హైదరాబాద్ లో రెండు రైళ్లు ఢీ… క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్

ఈ ఉదయం 10:30 ప్రాంతంలో ఎంఎంటిఎస్ (Train No. 47178 )మరియు హంద్రీ ఎక్స్ ప్రెస్ (Train No. 17028 ) కాచిగూడ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. ఆగి వున్న ప్యాసింజర్ ట్రైన్ ట్రాక్ మీదికి ఎంఎంటీఎస్  రైలు రావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు చెప్పారు.
డ్రై వర్ శేఖర్ ఎంఎంటిఎస్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు.అతనిని రక్షించే ప్రయత్నం చేస్తున్నామని
కాచిగూడ స్టేషన్ మీదుగా ఉన్న ట్రైన్ లను దారి మళ్ళించడం జరిగిందని దక్షిణ మధ్య రైల్వే  అడిషనల్ జనరల్ మేనేజర్ బిబిసింగ్ తెలిపారు.
స్టేషన్ కావడంతో  రైలు తక్కువ వేగంతో వచ్చినందున ప్రమాదం తీవ్రత అంతగా లేదు. అయినప్పటికీ మూడు ఎంఎంటిఎస్ మూడు కోచ్ లు ధ్వంసమయ్యాయి. మరొక ఆరు కోచ్ లు పట్టాలుతప్పాయి.
ఈ ట్రైన్ ల ను తొలగించి ట్రాక్ ను క్లియర్ చేసిన తరువాత రాకపోకలను పునరుద్ధరిస్తారు. ఈ ప్రమాదం మానవ తప్పిదాల కారణంగానే జరిగినట్లుగా ప్రాధమిక అంచనాకు వచ్చామని ఆయన చెప్పారు. విచారణకు ఆదేశించారు.