దేశంలో గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా మరణాలు నమోదయ్యా యి. కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లవ్అగర్వాల్ ప్రకటించిన 24గంటల్లో అందోళన కలిగిస్తూ 3,780 మంది కోవిడ్ తో చనిపోయారు. అదే విధంగా 3,82,315 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్యశాఖ తాజా కోవిడ్ బులెటీన్ లోపేర్కొంది.
ఉదాహరణకు మే ఒకటో తేదీన 400,000 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మే 2 వ తేదీన వీటి సంఖ్య 392,000 తగ్గింది. ఆ మరుసటి రోజు అంటే ఆదివారం నాడు 367,000 కు పడిపోయాయి. అంటే కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు కనిపిస్తూ ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. సోమవారం నాడు కొత్త కేసులు ఇంకా తగ్గి 357,229 కి చేరుకున్నాయి.
మంగళవారం నాడు 40,096 యాక్టివ్ కేసులు రావడంతో దేశంలో యాక్టివ్ కేస్ లోడ్ 34,87,229కి పెరిగింది. నిన్న సంభవించిన 3,780 మరణాలతో మొత్తం దేశంలో కోవిడ్తో మరణించిన వారి సంఖ్య 2,26,188 కి పెరిగింది.
ఇక వ్యాక్సిన్ లకు సంబంధించి భారతదేశంలో సుమారు 16 కోట్ల మందికి వ్యాక్సినేషన్ జరిగింది.
మంగళవారం నాటికే భారత్ దేశంలో కరోనా కేసులు సంఖ్య రెండు కోట్ల కు చేరుకుంది. దీనితో ఇంత భారీ కేస్ లోడ్ దేశాలలో అమెరికా తర్వాత భారతే అయింది. మూడో స్థానం 1.5 కోట్లతో బ్రెజిల్ ది.
ఇపుడు ఒక వైపు భారతదేశంలో కోవిడ్ తో యుద్ధం చేస్తుంటే, ఇలాంటి పరిస్థితే లావస్, థాయిలాండ్ వంటి దేశాలలో కూడా ఎదురవుతూ ఉంది. ఈ దేశాలలో సులభంగా అంటుకునే కరోనా వైరస్ వేరియాంట్స్ ఉండటమే కారణమంటున్నారు.
https://trendingtelugunews.com/top-stories/breaking/is-covid-19-graph-plateauing-in-india/