అమితాబ్ ఇంట్లో మూడు తరాలకు కరోనా, అన్ని వైపుల నుంచి శుభాకాంక్షలు

భారతదేశం సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (77)కి సంక్షోభాలు కొత్త కాదు. సినిమా జీవితంలోనే నిజజీవితంలోకూడా ఆయన ఎన్నో అటుపోటులు ఎదుర్కొన్నారు. కాని ఇపుడు ఆయనకు  ఎదురయిన సమస్య  మునుపెన్నడు ఎదురుకానిది.
బాలివుడ్ షెహెన్షా ఇంతవరకు సినిమాలో ఒడిదుడుకులను ఒక్కడే ఎదుర్కొనేవాడు. ఇపుడు ఆయనకు ఇపుడు ఎదురయిన గడ్డుకాలం చిత్రమయింది. ఆయనతో పాటు ఈ పోరాటంలో కుటుంబం యావత్తు పాల్గొంటున్నది.
అమితాబ్ కుటుంబంలోని మూడు తరాలకు కరోనా సోకింది. ఆయనకు , ఆయన కుమారుడు అభిషేక్ కు, కోడలు ఐశ్వర్యా(46)కు, మనవరాలు ఆరాధ్య (8)కు కరోనా సోకింది.
భార్య జయాబచ్ఛన్ మాత్రమే నెగెటివ్.  నిన్న ఆయన తో పాటు అభిషేక్ బచ్చన్ (47) కరోనా పాజిటివ్ అని తేలింది.
పాజిటివ్ అని తేలగానే  ఆయన నానావతి ఆసుప్రతిలో చేరారు. ఆయన ఎంతో ఆత్మస్థయిర్యం, హుందాతనం ప్రదర్శించారు.

కుంగిపోయే విధంగా ప్రకటన చేయలేదు. ఈ విషయాన్ని చాలా ధైర్యంగా ప్రపంచానికి చాటి చెప్పాడు. ‘ నాకు కోవిడ్ జబ్బు సోకింది. హాస్పిట్ లకు మారాను. ఆసుపత్రి అధికారులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తుంది.  మా సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాలు రావలసి ఉంది.’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు, గత పదిరోజులలో తన సన్నిహితంగా ఉన్నవారంతా  కరోనా పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు.
ఈ రోజు కోడలు, మనవరాలు పాజిటివ్ అని తేలింది.మొదట్లోవాళ్లు నెగటివ్ అని ఫలితమొచ్చినా, రెండో రౌండు పరీక్షలో పాజిటివ్ అని బయటపడింది.
ఇపుడు అమితాబ్  నానావతిలోకి ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు.
ఆయనతో పాటు పరీక్షలు చేయించుకున్న భార్య జయాబచ్చన్ నెగెటివ్ అని తేలింది. వాళ్లింట్లో ఇపుడామె ఒక్కతే నెగటివ్. మిగతా కుటుంబమంతా పాజిటివ్.  ఈ పరిస్థితి ఎలాంటి మానసిక వత్తిడి తీసుకొస్తుందో వూహించుకోవచ్చు.
ఆయన పాజిటివ్ అని తేలగానే ఆయన ముంబైలోని ఆయన నివాసాన్ని మునిసిపల్ అధికారులు కంటైన్ మెంట్ జోన్ అని డిక్లేర్ చేసి బోర్డులు పెట్టారు.
ఆయన తొందరగా కోలుకోవాలని  ప్రపంచమంతా ప్రార్థనలు మొదలయ్యాయి. ‘అమితాబ్ గారూ, మీరు తొందరగా కోలుకోవాలని, ప్రపంచప్రజలందరితో కలసి ప్రార్థిస్తున్నానని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ ప్రకటించారు.
“ Dear Amitabh ji, I  join the whole nation in wishing you a quick recover ! After all, your are the idol of millions in this contury, an iconim superstar!  We will all take a good care of you. Best wishes for a speedy recovery!” అని హర్షవర్దన్ ప్రకటించారు.
అనుపమ్ ఖేర్ ఇంట్లో కూడా కరోనా
ఇది ఇలా ఉంటే, తన తల్లి దులారి, తమ్ముడు రాజు, ఇతరకుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్ అని తేలిందని ఆయన స్వయంగా ఆదివారం నాడు ట్వీట్ చేశారు. తల్లి కొద్దిగా కోవిడ్ తో బాధపడుతున్నారని, వెంటనే ఆమెను కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ  ఆసుపత్రికి తరలించారని ఆయన ట్వీట్ చేశారు.అదే విధంగా సోదరుడు , వదిన , వారి బిడ్డ కూడా కూాడా పాజిటివ్ అని తేలిందని ఖేర్  ట్వీట్ చేశారు.