క్యాన్సర్ బాధితులకు ఒక మంచి వార్త, ఈ వైద్యం ట్రై చేయండి

మృత్యు ముఖం నుంచి జీవితంలోకి  తిరుగు ప్రయాణం సాగించిన ఒక వ్యక్తి కథ ఇది. ఇదంతా పుస్తకంగా వచ్చింది.  క్యాన్సర్ బాధితులు అన్ని రకాల వైద్యాలను పరీక్షిస్తూ ఉంటారు.  స్వయంగా క్యాన్సర్ తో బాధపడి, బయటపడిన  డా.అమిత్ వైద్య చెబుతున్న ప్రత్యా మ్నాయ వైద్య పద్ధతి కూడా ఒక సారి ట్రై చేయడంలో తప్పు లేదు. తన పద్ధతిలో క్యాన్సర్ నయమైందని  ఈ పుస్తకంలో ఆయన  రాశాడు.అయితే, తన వైద్యం తప్పని సరి క్యూర్ అని ప్రచారం చేసుకోవడం లేదు.ఇదొక పద్ధతి అని మాత్రమే చెబుతాడు. క్యాన్సర్ బాధితులకు గైడెన్స్ ఇచ్చేందుకు  ఆయన ఒక స్వచ్ఛంద సంస్థకూడా ఏర్పాటుచేశారు ఎవరైనాఆయనను సంప్రదించవచ్చు. ఈ పోస్టు  ఫేస్ బుక్ నుంచి తీసుకున్నది. ఇందులో  రచయిత తన గోవు శైలిలో  ప్రత్యామ్నాయ వైద్యానికి  ఇంటర్ ప్రెటేషన్ ఇచ్చారు. ఇది బాగా వైరలవుతూ ఉంది. ఒక వ్యక్తికి ఆనందాన్నిచ్చేందుకు దోహదపడే దేన్నాయినా షేర్ చేస్తే తప్పులేదు.  దీనిని చదవండి,  షేర్ చేయండి…చర్చకూడా చేయండి.
 డా.అమిత్ వైద్య క్యాన్సర్  వైద్యం…
పై ఫోటో లో ఉన్న వ్యక్తే అమిత్ వైద్య. గుజరాతి. అయితే అమెరికా లోనే పుట్టి పెరిగాడు.ఎకనామిక్స్ లో డాక్టొరేట్ తీసుకున్నారు. ఎంటర్ టైన్ మెంట్ రంగంలో మంచి ఉద్యోగం.
‘నేను చురుకైన వ్యక్తినే కాని నా జీవితం అంతగా ఆరోగ్యంగా సాగడం లేదు’ అని అమిత్ చెప్పేవాడు.
తన జీవితమంతా కలతలు, విషాదాలే.
ఆయన తండ్రి క్యాన్సర్ తో  చనిపోయారు. అపుడు అమిత్ వయసు 27 సం.రాలు. తండ్రి మరణం  ఆయన విపరీతంగా కృంగదీసింది.
తన తండ్రికి  అమెరికాలో సుమారు రెండేళ్లు అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేసినా  ప్రయోజనం లేకుండా పోయింది. అమెరికా వైద్యం గురించి ఆయనకు చాలా గొప్ప అభిప్రాయం ఉంది. అమెరికాలో పేషంట్ల మీద చాలా గౌరవం ఉంటుందని, అవసాన దశలో ఉన్న వారికి చికిత్స చాలా బాగుటుందని ఆయన ఎకనమిక్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వైద్యంలో భారత్ కు అమెరికాకు ఉన్న తేడా గురించి ఆయన చాలా బాగా చెప్పారు. భారత దేశ ఆసుపత్రులలో ఇది దొరకడ చాలా చాలా చాలా కష్టం, దానికి మీజేబులు బాగా నిండుగాఉండాలని ఆయన చాలా స్పష్టంగా ఈ ఇంటర్వ్యూలో చెప్పారు(ఇంటర్వ్యూ కింద ఇచ్చాం)
ఆ తదుపరి తన తల్లి కూడా క్యాన్సర్  బారిన పడ్డారు. తండ్రి ఎడబాటుకి రెండు నెలల గడువులోనే తల్లి అకాలమరణం అమిత్ ను తీరని విషాదంలోకి నెట్టేసింది.
