Home Features ఆన్లైన్ భోధన ముఖాముఖి బోధనకు ప్రత్యామ్నాయం కాదు: ముగ్గురుప్రొఫెసర్లు

ఆన్లైన్ భోధన ముఖాముఖి బోధనకు ప్రత్యామ్నాయం కాదు: ముగ్గురుప్రొఫెసర్లు

190
0
(ప్రొ.చక్రదరరావు, ప్రొ.హరగొపాల్, ప్రొ.కె.లక్ష్మీనారాయణ)
కరోనా అనే ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్చి 16 నుండి రాష్ట్రంలోని ని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు మూసివేశారు. ఫలితంగా మొత్తం బోధన,పరీక్షలు ఆగిపోయాయి. మొత్తం పాఠశాల విద్యలో, ఉన్నత విద్యలో 30-40 శాతం వరకు సిలబస్ మిగిలిపోయింది. ఈ సిలబస్ ను పూర్తి చేయడానికి విద్యాశాఖ అధికారులు ఆన్లైన్ విద్యను ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయంగా చూపుతున్నారు. రాబోయే కాలంలో కొంత సిలబస్ ఆన్లైన్ లో పూర్తి చే యాలని UGC ని ర్ణయం తీసుకొన్నది.ఇటువంటి ఆలోచన సరి అయినది కాదని విద్యా పరిరక్షణ కమిటీ భావిస్తున్నది.
ప్రత్యక్ష ముఖాముఖీ విద్య లో తరగతిగదిలో ఏదేని విద్యార్థి కాన్సెంట్రేషన్ చేయకపోతే అక్కడ ఉన్న టీచర్ ఆ విద్యార్థిని మందలించి, చెప్పే పాటం మీదికి దృష్టి మరల్చుతాడు. ఏదైనా విద్యార్థికి పాఠం మద్యలో సందేహం కలిగినప్పుడు దానిని నివృత్తి చేస్తూ మిగతా పాఠాన్ని కొనసాగిస్తాడు. వివిధ రకాల సామాజిక ఆర్థిక నేపథ్యంలో నుండి వచ్చిన విద్యార్థులకు ఎటువంటి ఉదాహరణలు చెప్పి అర్థం చేయించాలో ప్రత్యక్ష విద్య లో జరుగుతుంది. అటువంటివి ఎన్నో సమస్యలు ప్రత్యక్ష ముఖాముఖి విద్య ద్వారా జరుగుతుంది.ఇది ఆన్లైన్ విద్య ద్వారా అసాధ్యంఅని చెప్పక తప్పదు.
కరో నాలాంటి సంక్షోభ సమయంలో ఆన్లైన్ విద్య కొద్దిమందికి కొంత ఉపయోగ పడినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది ఉన్న సామాజిక,ఆర్థిక అసమానతలను పెంచి పోషిస్తుంది. మెజారిటీ గా ఉన్న దలిత ,పీడిత కులాలు, బీద బడుగు వర్గాల నుండి వచ్చే విద్యార్థులదగ్గర ల్యాప్టాప్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు మొదలైనవి లేవు. తెలంగాణ లో యునివర్సిటీ విద్యార్థులు కుడా 95 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కరెంటు లేక పోవడం,సిగ్నల్స్ రాకపోవడం, కంప్యూటర్ లిటరసీ లేకపోవడం వలన మెజారిటీి విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.
కనుక లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత జాన్- జూలై మాసాలలోఅన్నీ విద్యా సంస్థలు తెరువాలని కోరుతున్నా ము.తరగతి ని రెండుగా విభజిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ, షిఫ్ట్ పద్ధతులలో బోధించవచ్చు. అందుకు కావలసిన అదనపు గదులను నిర్మించడం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ,అధ్యాపక పోస్టులు యుద్ధ ప్రాతిపదికన నింపడం, విద్యా సంస్థలలో పరిశుభ్రత పాటించడానికి త్రాగునీరు, నీటి వసతి, కరెంటు తదితర వసతులు తప్పనిసరిగా ఉండేటట్టు చూడాలి. అదేవిధంగా అన్ని విద్యా సంస్థలలో ప్రత్యేకంగా పాఠశాలలలో ఆరోగ్య కార్యకర్తల్ని నియమించాలి. ఇలాంటి వసతులు,వనరులు కల్పించి ప్రత్యక్ష ముఖాముఖీ విద్యా బోధన కొనసాగించాలని తెలంగాణ విద్యా పరి రక్షణ కమిటి విజ్ఞప్తి చేస్తుంది.
(తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి. 19-5-2020న విడుదల చేసిన ప్రకటన)