హేయ్, మీరు రోజూ తినే తేనె ‘తేనె’ కాదు తెలుసా? CSE స్టడీ…

ఢిల్లీకి చెందిన  సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరాన్ మెంట్ (CSE) అనే ఎన్జీవో  మీ డైనింగ్ టేబుల్ మీద తారాడే భారీ కుంభకోణాన్ని బయటపెట్టింది.
కోవిడ్ కాలంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు  తేనె తినాలని డాక్టర్లంతా  ఢంకా భజాయించడంతో ప్రతిఇంట్లో ఇపుడు విధిగా ప్రత్యక్షమవుతున్నది తేనే సీసా. మీరంతా ఈ తేనె తిని రోగ నిరోధక శక్తి బాగా పెరిగిందని మురిసిపోతున్నారా? అందుకే మీకింకా కరోనా కుట్ట లేదని బడాయిపోతున్నారా? పప్పులో కాలేసినట్లే. మీరు తిన్నది తేనె కాదు. బియ్యం, షుగర్ కలిపి చేసిన ఒక సిరప్ మాత్రమే. భారతదేశంలో దొరికే ఏ బ్రాండ్  ‘తేనె’ దయినా  ఇదే రహస్యం.
‘మా తేనే మంచిదని, ఒరిజినల్’ అని పెద్దకంపెనీలు అడ్వర్టయి జ్ చేసుకుంటుంటాయి. వాటిని నమ్మి మీరు తేనె కొంటున్నారు. అయితే మోసపోయినట్లే. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు విక్రయిస్తున్న తేనెలో ‘తేనె’చాలా తక్కువ అని సిఎస్ ఇ బయటపెట్టింది. సిఎస్ ఇ పరీక్షలో పాసయిన తేనెలు రెండు. ఒకటి సఫోలా, రెండోది మార్క్ ఫెడ్ .
ఢిల్లీ లోనిసిఎస్ఇ  వాళ్లు దేశంలో అమ్ముడు వోతున్న 13 పెద్ద పెద్ద బ్రాండ్ ల కు చెందిన 22 రకాల తేనెశాంపిల్స్ ను పరీక్షించి ఇందులో చాలా  కల్తీ అని తేల్చి చెప్పారు.  ఈ పరీక్షలను ఇండియాలో కాకుండా జర్మనీలో చేయించారు, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.
ఈ తేనె నిండా చక్కెర,బియ్యం కలిపి తయారు చేసిన సిరప్ ఉందని జర్మనీలోజరిగిన పరీక్షలు వెల్లడించాయి. సిఎస్ ఇ పరిశీలించిన  తేనె బ్రాండ్లలో డాబర్, పతంజలి, జండు, బైద్యనాథ్, హిత్కారి, వంటి ప్రఖ్యాత బ్రాండులున్నాయి.
మీ డైనింగ్ టేబులు మీద ఏ బ్రాండ్ ఉందో చూసుకోండి.
ఈ బ్రాండ్ లన్నీ బియ్యం, తేనెతో తయారుచేసి సిరిప్ నుతేనెలో కలిపి విక్రయించడమే కాదు, మాది చాలా న్యాచురల్ అని ప్రకటనలు వేసుకుంటున్నాయి.
ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్అధారిటీ ఆప్ ఇండియా (Food Safety and Standards Authority of Indai (FSSAI) నిర్దేశించిన దాని ప్రకారమే ఈ బ్రాండుల తేనెలను పరీక్షించింది.
ఇలాంటి సంచలన విషయాలను వెల్లడించడంలో సిఎస్ ఇ ఎపుడూ ముందుంటుంది. గతంలో ఒక సారి కోక్,పెప్సీ వంటి సాఫ్ట్ డ్రింక్స్  క్రిమిసంహారకాల అవశేషాలున్నాయని చెప్పి దేశమంతా భూకంపం సృష్టించింది,  అపుడు దేశంలో అనేక చోట్ల  ఈ పానీయాలను బ్యాన్ చేశారు. భారత్ పార్లమెంటులో కూడా బ్యాన్ చేశారు. ఇపుడు  పెద్ద పెద్ద కంపెనీలు కల్తీతేనెను అమ్మి ఎలా దేశాన్ని కొల్లకొడుతున్నాయో  ఈ సంస్థ వెల్లడించింది.
ఈ తెనే పరీక్షలను జర్మనీలో నిర్వహించారు. న్యూక్లియార్ మాగ్నెటిక్ రెసోనాన్స్ స్పెక్ట్రో స్కపోపీ (NMR)పద్ధతినుపయోగించి ప్రపంచంలోనే పేరుమోసిన ల్యాబోరేటరీ లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈసంస్థ సేకరించిన 22 శ్యాంపిల్స్ లో కేవలం అయిదు మాత్రమే కల్తీలేకుండా కనిపించాయి.
ఈ తేనెలన్నీ భారతదేశంలో జరిపే పరీక్షల్లో ఈజీ ప్యూర్ గా బయటపడుతున్నాయి. కారణం ఇందులో కల్తీ చేసే కొన్ని రకలా షుగర్స్ భారతీయ పరీక్షలకు కనిపించడం లేదు. అయితే, ఎన్ ఎం ఆర్ వంటి అత్యాధునిక పరీక్షలు జరిపే సరికి లోగుట్టు  బయటపడింది. డాబర్, పతంజలి, బైద్యనాథ్, జండు, హిత్కారి ల వంటి పాపులర్ బ్రాండ్స్ తో పాటు నేచర్స్ నెక్టర్, ఇండిజినస్ హనీ వంటి బ్రాండుల తేనెల్లో ఉన్న కల్తీని  ఇండియన్ ప్రొటోకోల్స్ ప్రకారం జరిపే పరీక్షల్లో బయటపడటం లేదు. అయితే, వీటిని ఎన్ ఎం ఆర్ పరీక్ష చేయగానే అందుల్లో ఉన్న కల్తీ బయటపడింది.  బ్రాండులన్నీ బియ్యం, చెక్కర నుంచి తీసిని షుగర్స్ ను కల్తీ చేస్తుండటంతో FSSAI పరీక్షల్లో బయటపడటం లేదని సిఎస్ ఇ పేర్కొంది. దాదేవ్, హాయ్ హనీ, సొసేటీ న్యాచురేల్ వంటి బ్రాండులు ఏకంగా చెక్కెర ద్రావణాన్ని తేనెలో కల్తీచేసి అమ్ముతున్నాయి.
అంతేకాదు,చైనా లో తయారవుతున్న తేనె కూడా నాసిరకమే. ఇందులో నియమాలకు వ్యతిరేకంగా  హై ఫ్రక్టోజ్ షుగర్ వాడుతున్నా FSSAI పరీక్షల్లో తెలియడం లేదని సిఎస్ ఇ పేర్కొంది. చైనా తేనెలను అలీబాబా, ట్రేడ్ ఇండియా వెబ్ సైట్ల నుంచి భారీగా విక్రయిస్తూనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *