Home Features కరోనా విరుగుడుకు భారత్ మందు, క్లినికల్ ట్రయల్స్ మొదలు

కరోనా విరుగుడుకు భారత్ మందు, క్లినికల్ ట్రయల్స్ మొదలు

120
0
(Image credits: wikimedia commons)
కరోనా జబ్బుకు  విరుగుడు కనిపెట్టేందుకు ప్రపంచం పరుగులు తీస్తూ ఉంది. ఈ పరీక్షలు  రెండు రకాలుగా  సాగుతున్నాయి. ఇందులో ఒకటి ఉన్న మందుల్లో ఏదయిన కరోనా మీద పనిచేస్తుందా అని చూడటం. రెండోది కొత్తగా మందు లేదా వ్యాక్సిన్ ను కనిపెట్టడం. ఇప్పటి వరకు నాలుగు రకాల మందులు యూరోప్ అమెరికాలలో పరీక్షలలో వున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఈ పరీక్షల్లోకి భారతదేశమూ ప్రవేశించింది. యాభైయేళ్లకిందట బ్యాక్టీరియా వల్ల జరిగే బ్లడ్ పాయిజనింగ్ కు ఒక భారతీయ  శాస్త్రవేత్త కనిపెట్టిన ఔషధ మొకటి కోవిడ్ -19  పనిచేస్తుందని కూడా భావిస్తున్నారు.
కరోనా వల్ల కూడా బ్లడ్ పాయిజనింగే జరుతుంది, అదే ప్రాణాపాయంగా మారుతూ ఉంది. అందువల్ల ఈ ఔషధాన్ని కరోనా రోగులమీద పరీక్షించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది.  సిఎస్ ఐఆర్ (Council of Scientific and Industrial Research: CSIR) నిర్వీర్యమయిన బ్యాక్టీరియాతో కలసి వున్న ఈ ఔషధం తో మూడు ప్రయోగాలు చేసేందుకు అనుమతిసంపాదించింది.
ఇందులో మొదటి ప్రయోగం కోవిడ్ -19తో తీవ్రంగా అస్వస్థతకు గురయిన 50 మంది రోగుల మీద ప్రయోగిస్తారు.  ఈ ఔషధం పేరు సెప్సివాక్ (Sepsivac). దీనిని సెస్పిస్ (Sepsis) అనే రోగ లక్షణం (blood poisoning)కి వాడి రోగులు మృత్యు వాత పడకుండా చూస్తుంటారు. ఇది ఇంట్రావీనస్ మందు. అంటే నేరుగా రక్తంలోకి ఎక్కించే మందు.
ఈ ఔషధం సెకండ్ ట్రయల్  కరోనా రోగ లక్షణాలు కనిపించని పాజిటివ్ పేషంట్ల లో సుమారు 500 మంది చేస్తారు. వారికి ఈ మందు ఎక్కించి ఫలితాలను పరీక్షిస్తారు. వీళ్లలో  రోగనిరోధక శక్తిపెంచేందుకు  ఈ ఔషధం ఏ మేరకు పనిచేస్తుందో చూసేందుకు వీరికి ఈ మందు ఎక్కిస్తారు. ఎందుకంటే ఇమ్యూనిటీ పెరిగితే వీరికి రోగం రాదు.
ఇక మూడో పరీక్షను  పెద్ద సంఖ్యలో ఒక మాదిరి జబ్బు పడ్డ కోవిడ్ రోగులకు ఎక్కిస్తారు. రోగం ముదిరి ఐసియుకు వెళ్లే పరిస్థితి రాకుండా కోవిడ్ ను అక్కడే అరికట్టేందుకు ఈ ఔషధం పనిచేస్తుందేమో చూసేందుకు వీరికి ఈ మందు ఎక్కిస్తారు.

Think your friends would like the story? Please share it!

‘ఈ మందు మీద పరీక్షలు నిర్వహించేందుకు మాకు  డ్రగ్ కంట్రోలర్ జనరల్  నుంచి మూడు పరీక్షలకు అనుమతి లభించింది.  మొదటి దశ ట్రయల్ ఇపుడు మొదలవుతుంది. వీటి ఫలితాలు 35 నుంచి 45 రోజుల్లో వస్తాయి. ఈఫలితాలను బట్టి మిగతా రెండు దశల పరీక్షలకు వెళతాం,’ అని  సిఎస్ ఐఆర్ కోవిడ్ -19 నివారణ కార్యకలాపాల కోఆర్డినేటర్, సిఎస్ ఐఆర్ –ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటెగ్రేటెడ్ మెడిసిన్ డైరెక్టర్ రామ్ విశ్వకర్మ  డెక్కన్ హెరాల్డ్ కు చెప్పారు.
ఈ ఔషధంలో ఉన్న ప్రధానమయిన దినుసు మైకో బాక్టీరియమ్ డబ్ల్యూ (Mycobacterium W –MW). దీనికే తర్వాత  దీనిని కనిపెట్టిన భారతీయ జీవశాస్త వేత్త  పేరు పెట్టారు. ఆయన పేరు  డాక్టర్ గురుశరణ్ ప్రసాద్ ‘ ప్రాణ్’ తల్వార్. ఆయన పరిశోధనకు గుర్తుగా బాక్టీరియమ్ ఒక స్రెయిన్ కు  మైకోబాక్టీరియమ్ ఒక స్రెయిన్ కు   ఇండికస్ ప్రానీ ( Micobacterium Indicus Pranii- MIP) అని పేరు పెట్టరు. ఢిల్లీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీని (NII)ని స్థాపించింది కూడా ఆయనే. అందుకే ఆయనకు ‘ఫాదర్ ఆప్ ఇండియన్ ఇమ్యూానాలజీ’ అని పేరు.
ప్రపంచంలో మొట్టమొదటి లెప్రసీ వ్యాక్సిన్ కనిపెట్టిందాయనే. నిజానికి ఆయన పేరులో ప్రాణ్ అనే మాట లేదు. ఆయన పుట్టాక పెట్టిన పేరు గురుశరణ్ ప్రసాద్. అయితే, పుట్టిన ఎనిమిదో రోజునే తల్లిచనిపోయింది. అపుడు అమ్మమ్మ ఆయనని  ఒక స్వామీజీ దగ్గరకు తీసుకువెళ్లింది. ఆయన ప్రాణ్ అని పేరు సూచించారు. అందుకే రికార్డులలో ఆయన పేరు గురుశరణ్ ప్రసాద్ అని ఉన్నా, ఆయన్ని అంతా ప్రాణ్ అనే పిలిచేవారు అని ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసింది.
తల్వార్ లెప్రసీ వ్యాక్సీన్ కనిపెట్టడం చాలా చిత్రంగా జరిగింది. ఆయన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ డైరెక్టర్ పదవికి అంగీకరించకపోయి ఉంటే, ఎఐఐఎమ్ ఎస్ (AIIMS) లో జీవరసాయన  శాస్త్ర ల్యాబోరేటరీలో ఉండిపోయేవాడు. తనెలా లెప్రసీ వ్యాక్సీన్ కనిపెట్టాడో ఆయనే వివరించారు.
1970 లో ఒక రోజు ఒక సంఘటన జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కిి చెందిన ఇమ్యూనాలజిస్టుల బృందమొకటి ఆ రోజు  ఎయిమ్స్ లోని ఆయన కార్యాలయానికి వచ్చింది.  ఆగ్నేయాసియా దేశాలన్నింటికి పనికొచ్చే విధంగా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వారు వెల్లడించారు. దానికి ఆయనని డైరెక్టర్ గా ఉండాలని కోరారు.
‘అది ముఖ్యంగా లెప్రసీ మీద పరిశోధన చేయాలి. ఇది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే,  ఆ జబ్బు గురించి నాకు తెలియదు, కారణం, నేను డాక్టర్ని కూడా కాదు. అపుడు నన్ను వప్పించే ప్రయత్నం చేశారు. ఇండియాలో లెప్రసీ రోగులు ఎక్కువగా ఉన్నారు. అమెరికా వాళ్లొచ్చి మీకుసాయం చేయరుగా. మీరే ముందుకు వచ్చి రోగాన్ని నివారించాలి. కాబట్టి మీరు ముందుకు రావాలి’ అన్నారు. నాకు తప్పలేదు. నియామకం పత్రాల మీద సంతకాలు శాను,’ అని జిపి చెప్పారు.
ఆయన NII బాధ్యతలు స్వీకరించాక లెప్రసీ వ్యాక్సిన్ తయారీ పరిశోధన మొదలయింది. ఈ క్రమంలో వారికి  MIP బ్యాక్టీరియమ్ కనిపించింది. ఇది లెప్రసీకి కారణమయిన బాక్టీరియమ్ (Mycobacterium leprae)ని చంపేసేలా రోగి శరీరంలోని టి- సెల్స్ (T-Cells) ని తయారు చేసింది.  అంతే వ్యాక్సిన్ తయారయింది.
1970 దశకంలో లెప్రసీ కి వ్యాక్సిన్ తయారు చేసేందుకు పనిచేస్తునన తల్వార్ బృందానికి  MW కనిపించింది. తర్వాత దీనినే లెప్రసీ వ్యాక్సీన్ తయారీకి ఉపయోగించారు. అయితే, తర్వాత దీనిని టిబితో పాటు కొన్ని రకాల క్యాన్సర్ కూడావాడవచ్చనికనుగొన్నారు. అందుకే ఇపుడు దీనికి కరోనా మీద కూడా ప్రయోగిస్తున్నారు.
దీనిని కమర్షియల్ మాన్యుఫ్యాక్చరింగ్ ని క్యాడిలా (Cadila) చేస్తున్నది. ఇపుడుఢిల్లీ, బోపాల్ , చండీగడ్ లలోని జాతీయ వైద్యసంస్థలతో పరీక్షలు  నిర్వహిస్తారు.
మనిషి శరీరంలోకి ప్రవేశించి రోగానికి కారణమవుతున్నబ్యాక్టీరియా వంటి బయటి శక్తులను ఎదుర్కనేందుకు వీలుగా రోగనిరోధక శక్తి పెంచేందుకు ఈ ఔషధం బాగాపనిచేస్తుంది. దీని వల్ల సెస్పిస్ మరణాల సంఖ్య యాభై శాతం దాకా తగ్గాయి. కోవిడ్-19 మీద కూడా ఇది పనిచేస్తుందేమోనని చూసేందుకు భారతీయ డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు.