నేనెలా ఐఎఎస్ అయ్యానంటే…: అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడి అనుభవం

 అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు నిత్య ప్రయోగ శీలి. జిల్లాకు ఆయన నూరో కలెక్టర్. కర్నూలుజిల్లాకు చెందిన చంద్రుడు  ఆ మధ్య ఒక అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఒక రోజు కలెక్టర్ అంటూ శ్రావణి అనే బాలికను ఒక కలెక్టర్ గామార్చి  సంచలనం సృష్టించారు. ఆ ప్రయోగం జిల్లాలో మండలస్థాయి దాకా జరిపించారు. దీనితో  జిల్లాలలోని బాలికల్లో, తల్లితండ్రులలో ఉన్నత ఉద్యోగాల గురించి, ఉన్నత చదువులు గురించి కొత్త కలలు కనేలా చేశారాయన.  ఈ రోజు ఒక సమావేశంలో  తానెల కలెక్టర్ అయింది, అనుభవాన్ని పంచుకున్నారు.  చాలా సాదాసీదాగా కనపించే గంధం చంద్రుడు పట్టుదలకు మారు పేరు. ఆయన ఐఎఎస్ కు ఎంపికయిన తీరుతో అది అర్థమవుతుంది. ఐఎఎస్ కావాలని లక్ష్యం పెట్టుకోవడం, లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రమించడం ఆయన చక్కగా వివరించారు. కొన్నికలలు నెరవేరేందుకు టైం తీసుకుంటాయి. ఓపిక అవసరం మన్న గొప్ప సందేశం ఇచ్చారు. ఆయన మాటల్లో ఐఎఎస్ సాధించడమనేది దుర్లభం అని ధ్వనించకపోవడం విశేషం. లక్ష్యం మనస్ఫూర్తిగా నిర్దేశించుకన్నపుడు  ఆ లక్ష్యమే మనల్ని ఎలా ముందుకు తీసుకువెళ్తుందో ఆయన ఉపన్యాసంలో కనిపిస్తుంది.
ఆయన కథనంలో ఎంత నిజాయితీ ఉందో వీడియో చూస్తే అర్థమవుతుంది. సాటి టిటిఇలు తనకు నైతికంగా, ఆర్థికంగా ఎలా మద్దతునిచ్చారో ఆయన ఇ్పటికీ మర్చిపోలేదు… అందుకే ఆయన జిల్లాలో సామాన్యుల మెగా స్టార్ అయ్యారు.  ఇదిగో ఈ కింది వీడియో చూడండి….