అవును, ఇది జిల్లా పరిషత్ హైస్కూలే… 6 ఫోటోలు…

తెలంగాణ సిరిసిల్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ఇలా తయారవుతూ ఉంది. ఇది పూర్తయితే, బహుశా దేశంలో ఇలాంటి ప్రభుత్వ ఉన్నత  పాఠశాల ఇదే అవుతుందేమో. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ చొరవతో ఈ పాఠశాల ఇలా తయారవుతూంది. ఇందులో ప్రభుత్వ నిధులు లేవు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద కంపెనీలనుంచి నిధులను సమీకరించి ఆయన ఈ హైస్కూల్ ను తీర్చిదిద్దుతున్నారు.

ఈ ప్రయోగాన్ని అన్ని జిల్లాలలో కూడా చేయవచ్చు. జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్ హైస్కూళ్లని ఇలా చేయలేకపోయినా, ఒకటి రెండు ముఖ్యమయిన జిల్లా పరిషత్ హైస్కూళ్లని ఇలా సెంటర్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా చేయవచ్చు.

సిరిసిల్లకు ఉన్న అడ్వాంటేజ్ ఇతర జిల్లాలకు ఉండకపోవచ్చు. ఎందుకంటే, సిరిసిల్ల దేశంలోని విఐపి నియోజకవర్గాల జాబితాలో ఉంది. దీని ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (కెటిఆర్). ఆయన కాబోయే ముఖ్యమంత్రి. కాబట్టి ఈ కోణం సిరిసిల్లకు ఎపుడూ స్ట్రాంగ్ పాయింటే. అయితే, కలెక్టర్లు చొరవ తీసుకుంటే, ప్రతి జిల్లాలో  కూడా ఈ ప్రయోగాన్ని పున:సృష్టించవచ్చు.  జిల్లా పరిషత్ స్కూళ్లని సిఎస్ ఆర్ పథకంతో అభివృద్ధిచేయవచ్చన్న ఆలోచనే గొప్ప ఆలోచన. దీనికి సిరిసిల్ల కలెక్టర్ ను అభినందించక తప్పదు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *