Home Breaking ప్రభుత్వమూ Tiktok మోజులో పడింది, ఈ నెలలోనే అకౌంట్ ప్రారంభం

ప్రభుత్వమూ Tiktok మోజులో పడింది, ఈ నెలలోనే అకౌంట్ ప్రారంభం

229
0
SHARE
a facebook picture
చైనా యాప్స్ ని ఇతర ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్  ఎప్పటినుంచో వస్తున్నది. సోషల్  మీడియా ఈ డిమాండ్ తో ఠారెత్తి పోతున్నది. మొత్తానికి చైనా కంపెనీలు తయారు చేసిన  59 యాప్ లను ఇండియా నిషేధించాలనినిర్ణయించింది. ఇందులో టిక్ టాక్, హెలో యుసి బ్రౌజర్ తదితర యాప్ లు న్నాయి. వీటన్నింటిలో టిక్ టాక్ ఇండియాల్ చాలా పాపులర్ అయింది. టిక్ టాక్  మీద నిషేధం విధించాలన్న డిమాండ్ హోరెత్తడంకనీసం రెండేళ్లుగా నడుస్తూ ఉంది. ఇది భారత ప్రభుత్వానికి తెలుసు. చైనా యాప్ లమీద ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నా, భారత ప్రభుత్వం సరిగ్గా మూడు వారాల కిందట సొంతంగా టిక్ టాక్ అకౌంట్ వోపెన్ చేయడమే ఆశ్చర్యం. నిజానికి ఇపుడు బ్యాన్ విధించినా, దానికి రంగం ప్రిపేర్ కావాలంటే రకరకాల శాఖ లనుంచి నివేదికలందాలి.  అందుతూ ఉండాలి. దీనికి రెండుమూడు నెలల ఎక్సర్ సైజ్ అవసరం. నిర్ణయం  ఇండో-చైనా ఉద్రిక్తతల మ ధ్య తీసుకున్నా, ఈ యాప్ లో వచ్చై దేశ సెక్యురిటీ సమస్య గురించి ప్రభుత్వంలో అవగాహన ఉండాలికదా. అయినా సరే, భారత ప్రభుత్వం జూన్ ఎనిమిదో తేదీన టిక్ టాక్ అకౌంట్ (@mygovindia) ఒపెన్ చేసింది. ఈ అకౌంట్ కి  949.6వేల మంది పాలోవర్స్ ఉన్నారు. 6.9 మిలియన్ లైక్ లు వచ్చాయి. ఈ అకౌంట్ అఫిషియల్ ఫ్రొఫైల్ స్టేట్ మెంట్ ఏమిటో తెలుసా? “Citizen  Engagement platform of Government of India.” 1.3 బిలియన్ జనాభా ఉన్న భారతదేశంలో యువకులంతా ఎగబడి  డౌన్ లోడ్ చేసుకున్న యాప్ టిక్ టాక్. అందువల్ల భారతీయ భావజాలాన్ని, దేశభక్తిని, హిందూమత ప్రాముఖ్యాన్ని, యోగను ఈ యువకుల్లో తీసుకుపోయేందుకు వీడియో షేరింగ్ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ బాగా ఉపయోగపడుతుందని భారత ప్రభుత్వం భావించింది.  అందువల్ల కేవలం మూడు వారాల కిందట టిక్ టాక్ యాప్ భారత ప్రభుత్వానికి ఒక ప్రచారసాధనమనే  కేంద్రం భావించింది. ఆశ్చర్యంగా ఉందికదూ?
టిక్ టాక్ ప్లాట్ ఫామ్ అఫిషియల్ వెబ్ సైట్ లో ఏమిరాశారంటే…
“The @mygovindia  platform is a unique participatory governance initiative involving the common citizen at large. The Idea of MyGov brings the government closer to the common man by the use of online platform creating an interface for health  exchange of ideas and views  involving the common citizen and experts with the ultimate goal to contribute to the social and economic transformation of India.” (Source:The Times of India)
ఈ రోజు ఈ అకౌంట్ మాయమయింది. ఒకవైపు ఆత్మనిర్భర్ అని చెబుతూ, మరొకవైపు చైనా యాప్ లకు వ్యతిరేకంగా సోషల్ మీడియా సైబర్ ఆందోళన సాగుతున్నా భారత ప్రభుత్వ చైనా యాప్ ను వినియోగించుకోవాలనుకోవడం బాగా విమర్శలకు దారితీసింది.

 

 

 

 

 

 

భారత ప్రభుత్వం ఇపుడు 59 యాప్ లను నిషేధించాలనుకోవడం ఆత్మనిర్భర్ ప్రయోగం లో భాగమనిపిస్తుందా? లేక ప్రజలనుంచి వస్తున్న వత్తిడి వల్ల తీసుకున్న చర్య అనిపిస్తుంది. కరోనా గురిందీ దీపాలు వెలిగించమని, చప్పట్టు కొట్టమని, డాక్టర్ ల మీద పూల వర్షం కురిపించమన్న భాతర ప్రభుత్వం ఇపుడు చాాలా రోజులుగా ఎలాంటి ఉత్తేజం కల్గించే కార్యక్రమాలు చేపట్టడం లేదు. భారత్ లో కరోనా విజృంభిస్తున్నది. ఇలాగే చైైైనా పేరేెత్తేందుకు జంకుతూ ఉంది. ఎందుకంటే, సోమవారం నాడు 59 యాప్ లను నిషేధిస్తూ జారీ చేసిన ప్రకటనలో చైనా మాటేలేదు.అలాగే ఆదివారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన మన్ కీ బాత్ లో కూడా చైనా ప్రసక్తే లేదు.ఎందుకో మరి!
సూపర్ హిట్ యాప్ లు, ఇండియా ఎందుకు ఈ రంగంలోకి రాలేకపోయింది?
సాఫ్ట్ వేర్ సూపర్ పవర్ అని చెప్పుకుంటున్నా, భారతదేశం యాప్ ల రంగంలోకి ఎందుకు ఉదృతంగా రాలేకపోయిందనేది ఒక చిక్కు ప్రశ్న.దేశంలో ఒక సెక్షన్ చైనా యాప్ లమీద బాగా వ్యతిరేకత ఉన్నా, దేశంలో ఈ యాప్ లు  చాలావరకు విజయవంతమయ్యాయి. ప్రపంచంలో ఎక్కడ లేనంతా వేగంగా భారత్ టిక్ టాక్ వ్యాప్తి పెరిగింది. టిక్ టాక్ వాడేవాళ్లంతా 20-30 సంవత్సరాల వయసున్నవారే.  దేశంలో 12 కోట్ల మంది టిక్ టాక్ యాప్ ను డౌన్ లో డ్ చేసుకున్నానరు. క్లబ్ ఫ్యాక్టరీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నవారు 100 మిలియన్లు మంది.  కామ్ స్కాన్ యాప్ ను  2020 జనవరి నాటికే 100 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.అలీబాబ్ గ్రూప్ కు చెందిన యూసి బ్రౌజర్ ను డౌన్ లోడు చేసుకున్న వారు 137 మిలియన్లున్నారు.