ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో సంతాన సమస్య…

ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ వెలువడుతుంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో ఎన్నికలు జరగుతాయి. తర్వాత నామినేషన్ వేసేందుకు చాలామంది ఉత్సాహం చూపిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి చాలా అర్హతులుండాలి. మొదటిది వయస్సు. అభ్యర్థికి నా మినేషన్ వేసే నాటికి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అన్నింటికి కంటే ముఖ్యమయిన అర్హత సంతానం. ఇది కొంత జటిలసమస్యే.  ఎలాగంటే… పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండటానికి వీల్లేదు.

ఈ నియమం భారత ప్రభుత్వం మేమిద్దం, మాకిద్దరు అని కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే రోజుల్లో తయారయింది. 2045 నాటికి భారత జనాభా నియంత్రించాలన్న భారత ప్రభుత్వం విధానానికి ధీటుగా నాటి ఆంధప్రదేశ్ ప్రభుత్వం 1994లో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఇద్దరు పిల్లల నియమం (Two-Child Norm ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక అర్హతగా ప్రకటించింది.

తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్,గుజరాత్ , ఉత్తరాఖండ్, బీహార్ మధ్యప్రదేశ్,ఒదిషా, అస్సాం… తదితర రాష్ట్రాలన్నింటి ఇద్దరు పిల్లల పరిమితి అమలులోకి వచ్చింది.  ఇపుడు తాజా గా అస్సాం (2017) కూడా ఈ నియమం పెట్టింది. 2021  పంచాయతీ ఎన్నికల్లో అమలులోకి తీసుకురావాలని చర్యలు మొదలుపెట్టింది.

2016 రాంచి సభలో ఆర్ ఎస్ ఎస్ ఇద్దరు పిల్లల విధానాన్ని ఆమోదించాక బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా ఇది అమలులోకి వస్తున్నది. దీని పర్యవసానామే అస్సాం ప్రభుత్వ నిర్ణయం.

ఈ ఇద్దరు సంతానం సమస్య లో ఎన్నికోణాలున్నాయో చూడండి.

అయితే,  మే 31, 1994 కంటే ముందు ఒక వ్యక్తికి  ఉన్న సంతానం ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నా ఆ వ్యక్తి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అంటే 31. 5.1995 అనేది సంతానానికి కటాఫ్ డేట్ అన్నమాట. ఈ చట్టం వచ్చాక ఒక ఏడాది  వెసలు బాటు కల్పించారు.

అయితే, జూన్ 1994  తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే పోటీ చేసేందుకు వీల్లేదు.

ఒక వ్యక్తి తన మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు కలిగి ఉండి భార్య చనిపోయిన తరువాత రెండో భార్య ద్వారా ఇంకో సంతానాన్ని పొందితే అతనికి ముగ్గురు సంతానంగా ఉన్నట్లుగానే పరిగణిస్తారు. అతడు పోటీ చేసేందుకు వీల్లేదు కాని,  అతని రెండో భార్యకు ఒక్క సంతానమే కాబట్టి ఆమె పోటీ చేయడానికి అర్హురాలు.

ఒక వేళ ఎవరైనా వ్యక్తికి ముగ్గురు పిల్లలుండి, అందులో ఒకరిని మరొకరికి దత్తత ఇచ్చినా ముగ్గురు సంతానం కిందే లెక్క. ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదు.

ఇదే విధంగా ఈ చట్టం ప్రకారం పిల్లలను దత్తత తెచ్చుకున్నా సొంత సంతానంగానే పరిగణిస్తారు.

ముగ్గురు సంతానం సమస్య. ఒక వ్యక్తికి  ముగ్గురు పిల్లలు ఉన్నారనుకుందాం. అయితే, ఆయన  నామినేషన్‌ పరిశీలనకు  ముందు ఒకరు చనిపోతే పరిస్థితి ఏమిటి? అపుడు మిగిలిన సంతానం ఎందరో లెక్కలోకి తీసుకుంటారు. అపుడు ఇద్దరు పిల్లలు మిగిలి ఉంటే అర్హుడు. లేదంటే లేదు.

ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత భార్య మూడోసారి గర్భం దాల్చినా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారు అనర్హులవుతాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *