ముఖ్యమంత్రి జగన్ లేఖకు వ్యతిరేకంగా రాజధానిలో న్యాయవాదుల క్యాంపెయిన్ మొదలు, కొద్ది సేపట్లో సుప్రీంకోర్టు బార్ ప్రకటన
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ప్రభావితం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోోహన్ రెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేకి లేఖ రాసి సంచలనం సృష్టించాక బార్ ఆసోసియేన్లు ఈ ఫిర్యాదును చర్చిస్తున్నాయి. కొద్ది సేపట్లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ముఖ్యమంత్రి రాసిన లేఖ మీద చర్చ జరిపి ఒక ప్రకటన వెలువరించబోతున్నది.
ఈ నెల ఆరోతేదీన జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ ఒక జాతీయ చర్చకు తెరలేపింది. న్యాయమూర్తులు విమర్శలకు అతీతంగా ఉంచాల్నా, హోదాను దుర్వినియోగపరుస్తూ, వృత్తికి కళంకం తెచ్చే కార్యకాలాపాలకు పూనుకుంటున్నపుడు ఏంచేయాలనేది జగన్ లేఖ వేసిన ప్రశ్న. ఒక న్యాయమూర్తి రాజకీయ పక్ష పాతం వ్యవహరిస్తున్నట్లు తెలిసినపుడు ఏంచేయాలనేది మరొక ప్రశ్న.
ఈచర్చ ఒక వైపు జరుగుతుండగా మరొకవైపు జగన్ జస్టిస్ రమణమీద చేసిన ఫిర్యాదును పత్రికలకు విడుదల చేయడం కోర్టు ధిక్కారమని, దానికోసం కోర్టు ధిక్కరణ అధికరణాల కింద ఆయన మీద చర్య తీసుకోవాలని, ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడిగా ప్రకటించాలనే చర్చ మొదలయింది.అదొక క్యాంపెయిన స్థాయికి ఎదిగింది. సుప్రీంకోర్టులో ఈ మేరకు పిటిషన్లు పడుతున్నాయి.
నేపథ్యంలో ఈ సాయంకాలం అయిదున్నరకు సుప్రీంకోర్టు బార్ అసోయేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమవుతున్నది. ఒక ముఖ్యమంతి హోదాలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ‘సాక్ష్యాలు’ లేకుండా అభియోగం మోపవచ్చా? జగన్ చేసిన విమర్శకు సరైన సాక్ష్యాలున్నాయా? లేఖను ప్రతికలకు విడుదలచేసి దూమారం సృష్టించడం తగునా,జగన్ మీద కోర్టు ధిక్కారం కేసుమోపవచ్చా అనే అంశాలను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సమావేశం చర్చింది ఒక ప్రకటన జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు ట్రెండింగ్ తెలుగు న్యూస్ కు తెలిపారు.
ఇప్పటికే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(Bar Council of India) చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చర్యను ఖండించింది. జగన్ లేఖ వెనక మొత్తం న్యాయవ్యవస్థను పెడదారి పట్టించే కుట్రవుందని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.
“The sinister act of releasing the letter of the CM to the media is the clear manifestation of the conspiracy to scandalize and malign the judges, which is nothing but a subterfuge to shake the confidence of the public in the institution of the judiciary and administration of justice,” అని భారత బార్ కౌన్సిల్ తన ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు, భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యే వరసలో ఉన్న జస్టిస్ రమణకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అధారరహిత ఫిర్యాదుచేయడమేంటే దీని వెనక ఏ ఉద్దేశముందో సుస్పష్టమని కూడా ఈ ప్రకటన పేర్కొంది.
“It is high time that the prudent citizen of the country particularly, the lawyers come forward to defeat and demolish the forces of disruption whose hidden agenda behind their evil move is to subvert the smooth functioning of court and administration of justice.”
దురద్దేశంతో రాసిన ఈ లేఖ వెనక కుట్రని వమ్ము చేసేందుకుదేశ ప్రజలు, ముఖ్యంగా దేశంలోని న్యాయవాదలు ముందుకు రావాలని భారత బార్ కౌన్సిల్ పిలుపునిచ్చింది. ప్రకటన మీద భారత బార్ కౌన్సిల్ ఛైయిర్మన్ మానన్ కుమార్ మిశ్రా సంతకం చేశారు