బీడీలకు ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థ అండ

బీడీలను సిగరెట్, గుట్కవంటి పాగాకు ఉత్పత్తులతో సమానంగా చూడటానికి వీల్లేదని రాష్ట్రయ స్వయం సేవక్ సంఘ అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ అభిప్రాయపడింది.  సిగరెట్లమీదలాగా బీడి పొట్లాల మీద చట్టబధ హెచ్చరిక ప్రకటనలను ముద్రించి బీడీలను ప్రమాదరకమయిన పొగాకు ఉత్పత్తి లాగా చిత్రీకరించడాన్ని బిఎంఎస్ వ్యతిరేకించింది.
బీడీ పొట్లాల మీద ఇలాంటి ఆరోగ్య హెచ్చరిక ముద్రించడం వల్ల దేశంలోని 4.5 కోట్ల మంది ఉపాధికి పెద్ద దెబ్బ అని బిఎంఎస్ చెప్పింది.
చాలా పేదవారు ముఖ్యంగా, ఎస్ సి, ఎస్ టి, బిసి కులాల మహిళలకు ఉపాధినిస్తున్నబీడీలను ఇతర పొగాకు ఉత్పత్తులనుంచి వేరు చేసి చూడాలని ఈ సంస్థ కేంద్ర కార్మిక శాఖకు విజ్ఞప్తి చేసింది.
బీడిలతో సహా పొగాకు ఉత్పత్తులన్నింటి మీద ఆరోగ్య హెచ్చరిక ముద్రించాలని మే నెలలో కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టబద్ధ హెచ్చరిక ముద్రించేందుకు సెప్టెంబర్ 1ని గడువుగా నిర్ణయించింది. పొగాకు వాడటం వల్ల ఆరోగ్యానికి కలిగే అనర్థాలను ఫోటోతో సహా పొగాకు ఉత్పత్తుల మీద ముద్రించి తీరాలని ఆరోగ్య శాఖ పట్టబట్టడం మీద బిఎంఎస్ స్పందించింది.
ఇంతవరకు బాగుంది, ఈ బీడి పరిశ్రమ మూతపడితే, ఉపాధి కోల్పోయే ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన గురించి యోచించేనోడల్ ఎజన్సీ ఏదీ కేంద్రం దగ్గిర లేదని బిఎంఎస్ చెప్పింది.  కేంద్ర కార్మిక శాఖ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ విషయం లోఒక ప్రయత్నం చేశాయని, అయితే అది విజయవంతం కాలేదని బిఎంఎస్ పేర్కొంది. ఇదే విధంగా వ్యవసాయ శాఖకూడా పొగాకుకు ప్రత్యామ్నాయపంటలను కనుగొనేందుకు ప్రయత్నించిందని, ఈ ప్రయత్నాల మీద ప్రతియేటా కోట్లాదిరుపాయలు ఖర్చచేసినా అవి ఫలితాలివ్వలేదని బిఎంఎస్ పేర్కొంది. ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులను మళ్లించడంలో టొబాకో రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కూడా విజయవంతం కాలేదని కూడా బిఎంఎస్ పేర్కొంది.
బీడి విషయంల్ ప్రభుత్వంలోనే సమన్వయం లేదని భారతీయ మజ్దూర్ సంఘ్ చెప్పింది.
‘ ఈ అంశం ఏడు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది.ఒక్కొక్క శాఖ ఒక్కొక్క విధంగా యోచిస్తుంది. చివరకు ఈ విధానాల వల్ల నష్టపోతున్న నిరక్షరాష్యులయని మహిళలే. అందువల్ల ముందు ప్రభుత్వం లేబర్, హెల్త్, అగ్రికల్చర్, కామర్స్, ఫైనాన్స్, ఫారెస్టు, గిరిజన వ్యవహరాలు, హోం శాఖ,మహిళా శిశు సంక్షేమ శాఖ, స్కిల్ డవెలప్ మెంట్ లతో ఒక సమన్వయ కమిటీ వేయాలి. ఈ సమన్వయ కమిటీ ఒక కార్యాచరణ పథకం రూపొందించాలి. ఒక నెల లోపు ఈ పని పూర్తి చేయాలి,’ అని బిఎంఎస్ పేర్కొంది.