‘స్వదేశానికి చాలా దూరంగా బ్రతుకుతున్న నాకు ఇప్పుడు ఒంటరితనం మరింత భారంగామయింది.  ఎందుకంటే నాకూ  క్యాన్సర్ వుంది.  క్యాన్సర్ ఉందని 18  నెలల కిందట బయటపడింది. ఇప్పుడు క్యాన్సర్ లివర్ కు చేరింది. 9 నెలల తరువాత 2011  రిపోర్టుల్లో  ఆయన ట్రీట్ మెంట్ కు రెస్పాండ్ కావడం లేదని,  క్యాన్సర్ ఊపిరితిత్తులకు వ్యాపించిందని వెల్లడయింది. ఈ విషయాన్ని  ఆయన చాలా భావోద్వేగంగా చెప్పారు.
రోజులు దగ్గరపడుతున్నాయని డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు.
‘ఇక జీవితంలో ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. నా అంతిమయాత్రకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాను. చావును స్వాగతించడంలో నాకు భయంలేదు. నా తల్లి నా కళ్లెదురుగా మరణించిన తీరు నాకు చావు పట్ల భయంలేకుండా చేసింది. ఇది ఒక సినిమా ట్విస్ట్ లా అనిపించవచ్చు,  నా తల్లిదండ్రులను నేను మళ్లీ కలవబోతున్నాననే భావో ద్వేగం కలుగుతూ ఉంది. ఇక ఏ అప్షన్ లేకపోవడంతో  చరమాంకంలోకి జీవితాన్ని నడిపిస్తున్నాను,’ అని తన జ్ఞాపకాలలో రాసుకున్నారు.
అయితే,  చనిపోయేముందు ఒక్కసారి భారత్ కు రావాలని నిర్ణయించుకున్నారు అమిత్. మాతృభూమి మీద కాలుమోపేలోపే  చనిపోతానేమో ననే భయం కూడా ఉంది ఆయనకు. ఇక్కడ తమాషా చూడండి: భారత్ లో పుట్టిన తల్లితండ్రులు ఆమెరికాలో చనిపోయారు. తాను, అమెరికా లో పుట్టి, చనిపోయేందుకు స్వదేశం రావాలనుకుంటున్నాడు.
చివరకు భారత్ లో అడుగుపెట్టాడు. ఇక్కడున్న బంధువులను కలిశాడు. ఇదొక మధురానుభూతి. అయితే, వాళ్ల సమస్యల్లో వాళ్లున్నారు.  తాను క్యాన్సర్ తో చివరి క్షణాల్లో ఉన్నానన్న వాస్తవం తెలిస్తూనే అందరి తలుపులు మూసుకుపోయాయి. మళ్లీ దారం తెగిన గాలిపటంలో తనొక్కడే మిగిలాడు. చుట్టూ అసరా దొరకని అంధకారం.
‘నేను ఢిల్లీ లో ఒక మిత్రుడితో కలసి ఉంటున్నపుడు ప్రత్యామ్నాయ చికిత్సల గురించి తెలిసింది. వాళ్లు నా పట్ల చూపి ప్రేమ వాత్సల్యాలు నాకు మళ్లీ జీవితం పట్ల ఆశలు రేకెత్తించాయి. ఒక అత్త నాకు గుజరాత్ లో ఉండే ఒక ఆయుర్వేద వైద్యశాల గురించి చెప్పారు. ఒక రుపాయ తీసుకుని 11 రోజులు క్యాన్సర్ కు వైద్యం చేస్తారని ఆమె నాకు నచ్చ చెప్పారు. మరొక రకం వైద్య ప్రయోగం చేస్తే జీవితంలో పోయేదేముంది? సరే అదీ చూద్దామనుకున్నాను,’ అని ఆయన చెప్పారు.
అమిత్ గుజరాత్ ఆయుర్వేద వైద్యానికి వెళ్లాడు.
‘‘యోగా, ధ్యానం తో కలసి అక్కడ వైద్యం ప్రారంభించారు. వైద్యంలో భాగంగా నాటుఅవు పాలు, నెయ్యి, పెరుగు, పేడ, మూత్రంల మిశ్రమాన్ని పరగడుపునే తాపించేవారు.ఇంతవరకు ఏళ్ల తరబడి సాగిన కీమో ధెరపీ వల్ల నోరంతా పిడచ కట్టుకుపోయి ఉండింది. అందువల్ల ఈ కొత్త మిశ్రమాన్ని తాగేందుకు శ్రమ పడలేదు. అక్కడున్న మిగతా రోగులు ఇది తాగలేక మెలికలు తిరిగిపోయే వారు. చివరి దశలో ఉన్న నేను సులభంగా ఈ వైద్యాన్ని కూడా విశ్వసించాను. కఠినంగా ఫాలో అయ్యాను. నాకేమీ పెద్దగా నయమయినట్లు కనిపించలేదు. అయితే, పరిస్థితి దిగజారినట్లు కూడా అనిపించలేదు. స్కాన్ చేస్తే క్యాన్సర్ వ్యాపించ లేదని తెలిసింది. తర్వాత మళ్లీ ఆసుపత్రికి వెళ్లి మరొక 40 రోజులున్నాను. అపుడు నాకొక రైతు సహకరించాడు. ఉండేందుకు పొలంలోనే ఒక కొట్టం, ఒక మంచం, గోశాల ఇచ్చాడు. అక్కడొక టాయిలెట్ కూడా ఉండింది. కొన్ని నెలల పాటు చికిత్స తీసుకున్నాను. మార్పు కనిపించింది. మెల్లిగా నడవడం మొదలుపెట్టాను. తర్వాత గెంతడందాకా వచ్చింది. ఆపైన పరిగెత్తే దాకా పరిస్థితి మెరుగుపడింది. అక్కడున్న గ్రామస్థులు నాతో బాగా చనువుగా ఉండేవారు. అది నాకొక వరం. నాకు నయమవుతున్నపుడు కావలసిన మానసికోల్లాసం దీని వల్ల దొరికింది,’ అని ఆయన సగర్వంగా చెప్పారు.
18 నెలలు గడిచాయి. తాను క్యాన్సర్ నుంచి విముక్తి అయినట్లు కనుగొన్నాడు.
అంత్యక్రియలకు  ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఈ రోజు జీవితంలోకి పున: ప్రయాణించాడు.  పూర్తి ఆరోగ్యంతో జీవిస్తున్నాడు.
అంతేకాదు తన లాగా క్యాన్సర్ బాధితులకు  సేవలను అందిస్తున్నాడు. అక్కడా అంతా ఉచితమే. ఆయన స్థాపించిన  ఎన్జీవో  పేరే “హీలింగ్ వైద్య”.
అతను తిరిగి మళ్లీ అమెరికా వెళ్లలేదు.
అమిత్ రాసిన పుస్తకం Holy Cancer – How A Cow Saved My Life లో చాలా విషయాలు రాశాడు. ఈ పుస్తకం అమ్ముడుపోవడం వల్ల వచే రాబడిని ఆయన ఎన్జీవో నడపడానికి వాడుతున్నాడు.
( ఈ వార్తకి సోర్స్  ‘ది హిందూ’ లో వచ్చిన A journey from death to life )
అయితే, దీనిని అమిత్ వైద్య ప్రత్యామ్నాయం వైద్యంగా మాత్రమే చెబుతున్నారు. అంతకు మంచి ఆయన సైద్ధాంతిక ప్రాముఖ్యం ఇవ్వడంలేదు. ఈ విషయం ఆయన ఎకనమిక్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు.
అయితే, ఈ ప్రత్యామ్నాయం వైద్యం క్యాన్సర్ కు సంజీవని అని ఆయన కితాబివ్వడం లేదు.  క్యాన్సర్ కు ఏ ఒక్క వైద్యం పూర్తి చికిత్స కాదు,అన్నింటిని కలిపే సమగ్ర వైద్యం కావాలంటున్నాడు.
అందులో భాగంగానే తాను గోవును గౌరవిస్తున్నాడు తప్ప రాజకీయ,  మత సంబంధ కారణాలతో కాదంటున్నాడు. ఆయన ఎకనమిక్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ  ఇదే …

Surviving Cancer through the eyes of Amit Vaidya