Home Breaking వరంగల్ ఐటి పార్క్ రేపు ప్రారంభం

వరంగల్ ఐటి పార్క్ రేపు ప్రారంభం

78
0
వరంగల్ నగరం రాష్ట్రంలో మరొక ఐటి కేంద్రం కాబోతున్నది.
మంగళవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు టెక్‌ మహేంద్రా, సైయెంట్‌ క్యాంపస్‌లను వరంగల్‌లో ప్రారంభించనున్నారు.
ఐటీ కంపెనీలను రాష్ట్రంలోని ఇతర నగరాలకు తీసుకెళ్లాలన్న విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది . ద్వితీయశ్రేణి నగరాలైన వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లో ఐటీ పార్కులను ఏర్పాటుచేసే పథకం తయారయింది. ఇందులో భాగమే రేపు ప్రారంభం కానున్న వరంగల్ ఐటి పార్క్. ఇది వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో ఏర్పాటయింది.
ఇక్కడ సైయెంట్‌ కంపెనీ ఐదెకరాల ఏర్పాటయింది. ఈ కంపెనీ ఇప్పటికే ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఇందులో దాదాపు వందమందికిపైగా ఉద్యోగాలు లభించాయి. రెండోదశలో 900 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రూ.25 కోట్లతో మూడంతస్తులతో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సైయెంట్‌ కంపెనీ శాశ్వత భవనాన్ని నిర్మించింది. ప్రతి అంతస్తులో ఆరు వందల మంది విధులు నిర్వహించేందుకు అనుగుణంగా ఒక్కో అంతస్తులో సౌకర్యాలు ఏర్పాటుచేశారు. ఇంక్యూబేషన్‌ సెంటర్‌ను శాశ్వత భవనంలోకి మారుతుంది.
ఇక టెక్ మహేంద్ర ప్రభుత్వ ఇంక్యుబేషన్ సెంటర్ లో తాత్వాలిక క్యాంపస్ ఏర్పాటుచేసింది. ఇపుడు సొంత క్యాంపస్ ఏర్పాటుచేసుకున్నది.