థ్యాంక్యూ, శేఖర్ కమ్ముల

హైద‌రాబాద్‌: గాంధీ ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల‌కు ప్ర‌ముఖ దర్శకుడు శేఖ‌ర్ క‌మ్ముల నెల రోజులుగా హెల్త్ డ్రింక్స్ సరఫరా చేశారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం పారిశుద్ధ్య కార్మికులంద‌రూ థ్యాంక్యూ శేఖ‌ర్ క‌మ్ముల గారు అంటూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించి ‌ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.