Home Breaking యాత్ర సినిమాపై సీనియర్ జర్నలిస్ట్ రివ్యూ

యాత్ర సినిమాపై సీనియర్ జర్నలిస్ట్ రివ్యూ

272
0

వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఇతివృత్తంగా నిర్మించిన “యాత్ర” సినిమా ఆధ్యంతం భావోద్వేగాలను తట్టి లేపింది. మళయాళ హిరో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో మెప్పించారు. సామాన్యులతో పేన వేసుకపోయిన పాత్ర కాబట్టి సినిమా కాస్త స్లోగా అనిపించినా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సినిమా సక్సెస్ అయ్యింది.

పాదయత్రలో ప్రజా సమస్యలు తన దృష్టికి వచ్చినప్పుడు వైయస్ స్పందనకు అనుగుణంగా ప్రేక్షకులు స్పందిస్తారు. వైయస్ సంతోషంలో సంబురాలు చేసుకుంటారు. ఆయన కలత చెందినప్పుడు కన్నీరు కార్చారు. మమ్ముట్టిలో వైయస్ ను చూసుకుని కుమిలి కుమిలి ఏడ్చారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబర్స్ మెంటు, పించన్ల పెంపు, రైతు రుణ మాఫీ, ఉచిత కరెంటు వంటి సంక్షేమ పథకాలకు ఎక్కడ బీజం పడిందో చెప్పేందుకు తెర మీద కేస్ స్టడీస్ చూయిస్తున్నప్పుడు ఆ పథకాల గొప్పతనం తెలిసి వస్తుంది.

చిన్న కూతరు గుండెకు పడ్డ చిల్లును పూడ్చేందుకు 9 ఏల్ల పెద్ద కూతురిని తల్లి పనిలో కూదిర్చినప్పుడు ఆ అమ్మాయితో చెప్పించిన మాటలు ఈటెల్లా మనల్ని పొడుస్తాయి. నా గుండేకే చిల్లు పడితే బాగుండూ నీతోనే ఉండిపోయేదాన్నమ్మ అంటూ పిల్ల ఏడ్పులో ఆరోగ్య ధీనావస్థ ప్రతిధ్వనిస్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామంటూ ప్రజలకు భరోసా కల్పించడంలో వైయస్ విజయం సాదించినట్టే సినిమాలో మమ్ముట్టి కూడా విజయం సాధించారు. నేను విన్నాను…నేను ఉన్నాను అన్నప్పుడల్లా జై వైయస్సార్ నినాదాలు మార్మోగుతాయి. కాని వైయస్ స్థాయిని పెంచేందుకు అక్కడక్కడ శ్రుతి మించారు.

హైకామండ్ ను ధిక్కరించినట్టుగా వైయస్ ను చూయించేందుకు అధిష్టాన పెద్దలను విలన్లుగా చూయించారు. యాదా మాములుగానే తెలంగాణ లీడర్లను జోకర్లుగా చిత్రికరించారు. వైయస్ రాజారెడ్డిని ఆదర్శ నాయకుడిగా చూపారు. వైయస్ సీఎం అయినప్పుడు రాజారెడ్డి గురించి హక్కుల ఉక్కు మనిషి బాలగోపాల్ ఈపిడబ్ల్యు లో మరో రకంగా రాస్తారు. అది చదివిన వాడిగా నాకు సినిమాలో ఆ పాత్ర అవాస్తవమనిపించింది.

ఇక 2003 లో మండలి లేకున్నా 40 మంది ఎమ్మెల్సీ ల మద్దతు తనకుందని వైయస్ తో చెప్పించడం లాంటి కొన్ని పొరపాట్లు సినిమాలో ఉన్నప్పటికీ యాత్ర సినిమాను ఫుల్లీ ఎమెషనల్ లోడెడ్ మాత్రగా మలిచి ప్రేక్షకులు బాగా రిసివ్ చేసుకునేలా చిత్రీకరించారు. అయితే వైయస్ కున్న ఫాలోయింగ్..వైయస్ జగన్ కు లేదన్నది మాత్రం ఈ సినిమా ద్వారా అర్దం అవుతోంది.

వైయస్ ను చూసినప్పుడు కేకలు, ఈలలు వేసిన జనం..జగన్ ప్రస్థావన రాగానే సైలెంట్ కావడం చూస్తే వైయస్ ఫ్యాన్స్ జగన్ ను అంతంగా ఆదరిస్తున్నట్లు అనిపించదు. అందుకే వైయస్ లెగసిని జగన్ క్యారి ఫార్వార్డ్ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఆదర్శాలు కల్తి అవుతున్న కాలంలో..యాత్ర వంటి రాజకీయ సినియాలు రావడం ఆహ్వనించదగ్గ పరిణామం.

సేకరణ : సీనియర్ జర్నలిస్ట్ నరేష్ సంకెపల్లి ఫేస్ బుక్ వాల్ నుంచి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here