భారత రాష్ట్రపతి భవన్ లో కరోనా పాజిటివ్ కేసు

భారత రాష్ట్రపతి భవన్ లోకి కరోనా ప్రవేశించింది. అక్కడ పనిచేసే పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఒకరు కరోనా పాజిటివ్ అని తేలింది.
ఆయనను వెంటనే ఢిల్లీలోని ఒక ఆసుపత్రికి తరలించారు. దీనితో రాష్ట్రపతి భవన్ విధుల్లో ఉన్నఅనేక పోలీసులను, ఇతర సిబ్బందిని క్వారంటైన్ చేశారు.
ఇపుడు పాజిటివ్ అని తేలిన పోలీసు అధికారి కార్యాలయం రాష్ట్రపతి భవన్ లోనే ఉంటుంది.. గత నెలలో రాష్ట్రభవన్ నివాససముదాయంలో నివసిస్తున్న ఒక వ్యక్తి బంధువొకరు పాజిటివ్ అని తేలడంతో భవన్ లో ఉన్న సుమారు 115 ఇళ్లలోని వారందరిని క్వారంటైన్ చేశారు . తర్వాత రాష్ట్రపతి భవన్ ఉద్యోగుల్లో ఎవరూ పాజిటివ్ గా వెల్లడికాలేదు.
గత నెలలో కరోనా వల్ల చనిపోయిన ఒక బంధువుతో రాష్ట్రపతి భవన్ పని చేస్తున్న ఉద్యోగి ఒకరు కలిశారని కనుగొన్నారు. ఈ వ్యక్తి కరోనా పాజిటివ్. ఇలాగే చాలా కోమార్బిటీస్ (షుగర్, బిపి వంటివి ) సమస్యలు కూడా ఉన్నాయి.ఆయన ఢిల్లీలోని బిఎల్ కపూర్ ఆసుపత్రిలో చనిపోయారు. ఈ వ్యక్తి రాష్ట్రపతి ఉద్యోగి ఒకరు కలిశారని తెలిశాక , ఆయన కుటుంబ సభ్యులందరిని క్వారంటైన్ చేశారు. తర్వాత వీరిలో ఒకరు పాజిటివ్ అని తేలింది.
కొద్ది రోజుల కిందట రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కరోనాను అరికట్టేందుకు సాగుతున్న పోరాటానికి తనవంతుసాయంగా 30శాతం జీతం కోత విధించుకున్న సంగతి తెిలసిందే.