దేశంలో ఇఫ్తార్ పార్టీ ఇచ్చిన తొలి హిందూ స్వామిజీ… 11 విశేషాలు

దేశంలో పేరుమోసిన పీఠాధిపతులు,మఠాధిపతులు చాలామంది ఉన్నారు.వాళ్లందరూ హిందూ ధర్మప్రచారం చేస్తూంటారు. మతానికి వాళ్లూ భాష్యం చెబుతూ ఉంటారు.  అయితే ఈ స్వామీజీలకు, ఈ  ఉదయం కాలధర్మం చెందిన  పెజావర్ మఠాథి పతి (ఉడుపి) శ్రీ విశ్వేష తీర్థ స్వామికి చాలా తేడా ఉంది. ఆయన ప్రముస్లింలకు ఉడుపి శ్రీకృష్ణ మఠంలోనే ఇఫ్తార్ పార్టీ ఇచ్చి సంచలనం సృష్టించారు .దేశంలో మత సామరస్యం చాలా అవసరమని భావించి ఆయన ముస్లింలను ఆలయానికి ఆహ్వానించారు. 2017లొ ఇది జరిగింది.  మారు 150 మంది ముస్లింలు తమ రంజాన్ ఉపవాసాన్ని 2017 జూన్ 26న స్వామీజీ సమక్షంలో విరమించారు. ఈ కృష్ణాలయ ప్రాంగణంలోనే వారు నమాజ్ కూడా చేశారు.
ఎంతో చరిత్ర ఉన్న ఉడుపి శ్రీకృష్ణాలయంలో ఇలా అన్యమతస్థులకు విందునీయడం, నమాజ్ కు అనుమతించడం ఇదే మొదటి సారి. స్వామీజీ స్వయంగా ముస్లింలకు ఖర్జూరాలు అందించారు. తర్వాత ఆలయ పూజార్లు అరటతిపళ్లు, జీడిపప్పు, కలింగర పండ్లు అందించారు. ఇంటర్నెట్ హిందువులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన మీద నిప్పులు చెరిగారు. ఇది హిందూమతం అంతానికి ఆరంభం అన్నారు. ఆధ్యాత్మికంగా, పాండిత్య పరంగా ఇంటర్నెట్ హిందువుల కంటే చాలా ప్రవేశం ఉన్న స్వామీజ దీనిని ఖాతరు చేయలేదు. తన చర్యను సమర్థించుకున్నారు. తొందర్లో ఇలాంటి గౌరవాన్ని క్రిష్టియన్లకు కూడా అందిస్తానని స్వామీజీ అపుడు ప్రకటించారు. ఇది నెరవేరకుండానే ఆయన చనిపోయారు.

Pejawara Mutt Viswesha Thirtha Swamiji Passes Away

ఉడుపి స్వామీజీ విశ్వేష తీర్థ స్వామీజీ గురించిన పదకొండు ఆసక్తి కరమయిన విషయాలు-
1. హిందూ స్వామీజీలలో లిబరల్ భావాలున్న స్వామీజీగా ఆయనకు పేరుంది. దళితులను చేరదేసేందుకు ఆయన చాలా కృషి చేశారు. దళిత వాడలకు వెళ్లి ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేప్టారు.
2.విశ్వహిందూపరిషత్ తో ఆయన మంచి సంబంధాలున్నాయి. అదే విధంగా గోరక్షణ, రామజన్మ భూమి క్యాంపెయిన్ లలో చరుకుగా పాల్గొన్నా, మత సామరస్యం ప్రబోధించేవారు.
3. స్వామీజీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన పూర్తిగా వ్యతిరేకం. ఇలా పోటీ చేస్తే స్వామీజీల ఆధ్యాత్మిక ఔన్నత్యం అంతరించిపోతుందని ఆయన వాదిస్తారు.
4. ఎనిమిది వందల సంవత్సరాల కిందట మధ్వాచార్య ఏర్పాటుచేసి ద్వైత తాత్విక సంప్రదాయానికి ఉడిపి మఠం కేంద్రం. దీనికి సంబంధించి మొత్తం ఎనిమిది మఠాలున్నాయి.  ఈ ద్వైత మఠాది పతి పరంపరలో విశ్వేష తీర్థ స్వామీజీ 33 వ వారు. ఆయన చాలా సన్నగా ఉన్నా, బలహీనంగా ఉండేవారు కారు. ఎనలేని శక్తి ఉండేదాయనలో. ఎపుడూ పర్యటనల్లో ఉండేవారు. పదిరోజుల కిందట ఆయన తిరుమల సందర్శించారు. ఒక ఏడాది కిందట ఆంధ్రలో కారుప్రమాదాని కి గురయ్యారు. అపుడు ఆయనకు కర్పూలు ఆసుపత్రిలో చికిత్స జరిగింది. ఆయనలో అన్ని వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తుండటం పట్ల డాక్టర్లు ఆశ్చర్య పోయారు.
5.ఆయన సంస్కృతంలో సాంబవిజయ అనే పద్యం రచించారు. మైసూరు మహారాజు నంజనగూడులో ఏర్పాటుచేసిన ఆగమత్రయ మహాసభకు 25వ యేటనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Pejawar Mutt Seer Hospitalized

6. స్వామీజి అయిదు సార్లు (1952,1968,1984,2000,2016) పర్యాయ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. అద్వైత పరంపరలో ఈ గౌరవం దక్కిన వారిలో విశ్వేష తీర్త స్వామీజీి రెండవ స్వామీజీ.
పర్యాయ సర్వజ్ఞ పీఠాధి పతికి ఉడిపి ఆలయంలో ప్రధాన దైవాన్ని పూజలు చేసే ప్రత్యేక హోదాతో పాటు ఉడిపి మఠాన్ని నిర్వహించే అధికారం కూడా ఉంటుంది. ఎనిమిది మఠాలలో ఈ గౌరవాన్ని అయిదు సార్లు దక్కించుకున్న స్వామీజీ ఈయనే.
7.ఆయన 85వ యేట ఈ బాధ్యతలు స్వకరించకుండా చిన్న స్వామి విశ్వప్రసన్న తీర్థకు ఇవ్వాలనుకున్నారు. చిన్న స్వామి దీనికి ఒప్పకోలేదు. గురువు గారు మరికొంతకాలం ఈ బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు.
8.1956లో విశ్వేష తీర్థ స్వామీ జీ బెంగుళూరులో ‘పూర్వ ప్రజ్ఞ విద్యాపీఠం ఏర్పాటుచేశారు. ఇది మధ్వ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఏర్పాటయిన గురుకులం.
9.1975 స్వామీజీ ఎమర్జన్సీని వ్యతిరేకించారు.సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు తర్వాత, ముస్లింలు, హిందువులు విజయోత్సవాలు ర్యాలీలు చేయరాదని చెప్పారు. ఇలా చేస్తే తాను నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.
10. స్వామీజీ పూర్వాశ్రమ నామం వెంకట రమణ. ఆయన 1930లో కర్నాటక రామకుంజలో నారాయణాచార్య, కమలమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఎనిమిదేళ్ల వయసులో హింపీ సమీపంలోని చక్రతీర్థ వద్ద నాటి పెజావర్ మఠాధిపతి విశ్వమాన్య తీర్థ స్వామీజీ సమక్షంలో సన్యాసం స్వీకరించారు.
11.కర్నాటకకు చెందిన శిరూర్ మఠాధిపతి శ్రీ లక్ష్మీ వర తీర్థ స్వామీజీ 2018 లో అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడాన్ని ఆయన వ్యతిరేకించారు.