తుంగభద్రమ్మకు బుధవారం పుష్కర హారతి

బుధవారం రాత్రి తుంగభద్రమ్మకు వేదపండితులు భక్తి ప్రపత్తులతో వేదమంత్రాల సహితంగా పంచహారతి ఇచ్చారు. కర్నూలు సంకల్ బాగ్ పుష్కరఘాట్ వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన గంగ హారతి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దిష్టి దోషాన్ని నివారించే కుంభహారతి, నందీశ్వర దర్శన సమానమైన నంది హారతి, ఈశ్వర ప్రీతి పాత్రమైన బిల్వ హారతి, సర్ప దోషం తొలగించే నాగ హారతి, నామ దోషాలను తొలగించే నక్షత్ర హారతులను వేదపండితులు నదీమతల్లికి ఇచ్చి..పవిత్ర తుంగభద్ర పుష్కర జలాలను భక్తుల శిరస్సులపై ప్రోక్షణ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *