సింప్టమ్స్ లేని కోవిడ్-19 కేసు నుంచి కరోనా వ్యాపించదు: WHO అభయం

 కరోనా పాజిటివ్ అని పరీక్షలో తేలగానే జనం ఆందోళనకు గురవుతారు.  వాళ్లనుంచి కరోనా వైరస్ ఇతరులకు సోకుతుందని భయపడతారు. అందుకే పాజిటివ్ అనే తేలగానే అధికారులు ఆయనతో కలసి ఉన్న వారిని పట్టుకునేందు కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెడతారు. పాజిటివ్ కేసులో  కోవిడ్-19 లక్షణాలు లేకపోయినా ప్రజలంతా భయకంపితులయిపోతుంటారు. ఇలాంటపుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక విషయం వెల్లడించింది.కరోనా గురించి  ప్రజల్లో ఉన్న ఒక పెద్ద ఆపోహను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టి వేసింది.ఎందుకంటే శాస్త్ర ప్రపంచంలో కూడా అసింప్టొమ్యాటిక్ కేసు covert transmitter కోవర్ట్ కేరియర్ అని భయపడే వాళ్లు. ఇదిగో ఈ బిబిసి రిపోర్టు The Mystery of Asymptomatic ‘Silent Spreaders’ చూడండి, అసింప్టొమ్యాటిక్ కేసులంటే ఎంతో అందోళన ఉందో అర్థమవుతుంది.
కోవిడ్-19 రోగలక్షణాలు లేని కరోనా పాజిటివ్ కేసుల నుంచి వైరస్ వ్యాపించదని ఈ సంస్థ తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ ఎపిడిమియాలజిస్టు మరియా వాన్ కెర్కోవ్ జెనీవా లో ఈ ప్రకటన చేశారు. జెనీవా హెడ్ క్వార్టర్స్ లో విలేకరులకు కరోనా గురించి వివరిస్తూ ఆమె ఈ ప్రకటన చేశారు.
ఇపుడు అందుబాటులో ఉన్న మన దగ్గిర ఉన్న సమాచారం ప్రకారం, రోగలక్షణాలు లేని (asymptomatic person) వ్యక్తి రెండో వ్యక్తికి వైరస్ ను అంటించడమనేది చాలా అరుదు, అని వాన్ కెర్కోవ్ చెప్పారు. రోగలక్షణాలు లేని వారి నుంచి వైరస్ మరొక వ్యక్తికి అంటుకోవడం చాలా అరుదని ఆమె చెప్పారు.
ఈ విషయం కాంట్రాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియలో బయటపడిందని ఆమె చెప్పారు. కోవిడ్-19 రోగుల తో కలసి ఉన్న వెదికే ప్రక్రియలో (contact tracing)లో చాలా మంది రోగలక్షణాలు లేని వారు పాజిటివ్ కేసులు కనిపించాయి. కాంటాక్ట్ పర్సన్సను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న దేశాలనుంచి సేకరించిన డేటాను పరిశీలిస్తే, రోగలక్షణాలు బయటపడని వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందకపోవడం కనిపించిందని వాన్ కెర్కోవ్ చెప్పారు. ఈవిషయాన్ని మరింత ద‌ృఢంగా నిర్ధారించుకునేందుకు ఈ డేటాను ఇంకా లోతుగా విశ్లేషిస్తున్నట్లు కూడా వాన్ కెర్కోవ్ తెలిపారు.
చైనాలోని వూహాన్ లో కూడాఇదే కనిపించిందని ఆమె చెప్పారు. వూహాన్ జనాభా 9.98 మిలియన్లు. మొన్నమొన్నటి దాకా కరోనా కూపంగా ఉన్న వూహాన్ లో జరిపిన పరీక్షలలో 300 మంది రోగలక్షణాలు పేషంట్లు (asymptomatic patients) కనిపించారని ఆమె చెప్పారు.
ఈ అసింప్టమ్యాటిక్ పాజిటివ్ కేసులకుసంబంధించిన టూత్ బ్రష్ లు, మగ్గులు, మాస్కులు, టవెల్స్, వారు రోజు వాడే ఇతర వస్తువులను పరీక్షిస్తే అవన్నీ కరోనా నెగిటివ్ అని తేలినవిషయాన్ని సిన్హువా న్యూస్ ఎజన్సీ రిపోర్టు చేసింది. దీనిని నిర్ధారించుకునేందుకు ఈ 300 మంది అసింప్టొమాటిక్ కరోనా పాజిటివ్ కేసులతో దగ్గిరగా మెలిగిన (close contacts)ను నిశితంగా పరిశీలించడం జరిగిందని, వారంతా కరనో నెగెటివ్ అని తేలిందని సిన్హువా రాసింది.
అయితే దీనిమీద భిన్నాభిప్రాయలు వ్యక్త మవుతున్నాయి. అసింప్టమ్యాటిక్ , ప్రి సింప్టొమ్యాటిక్ అని రెండురకాలున్నయాని, ఒక వేళ పరీక్షించేటప్పటికి అసింప్టొమ్యాటిక్ కేసులన్నీ ప్రిసంప్టొమ్యాటిక్ కేసులు అంటే, సింప్టమ్స్ రావడానికి ముందున్న దశలోని కేసలు కావచ్చు అని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రశ్నకు వివరణ ఇస్తుందేమో చూడాలి.