీద ప్రయోగాలు మొదలుపెట్టాడు. అంతే సూపర్ హిట్టయ్యాయి.  మెల్లిగా మెల్లిగా వైరేటీ లు పెంచాడు.

మీ పొరుగునే ఇలాంటి నైబర్ హుడ్ వండర్స్ ఉంటాయి. నాలుగు ముక్కలు రాసి ఒకటి రెండు ఫోటోలు పెట్టి పంపితే ఇలా చిన్నచిన్నజీవితాలాను ఘనంగా సెలెబ్రేట్ చేసుకోొవచ్చు వాట్సాప్ నెంబర్ 8919595528. It’s time to celebrate the ordinary

2012లో బండిని మద్రాసు సెంట్రల్  పార్క్ టవును స్టేషన్ దగ్గిరకు మార్చాడు. అప్పటికి రాజీవ్ 62 రకాల హెర్బల్ టీ లను తయారు చేస్తున్నాడు. అన్నీ హిట్  అయ్యాయి. అన్నింటికి స్పెషల్ క్లయింటీల్ డెవలప్ చేసుకున్నాడు. టీ తాగే వాళ్లు కూడా ఇక్కడి మెడికల్ షాపుకు వచ్చినట్లు రావడం విశేషం. అన్నా, రాజీవ్,  జ్వరంగా ఉంది, మంచి టీ ఇవ్వు అంటే, రాజీవ్  దాానికి తగ్గ టీ కలిపిస్తాడు. మీ కెందుకు వొంట్లో బాగలేదో చెప్పడి, రాజీవ్ దగ్గిర దానికి టీ వుంది. ఇలాఇపుడు  దియా స్నాక్స్ లో  100 రకాల హెర్బల్ టీలున్నాయి. అందుకే ఈ చిన్న ఈ కొట్టును “వైద్య’చా‘ల” అనాలనిపిస్తుంది.
రాజీవ్ టీ హోటల్లో దొరికే టీ లివే (pic credit: Diya Snacks)
అసలు వైద్యానికి, రాజీవ్ కి ఏదో అనుబంధం ఉన్నట్లుంది.  1997లో రాజీవ్ చెన్నైకి వచ్చాడు. అపుడు అతని వయసు 17 సంవత్సరాలు. ఎలాగైనా సరే చెన్నైలో మెడికల్ కాలేజీలో సీటు కొట్టాలని కేరళ నుంచి  వచ్చాడు.అయితే, చదవు వొంటపట్లేదు. ఇంటర్లోనే చదువు మానేశాడు. బతుకు దెరువుకోసం ఒక హోటల్ లో చేరాడు.  తర్వాత సొంత టీ బండి ప్రారంభించి ఇపుడిలా ’టీ డాక్టర్’ అయిపోయాడు. దియా స్నాక్స్ లో ఇపుడు రోజు వందలీటర్ల పాలు ఖర్చవుతాయి.
ఈ టీ  హోటల్ ని ఆయన  ఒక  పెద్ద ఆయుర్వేదం వైద్యశాలలాగా నడుపుతున్నాడు. ఏ టీ గురించైనా అడగండి, ఎంత వైద్యం చెబుతాడో, మీకు తల తిరిగిపోతుంది. ఏ మూలికని ఏ అడవి నుంచి ఎంతకష్టపడి తెచ్చి,  శుద్ధి చేసి,  హెర్బల్ టీ గా మార్చిన విధానం… అబ్బో ఆయన్నుంచే వినాలి. అంతేకాక, ప్రతి మూలికకు సుదీర్ఘ వైద్య చరిత్ర ఉంటుంది. ఆ మూలికను పాలక్కాడ్ ప్రాంతంలో దానిని ఏ జబ్బుకు వాడతారో చెబుతాడు, అది ఎలా మనిషిలో పవర్ ఫుల్ మందులాగా పనిచేస్తుందో వివరిస్తాడు. ఆయన్తో టీ తాగుతూ పదినిమిషాలు (టైం దొరికితే) మాట్లాడితే, మీరు టి కొట్టు వాడితో మాట్లాడారా లేక కాకలు తీరిన ఆయుర్వేద పండితుడితో  మాట్లాడారా అనే అనుమానం వస్తుంది.
ఇదేదో పబ్లిసిటీ కోసం, వెరైటీ కోసం చేస్తున్న నాటకం కాదు. టీ కి మెడిసినల్ గుణాలున్నాయని రాజీవ్  గట్టిగా నమ్ముతాడు. దానికి మూలికలను కలిపి ఇంకా శక్తి వంతంగా తయారు చేస్తున్నానని చెబుతాడు. టీ అల్కెమీ మీద ఇంతగా కృషి చేసిన టీ కొట్టువాడు మనకెక్కడా కనిపించడు.
ఆయుర్వేద ఫార్మసీ కాదు, టీషాపే… pic credit: Diya Snacks
రాజవ్ సెంట్రల్ స్టేషన్ దగ్గిరకు రావడం చిత్రంగా జరిగింది. మున్సిపాలిటీ వాళ్లు ఆయన టీ బండి దారికడ్డం వస్తూ ఉందని బలవంతంగా మెడికల్ కాలేజీ దగ్గిర నుంచి తీసుకువచ్చి ఇక్కడి షాపులో పడేశారు. అయితే, ఇక్కడికొచ్చాక గాని తెలియలేదు,  ఇదే మంచి కార్నర్ అని. ఎందుకంటే రైల్వే స్టేషన్ సమీపాన ఉండటంతో రాజీవ్ దశ ఉన్నట్లుండి అనుకోని, అద్భుతమయిన మలుపుతిరిగింది. వ్యాపారం  బాగా పెరిగింది. అయితే, దీన్ని మరొక పెద్ద హోటల్ లోకి తరలించాలనుకోలేదు. ఆయన వొట్ట మూలి (Ottamooli) కేరళ ఆయుర్వేదాన్ని ప్రచారం చేయాలనుకుంటున్నాడు. అంతేకాదు, సొంతంగా ఒక హెర్బల్ గార్డెన్ పెంచాలని ఆయనకు కోరిక. ఎందుకంటే, తన టీ షాపు కి అవసరమయిన మూలికలు ఫ్రెష్ గా దొరుకుతాయి, రెడీ గా అందుబాటులోనూ ఉంటాయి. మీరేదయినా మూలిక కావాలని అడగండి, ఆయన లేదనకుండా తెప్పిస్తాడు, ఉచితంగానే.రాజీవ్ దగ్గిర ఏ టీ అయినా రు. 10 లే.  ఒక్క తేనేటీ మాత్రమే రు.20.
రాజీవ్ తో మాట్లాడాలనుకుంటే ఇదే ఫోన్ నెంబర్ 9500191311. రాజీవ్ టీ స్టాల్ సామాన్యుడి అసమాన విజయానికి సాక్ష్యం.