కృష్ణా జల మండలి ఆఫీస్ ని సీమ నేతలు సాధించగలరా?

(రాయలసీమ మేధావుల ఫోరం)

కృష్ణా యాజమాన్య బోర్డు ( KRMB ) కార్యాలయాన్ని సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమలో కాకుండా ఎలాంటి ప్రాతిపదిక లేని విశాఖలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

గత ప్రభుత్వం అమరావతి రాజధాని పేరుతో రాయలసీమకు అన్యాయం చేసిన నేపథ్యంలో  2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాయలసీమకు గతంలో జరిగిన అన్యాయాన్ని , జరగాల్సిన న్యాయాన్ని చేస్తుంది అని రాయలసీమ ప్రజలు ఆకాంక్షించారు.

మూడు రాజధానులు ఆలోచనలో భాగంగా సీమకు న్యాయ రాజధాని నిర్ణయం సంతృప్తి కాకపోయినా సీమ ప్రజల మనోభావాలను గౌరవించినందుకు సంతోషించాము. నీటి ప్రాజక్టులు విషయంలో కొంత మేరకు సానుకూలంగా స్పందించింది. మంచి జరగబోతుంది అని ఆశలు నింపుకున్న వేల సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా KRMB ని రాయలసీమలో కాకుండా విశాఖలో ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధపడటం ఆందోళన కలుగుతుంది.

రాయలసీమకు అన్యాయం జరిగిందని తెలిసినా ప్రతి చిన్న విషయానికి స్పందించే రాజకీయ పార్టీలు ఈ విషయంలో అమరావతి కోసం పడుతున్న తపన రాయలసీమ విషయంలో కనపడటం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాయలసీమకు తగిన న్యాయం మిగిలిన ప్రాంతాలకు జరిగినట్లు జరిగిపోతుంది అన్న భరోసా సీమ ప్రజలకు లేకపోవడం రాయలసీమ ప్రజల దైన్యం. అందుకే రాయలసీమ ప్రజాసంఘాల ప్రతినిధులు KRMB సాధనే ద్యేయంగా సమాలోచన చేయాలని భావిస్తున్నారు. రాయలసీమ ప్రజలు రాజకీయ అనుబంధాలు పక్కన పెట్టి తమవంతు పాత్ర పోషించాలని రాయలసీమ మేధావుల ఫోరం మనవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *