Home Breaking మహబూబ్ నగర్ జిల్లాలో జైపాల్ రెడ్డికి ఘనంగా నివాళి

మహబూబ్ నగర్ జిల్లాలో జైపాల్ రెడ్డికి ఘనంగా నివాళి

39
0
SHARE
 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం లో ప్రధాన పాత్ర పోషించిన, తెలంగాణ మేధావి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత  జైపాల్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని కడ్తల్, అమన్ గల్ మండలలాలో మాజీ ఎంపి డా. మల్లురవి నాయకత్వంలో  కాంగ్రెస్ నాయకులు  ఘనంగా నివాళులు అర్పించారు.
జైపాల్ రెడ్డి తిరుగులేని సెక్యులర్ రాజకీయ వాదిఅని , తాను నమ్మిన సెక్యులర్ రాజకీలయాలనుంచి ఎపుడూ  వైదొలగలేదని డాక్టర్ మల్లు రవి అన్నారు.
జైపాల్ రెడ్డి నాలుగు సార్లు అసెంబ్లీకి, అయిదుసార్లు లోక్ సభకు, రెండు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇందులో రెండు సార్లు, ఎనిమిదవ, పన్నెండవ లోకసభలకు మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహించారు.

యుపిఎ రెండో ప్రభుత్వంలో ఆయన  మొదట పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత పెట్రోలియం శాఖ మంత్రిగా తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా సేవలందించారు. ఆయన తెలంగాణ ఏర్పాటులో తెరవెనక నుంచి కాంగ్రెస్ మీదవత్తిడి తెచ్చన నాయకుడాయన.హైదరాబాద్ మెట్రో కార్యరూపం దాల్చడంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు.