బంగారానికి ఉన్నంత విలువ ప్రకాశం మరొక లోహానికి లేదు. అందుకే ప్రతిసమాజం బంగారానికి చాలా విలువ నిచ్చింది. అందుకే మంచిదేదయినా సరే బంగారంతో పోల్చడం జరుగుతూ ఉంటుంది.
బంగారం పెద్ద ఫీల్ గుడ్ పాక్టర్. బంగారం ధరిస్తే మనిషి సైకాలజీ కూడా మారిపోతుంది. మనిషిలో ఆత్మగౌరవం,విశ్వాసం పెరుగుతాయి. అందువల్లే భారత దేశంలో స్త్రీలే కాదు పురుషులు కూడాఏదో ఒక రూపంలో బంగారును ధరించాలనుకుంటారు.
బంగారం పసుపు పచ్చగా ఉంటుందనుకుంటాం. అయితే, బంగారం అనేక రంగుల్లో కూడా దొరుకుతూ ఉంది. పుసుపు పచ్చటి బంగారం అంటే 24 క్యారట్ల బంగారం అని అర్థం. దానికి కొత్త రంగు వచ్చిందంటే అందులో ఇతరలోహాలు కలిశాయని అర్థం. ఏమేరకు ఇతర లోహాలను అంటే వెండి,రాగి, పల్లాడియం, రోడియం, జింక్, బంగారంలో కలిపారనే దాన్నిబట్టి రంగులు మారుతాయి. ఈ మిశ్రమాన్ని బట్టే బంగారు ప్యూరిటీ ని కొలుస్తారు. ఇపుడు బంగారు కొలతల గురించి తెలుసుకుందాం.
బంగారు చాలా విలువయినది కాబట్టి ఒక వ్యత్యాసం కూడా విలువయినదే. అయితే, కొన్ని దేశాాల్లో స్వచ్ఛత విషయంలో రాజీ వుండదు. మరికొన్ని దేశాల్లో కచ్చితంగా కాకపోయినా రమారమి ఉంటే స్వచ్ఛత సర్టిఫికేట్ వస్తుంది. అపుడు దానిని మరొక దేశం అంగీకరించకపోయే ప్రమాదం ఉంది. ఈ స్వచ్ఛత రేంజ్ ని నెగటివ్ టాలరెన్స్ అంటారు.
బంగారు క్యారట్ అంటే..
బంగారు బరువును ట్రాయ్ ఔన్స్ లలో కొలుస్తారు. ఒక ట్రాయ్ ఔన్స్ అంటే 31.1034768 గ్రాములు. బంగారు ప్యూరిటీని క్యారట్లలో కొలుస్తారు. క్యారట్ (Caratలేదా karat లేదా KT) అంటే బంగారు స్వచ్ఛతకు ప్రమాణం.
బంగారు స్వచ్ఛత 24 బాగాలున్న స్కేలు. 24 క్యారట్ల బంగారం అంటే ఏ లోహం మిక్స్ కాని ప్యూర్ గోల్డ్ అని అర్థం. క్యారట్ సంఖ్య తగ్గే కొద్ది బంగారానికి మరొక లోహం కలిసిందని అర్థం. ఉదాహరణకు 18 క్యారట్ల బంగారం తీసుకుందాం. అంటే 24 క్యారట్లో 6 క్యారట్లు మరొక లోహం కలిసిందని, ఇందులో బంగారం కేవలం 18 క్యారట్లే నని అర్థం (18/24).
మరొక విధంగా చెబితే 18 క్యారట్ల బంగారంలో ఉండేది 75 శాతం మాత్రమే. 25 శాతం మరొక లోహం ఉందునుకోవాలి. గోల్డ్ మీద ముద్రించే ఫైన్ నెస్ (Fineness) నెంబర్లలో దీనిని 750 అని సూచిస్తారు. అంటే వేయి పాళ్లలో 750 పాళ్ల బంగారం ఉంది అని చెప్పడం.
ఇలా ఇతర లోహాన్ని మిక్స్ చేస్తూ పోతే బంగారు తగ్గిపోతూ ఉంటుంది. ఒక దశలో అందులో బంగారు కంటే ఇతర లోహమే ఎక్కువగా ఉంటుంది.
అందుకే ఒక వస్తువును బంగారు వస్తువు అనేందుకు ఒక ఫిక్స్ డ్ శాతం బంగారం ఉండాలని నిర్ణయించారు. ఇది ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అమెరికాలో 10 క్యారట్ల బంగారం ఉన్నపుడే దానిని బంగారు వస్తువంటారు.
అమెరికాలో ఒక వస్తువును బంగారు వస్తువు అనాలంటే కనీసం అందులో కనీసం 10 క్యారట్ల బంగారం ఉండాలి. ఫ్రాన్స్, ఇంగ్లండ్, ఆస్ట్రియా,పోర్చుగల్, ఇంగ్లండ్, ఇర్లండ్ లో బంగారు వస్తువులనే బడే వాటిలో కనీసం 9 కార్యాట్ల బంగారం ఉండాలి. డెన్మార్క్, గ్రీస్ లలో కనీస బంగారు 8 క్యారట్లు.
ఇపుడు ఫైన్ నెస్ (Fineness) గురించి చూద్దాం
బంగారు స్వచ్ఛతను మరొకవిధంగా ఫైన్ నెస్ రూపంలో కూడా చెబుతారు. ఒకటి క్యారట్ల లో చెప్పే స్వచ్ఛత. మరొకటి ఫైన్ నెస్ లో చెప్పడం.
ఫైన్ నెస్ అంటే వేయి పాళ్లలో ఎంత బంగారం ఉందని అర్థం. 18 క్యారట్ల బంగారం ఫైన్ నెస్ 750. అంటే వేయి పాళ్ల వస్తువులో బంగారం మోతాదు 750 పాళ్లని. దీనినే అభరణం మీద ‘హాల్ మార్క్’ పక్కన ఒక నెంబర్ గా చూపిస్తారు.
సాధారణంగా చూపించే ఫైన్ నెస్ నెంబర్లు ఇలా ఉంటాయి. 9 క్యారట్ల బంగారం (ఇంగ్లండు , కెనడా)పైన్ నెస్ .375; 10క్యారట్ల బంగారం ఫైన్ నెస్ .417; 14 క్యారట్ల బంగారం ఫైన్ నెస్ .583 ; 18క్యారట్ల బంగారం ఫైన్ నెస్ .750; 20 క్యారట్ల బంగారం (ఏసియా దేశాలు) ఫైన్ నెస్ .833; 24 క్యారట్ల ప్యూర్ బంగారం ఫైన్ నెస్ .999(1000).
ఈ లెక్కాచారం లో కొంత తేడా ఉంటుంది. 14 క్యారట్ల బంగారం అంటే ఫైన్ నెస్ లెక్కప్రకారం 14/24=.583333గా ఉండాలి. అయితే మన వ్యాపారస్థులు యూరోపియన్ స్టాండర్డ్ ప్రమాణంగా తీసుకుని ఫైన్ నెస్ ని .585 అని రాస్తూ ఉంటారు.
ఇదే విధంగా 24 క్యారట్ల బంగారం ఫైన్ నెస్ 24/24= 1.00 ఉండాలి .అయితే దీనిని ప్రతి బంగారులో కొంతఅంటే చాలా కొద్దిగా మిశ్రమం ఉండి తీరుతుంది. అందువల్ల 24 క్యారట్ల గోల్డ్ ఫైన్ నెస్ ను 999.9 అనిచూపిస్తారు. అంటే వేయి పాళ్లలో 999.9 పాళ్లు స్వచ్ఛత అని అర్థం.
బంగారానికి రంగెలా వస్తుంది
కలిపే లోహాన్ని లేదా రెండు మూడు లోహాలను బట్టి బంగారు వర్ణం మారుతూ ఉంటుంది.
9 క్యారట్ల ఎల్లో గోల్డ్ (Yellow Gold)లో 37.5 శాతం గోల్డ్, 42.5శాతం వెండి, 20 శాతం కాపర్ ఉంటాయి. Rose Gold(9k) బంగారం 37.5% వెండి20%కాపర్ 42.5% ఉంటాయి. వైట్ గోల్డ్ (10క్యారట్లు) తీసుకుంటే ఇందులో బంగారు 41.7 శాతం, వెండి 47.4 శాతం, జింక్ 0.9 శాతం, పల్లాడియం 10 శాతం ఉంటాయి.
నెగెటివ్ టాలరెన్స్
నెగెటివ్ టాలరెన్స్ అంటే ఫైన్ నెస్ విషయంలో ఎలాంటి సడలింపు లేకపోవడం. కొన్ని దేశాలలో క్యారటేజ్ విషయంలో ఒక రేంజ్ ఉంటుంది. ఆరేంజ్ లోపల కొద్ది వ్యత్యాసం ఉన్నా ఒకటే క్యారటేజ్ ఇస్తారు.
ఉదాహరణకు చైనా, హాంకాంగ్ తైవాన్ లలో 24 క్యారట్ల బంగారం అటే 99 శాతం మినిమమ్ ఉండాలి.
ఇండియా, ఇండియన్ సబ్ కాంటినెంట్ లో 22 శాతం గోల్డ్ అంటే 91.6శాతం గోల్డ్ఉండి తీరాలి.
గల్ఫ్ లో 21 క్యారట్ల బంగారం అంటే 87.5 శాతం బంగారు ఉండితీరాలి.
యుకెలో 18 క్యారట్ల బంగారం అంటే అక్షరాల 750 ఫైన్ నెస్ ఉండాలి.
అమెరికా లో నెగెటివ్ టాలరన్స్ అనుమతిస్తారు. వేయికి మూడుపాళ్ల నెగటివ్ టాలరెన్స్ ఉంటుందక్కడ. అంటే 18 క్యారట్ల బంగారం ఫైన్ నెస్ అమెరికాలో 747 మాత్రమే ఉంటుంది. దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్ లో వివాదం కూడా నడుస్తూఉంది.
యూరోపియన్ యూనియన్ దీనికి అభ్యంతరం చెబుతూ ఉంది.ఎందుకంటే, 747 ఫైన్ నెస్ ఉండే గోల్డ్ 18 క్యారట్ల బంగారం పరీక్ష అమెరికాలోపాసవుతుంది. ఇంగ్లండులో పాస్ కాదు. చైనా ప్యూర్ బంగారాన్ని Chuk Kam అంటారు. అయితే, దీనికి 1 శాతం నెగటివ్ టాలరెన్స్ అనుమతిస్తారు. 99 శాతం గోల్డ్ ఉంటే చైనాల్ో 24 క్యారట్ల బంగారంగా పరీక్ష పాసవుతుంది. ఇతర దేశాల్లో కష్టమవుతుంది.
One thought on “GOLD FACTS : బంగారు ప్యూరిటీలో చాలా రహస్యాలున్నాయి…ఇలా”
One thought on “GOLD FACTS : బంగారు ప్యూరిటీలో చాలా రహస్యాలున్నాయి…ఇలా”
Comments are closed.