అమ్మాయిని వివస్త్రను చేసి వీడియో తీసి

హైదరాబాద్ గాంధీ నగర్ లో దారుణం జరిగింది. గంజాయికి అలవాటు పడ్డ యువకులు ఓ అమ్మాయిని వివస్త్ర చేసి వీడియో తీశారు. ఆమె పై అత్యాచారం చేసి బ్లేడ్ తో కోసినట్టు తెలుస్తోంది.

గాంధీ నగర్ కు చెందిన ఓ అమ్మాయికి కొందరు మత్తు మందు పదార్థాలు అలవాటు చేసినట్టు తెలుస్తోంది. ఆ అమ్మాయి తన స్నేహితులతో కలిసి గంజాయి సేవించింది. మిగతా ఫ్రెండ్స్ అంతా వెళ్లిపోగా ఆ అమ్మాయి మత్తులో అక్కడే ఉంది. దీనిని గమనించిన మరో బ్యాచ్ అమ్మాయి పై దాడి చేసి బట్టలిప్పించారు. వీడియో తీసి ఆమె పై అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అమ్మాయి పై బ్లేడుతో కోసి పరారయ్యేందుకు ప్రయత్నించారు.

ఇంతలోనే అమ్మాయి స్నేహితులు అక్కడకు చేరుకొని ఇద్దరు దుండగులను పట్టుకొని చితకబాదారు. యువతిని వివస్త్ర చేసిన వీడియో మీడియాకు చిక్కింది. అది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *