పోలీసుల అదుపులో మల్లిక్ పరుచూరి: గూగుల్ సైంటిస్ట్ చేసిన తప్పులు ఇవే!

(శ్రవణ్ బాబు*)

గూగుల్ సైంటిస్ట్ మల్లిక్ పరుచూరిని హైదరాబాద్ పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారుథర్డ్ వేవ్ లో ఇంటికో శవం లేస్తుందనే వ్యాఖ్యలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారనే అభియోగంపై ఆయనను సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారుఆయనకు మద్దతుగా వీరమాచనేని రామకృష్ణమరికొందరు మద్దతుదారులు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంఘీభావం ప్రకటించారుఇప్పుడంటే సెకండ్ వేవ్ ఉపశమించటంతో కాస్త తగ్గిందిగానీఆమధ్యఒక నెలరోజుల క్రితం ఈ మల్లిక్ పరుచూరి గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చ జరిగిందిఇతనికి మద్దతుగావ్యతిరేకంగా సోషల్ మీడియాలోబయట తెలుగు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రంగా వాదోపవాదాలు చేసుకున్నారు.

విశాఖపట్నానికి చెందిన కెమికల్ ఇంజనీర్ మల్లిక్ పరుచూరి తనను తాను ఒక లూయీస్ పాశ్చర్‌(వైద్యరంగంలో అపూర్వమైన ఆవిష్కరణలు చేసి మానవాళికి మహోపకారం చేసిన ఒక జీనియస్ సైంటిస్ట్) లాగా ఊహించేసుకుని కోవిడ్ వ్యాధికి తనదైన శైలిలో మందులు ప్రిస్క్రైబ్ చేసి వార్తలలోకెక్కిన సంగతి తెలిసిందే. అలా మందులు సూచించటమేకాకుండాసాంప్రదాయక(conventional) వైద్య విధానంలో కోవిడ్‌ చికిత్సకు అనుసరిస్తున్న ప్రతి పద్ధతినీ మల్లిక్ ఎద్దేవా చేస్తూ అల్లోపతి వైద్యులపై దుమ్మెత్తిపోశారు. అంతవరకు అయితే ఫర్వాలేదుకానీ ఆయన ఈక్రమంలోశిక్షార్హమైన కొన్ని తప్పిదాలు చేశారు.

రాంగోపాల్ వర్మ ఆ మధ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మల్లిక్ పరుచూరిని ఇంటర్వ్యూ చేశారుఆ సివిల్ ఇంజనీర్‌కుఈ కెమికల్ ఇంజనీర్‌కు మధ్య జరిగిన ఆ భేటీలో వర్మ ఒక మాట అన్నారుఈ సబ్జెక్ట్‌పై తనకు అవగాహన లేనందునమల్లిక్ చెప్పే వెర్షన్ లో అతనికి ఎంత conviction(బలంగానమ్మకంగా చెప్పటంఉందని మాత్రమే తాను చూస్తున్నాని చెప్పారుఅయితే గమనించాల్సింది ఏమిటంటే – ఒక విషయాన్ని బలంగానమ్మకంగా చెప్పినంతమాత్రాన అది నిజం అయిపోదుప్రపంచ వ్యాప్తంగా భారీ విధ్వంసాలకుఆత్మాహుతిదాడులకు పాల్పడే టెర్రరిస్ట్‌లు అందరూ – తమ పనుల ద్వారాత్యాగాలద్వారా తమ వర్గానికోమతానికో మేలుచేసి స్వర్గానికి చేరుకుంటామని బలంగానమ్మకంగా చెబుతారుకోవిడ్ వ్యాధి విషయంలో మల్లిక్ బలంగా బల్లగుద్ది చెబుతున్నాడుకాబట్టి అతని పాయింట్ కరెక్ట్ అనుకోవటం అనే తప్పును రాంగోపాల్ వర్మే కాదురెండు తెలుగు రాష్ట్రాలలోని న్యూస్ ఛానల్స్యూట్యూబ్ ఛానల్స్ కూడా చేస్తున్నాయిఇక్కడ అందరూ అర్థం చేసుకోవలసిందేమిటంటేమల్లిక్ అనే వ్యక్తి ఒక కెమికల్ ఇంజనీర్పైగా ఫార్మా రంగంలోనే ఉన్నాడుమందుల తయారీలో వాడే ముడిపదార్థాల గురించిఅవి ఎలా పనిచేస్తాయనేదాని గురించి అతనికి అవగాహన ఉందిలోతైన పరిజ్ఞానమే ఉందిదానికితోడు వర్మ ఇంటర్వ్యూలో తనే చెప్పినట్లు – లాక్ డౌన్ కావటంతో ఖాళీగా ఉండలేక ఈ సబ్జెక్టుపై వివిధ మ్యాగజైన్లలో వస్తున్న వ్యాసాలు చదివి నాలెడ్జ్ పెంచుకున్నాడుకొత్తగా వచ్చి చేరిన ఈ నాలెడ్జ్‌తో మల్లిక్ తనను తాను – మానవాళికి తన పరిశోధనలద్వారా మహోపకారం చేసిన లూయిస్ పాశ్చర్ లాంటి సైంటిస్ట్‌లాగా ఊహించేసుకుని కోవిడ్ వ్యాధికి మందులను సూచించేస్తున్నాడుకరోనాకు మందు రాలేదుకాబట్టి దానిని వాడితే తప్పేంటి అని కొందరు అనుకోవచ్చుఇంకా అతను చేసిన కొన్ని తప్పులు ఇక్కడ చూడండి.

1. కోవిడ్‌కు వ్యాక్సిన్లు పనికిరావని చెప్పాడువ్యాక్సిన్లపై ప్రభుత్వం పెట్టిన వేలకోట్లు వృథా అని చెబుతున్నాడు.

2. కరోనా చికిత్సకు కొన్ని వస్తువులు వాడమని చెప్పటానికి మీకేం అర్హత ఉందని టీవీ డిబేట్‌లలో డాక్టర్‌లు అడిగితే మిమ్ముల్ను నేను వాడమన్నానా అని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు.

3. మ్యుటేషన్లు అయ్యేకొద్దీ వైరస్ బలం పెరుగుతుందని చెబుతున్నాడుకానీఅది పూర్తిగా తప్పనిమ్యుటేషన్లు అయ్యేకొద్దీ వైరస్ బలం తగ్గిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు.

4. ఇంటికో శవం లేస్తుందని అనటం – అసలే భయకంపితులై ఉన్న జనాన్ని మరింత భయాందోళనలకు గురిచేయటమేభయానికిఇమ్యూనిటీకి ఉన్న విలోమ సంబంధం అందరికీ తెలిసిందేభయం పెరిగితే ఇమ్యూనిటీ దారుణంగా పడిపోతుందిమరి ఈయన జనంలో ఇలా భయాన్ని పెంచటంద్వారా ఏమి చేయాలనుకుంటున్నాడో తెలియటంలేదు.

5. కరోనాకు సంజీవని అన్నట్లుగాబ్రోమెక్సిన్ అనే మందును ఇతను సూచిస్తున్నాడుఅయితే బ్రోమెక్సిన్ వలన వ్యతిరేక ఫలితాలు వచ్చినట్లుకూడా వార్తలు వచ్చాయిపైగా ఏ జాతీయఅంతర్జాతీయ వైద్య సంస్థకూడా దీనిని సిఫార్స్ చేయలేదుఎక్కడో కొద్దిమందిపైనో మల్లిక్ వంటివారు ఇలా ఈ మందును ప్రయోగించి సత్ఫలితాలు వచ్చినంత మాత్రానదానిని జనం అందరికీ పని చేస్తుందని జనరలైజ్ చేయటం తప్పు.

6. కరోనాకు యాంటీబాడీలు భ్రమ‘, ‘వ్యాక్సిన్ మిథ్య‘, ‘హెర్డ్ ఇమ్యూనిటీ కల‘ అని తాను ఫేస్ బుక్‌లో పోస్ట్ ఎప్పుడో పెట్టానని చెప్పాడు.

ఇతని పద్ధతి ఏమిటంటేవైద్యులు ఈ చికిత్సలో అనుసరిస్తున్న ప్రతి విధానాన్నీ అవహేళన చేసి తేలిగ్గా కొట్టిపారేయటంకరోనా చికిత్స విషయంలో గత ఒకటిన్నర సంవత్సరంగా వైద్యులు వివిధ సమయాలలో వివిధ మందులను వాడుతున్నారుఒకసారి వాడిన మందు కంటే మెరుగైన మందు మరొకటి వస్తోంది కాబట్టిదానిని ఇతను తేలిగ్గా కొట్టిపారేస్తూ తనదే అత్యుత్తమ మార్గమని చెబుతున్నాడు.

ఇక్కడ అందరూ గుర్తుంచుకోవలసింది ఏమిటంటే – కోవిడ్ అనేది ఒక కొత్త జబ్బుఅల్లోపతి వైద్య విధానంలో ఒక కొత్త జబ్బుకు మందు(ఔషధంమార్కెట్‌లోకి రావాలంటే దానివెనక ఎంతోమంది కృషిఎంతో కసరత్తు ఉంటుందిట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో ప్రయోగాలు జరుగుతాయిఎలుకల వంటి జంతువులపైనమనుషులపైన అనేక దశలలో ప్రయోగాలు చేసిఆడవారుమగవారుపిల్లలువృద్ధులు… ఇలా వివిధ రకాల రోగులపై, ఆ మందు ఎలాంటి ప్రభావం చూపుతుందో గమనించివాటన్నింటి సారాంశాన్ని క్రోడీకరించి ఒక మందు తయారుచేసి దానిని మార్కెట్‌లోకి విడుదల చేస్తారుఅందుకే అల్లోపతి వైద్యాన్ని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారుఫార్మా రంగంలో పనిచేస్తూకూడా ఇంత చిన్న విషయం మర్చిపోయితాను ఒక్కడే పుస్తకాలు చదివి కనిపెట్టిన(అదికూడా ఈయన రీసెర్చ్ చేసిందికాదుచికిత్సా విధానాన్ని అనుసరించాలని చెప్పటం మల్లిక్ పరుచూరి మూర్ఖత్వానికి మొదటి నిదర్శనం.

మీడియాలోముఖ్యంగా న్యూస్ ఛానల్స్‌లో లైవ్ డిస్కషన్స్‌లో కనిపించటాన్ని ఆయన ఎంజాయ్ చేయటం ఆయన ముఖంలో స్పష్టంగా తెలుస్తోందిఇంత సీరియస్ విషయంపై చర్చ జరుగుతుంటేఅదేదో మామూలు డిబేట్ లాగా ఆయన నవ్వులు చిందిస్తూ మాట్లాడటం విచిత్రంగా ఉంది.

2021 మార్చి చివరినుంచి పరిస్థితి విషమించుతూ సెకండ్ వేవ్ మొదలయిందనిఆ టైమ్ లో మీరు ఏమైనా హెచ్చరికలు చేశారా అని వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్జీవీ అడిగితేమల్లిక్ చిరునవ్వులు చిందిస్తూ నేరుగా సమాధానం ఇవ్వకుండా ఏదేదో చెప్పొకొచ్చాడు.

వైద్యులు సరైన మందులు ఇవ్వటంలేదంటున్నారుకదాఇలా ఎందుకు చేస్తుండొచ్చని మీరు అనుకుంటున్నారు అని వర్మ అడిగితేడబ్బుకోసమే ఇలా చేస్తున్నారనిమిగిలిన చికిత్సలలో లభించేదాని కంటే ఎన్నోరెట్లు ఈ కోవిడ్ చికిత్స ద్వారా వస్తుందనే ఇలా చేస్తున్నారని మల్లిక్ ఆరోపణ.

ఈ అంశాలు చాలు మల్లిక్ ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడో తెలుసుకోవటానికిఅసలే మనదేశంలో నిరక్షరాస్యులు ఎక్కువకరోనా తీవ్రత ఏమిటనేది సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మాత్రమే మనదేశంలో అందరికీ అర్థమయిందిమొన్న సెకండ్ వేవ్ వచ్చేదాకా కూడామనదేశంలో చాలామంది మూర్ఖులు కరోనా అనేది అసలు రోగమేకాదనిఇది మందుల(ఫార్మాకంపెనీలు సృష్టించిన మాయరోగమనిఇది తమనేమీ చేయలేదని చెప్పుకుంటూ వచ్చిన సంఘటనలు మనకందరికీ తెలుసుఇలాంటి సమయాల్లో మల్లిక్ వంటివారు బాధ్యతారహితంగా చేసే ఇలాంటి పనులవలన పరిస్థితి మరింత సంక్లిష్టం అవుతోంది.

ప్రభుత్వ వైఫల్యం

మల్లిక్ లాంటి గూగుల్ సైంటిస్టులు ఇలా రెచ్చిపోవటానికిదేశవ్యాప్తంగా ఇంత ప్రాణనష్టం జరగటానికి కేంద్రప్రభుత్వం కూడా ఒక కారణం అని చెప్పుకోవాలిమొదటినుంచీ ప్రభుత్వం కరోనా విషయంలో సరైన రీతిలో వ్యవహరించలేదుగత ఏడాది మార్చి 21తగినంత వ్యవధి లేకుండానే (పెద్ద నోట్ల రద్దు విషయంలో వ్యవహరించినట్లుగానేఉన్నట్లుండి లాక్ డౌన్ ప్రకటించటంతో లక్షలమంది ప్రజలు డబ్బునిత్యావసర వస్తువులు నిల్వచేసుకోలేకపోయారుఇబ్బందుల పాలయ్యారువేలమంది వలస కార్మికులు రోడ్డుబాట పడితేకేంద్రంలోని పాలకులు చాలాకాలం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉండిపోయి ఆలస్యంగా మేలుకున్నారుఅప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక కరోనాపై అవగాహన కల్పించటంలో కూడా ప్రభుత్వం విఫలమయింది. ప్రభుత్వం కనక దీనిపై అవగాహన కల్పించటానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసిఉంటే ప్రజలలో అవగాహన పెరిగిఉండేది… ముఖ్యంగా మాస్కులు ధరించటంలోనిరక్షరాస్యత బాగా ఉన్న మనదేశంలో అట్టడుగు స్థాయి ప్రజలకు కూడా మెసేజ్ చేరాలంటే సినీనటులు/క్రికెటర్లు తప్ప మార్గం లేదుకానీప్రభుత్వం ఈ ప్రచారాన్ని సెల్ ఫోన్ కాలర్ ట్యూన్ గా తప్పిస్తే వేరే ప్రయత్నమేమీ చేయలేదుతీరా సమస్య చాపకింద నీరులా పాకి అందరికీ అర్థమయ్యేనాటికి – జనం ఎలా ఉన్నారంటే – కరోనాను తగ్గించే బ్రహ్మాండమైన మందు వచ్చిందంటూ ఎవరు బలంగా చెప్పినా – ముందూ వెనక ఆలోచించకుండా మూకుమ్ముడిగా వెళ్ళి తీసుకునేటంతగా! వస్తువులను తాకటం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువే అని లాన్సెట్ లో ప్రచురితమయిందిఅమెరికన్ ప్రభుత్వ సంస్థ CDC చెప్పినాకూడా దానిగురించి బలంగా ప్రచారం జరగలేదు.

వ్యాక్సిన్ల విషయంలోకూడా కేంద్ర ప్రభుత్వం అత్యంత భారీ తప్పిదం చేసిందిసెకండ్ వేవ్ వస్తుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నాముందు జాగ్రత్తతో వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున సమకూర్చుకోవాల్సిందిపోయిసమస్య తీవ్రమయ్యేదాకా చూస్తుండిపోయిందిపర్యవసానం – సెకండ్ వేవ్‌లో 50 ఏళ్ళలోపు ఉన్న ఇంటి సంపాదనపరులు(bread winners) ఎక్కువగా చనిపోవటంఉత్తరాఖండ్‌లో కుంభమేళాను ఆపకపోవటంకూడా కేంద్రప్రభుత్వం చేసిన మరో అతి పెద్ద తప్పిదందానిద్వారాకూడా వేలమందికి కరోనా సోకిందిపాలకులకు సైంటిఫిక్ టెంపర్ లేకపోవటం వలన జరుగుతున్న అనర్థం ఇదిజర్మనీలోమనదేశంలోని కేరళలో కీలకస్థానాలలో ఉన్న విద్యావంతులైన స్త్రీలు కరోనాను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారో అందరమూ చూశాము.కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో ఇలా పూర్తిగా విఫలమవటానికి కారణంఈ అంశంపై సూచనలు ఇచ్చే సలహాదారులు మంచివాళ్ళు కాకపోవటంవలన కూడా అనే వాదన ప్రచారంలో ఉంది.

ఇక చైనా కుట్ర అనే విషయానికొస్తేప్రతిదానిలోనూ కుట్రకోణాన్ని(conspiracy theory) చూడటానికి ఇష్టపడేవారు చాలామంది ఉంటారుచైనా ఈ వైరస్ ను సృష్టించిందనే వాదన ప్రచారంలో ఉందిఅయితే వైరస్ మ్యుటేషన్‌లు కృత్రిమంగా ల్యాబ్‌లో సృష్టించినవి కాదని శాస్త్రజ్ఞులు నిర్ధారించినట్లుపరిశోధనలకు కావలసిన వైరస్ జెనోమ్ కోడ్‌ను చైనా అందరికీ షేర్ చేయటం ఆహ్వానించదగిన పరిణామమని అన్నిదేశాలవారూ అభినందించటం గురించికూడా మీడియాలో వార్తలు వచ్చాయిమరోవైపు చైనాలోకూడా ప్రాణనష్టం జరిగింది… ఆ సంఖ్య బయటకు రాకపోవచ్చుగానీకాబట్టి చైనాపై విపరీతమైన కోపం పెంచుకునిపళ్ళు నూరుకుంటూ ఉండటంవలన దెబ్బతినేది మన ఆరోగ్యాలే కాబట్టి ఆ విషయాన్ని వదిలేస్తే మంచిది.

(*Sravana Babu, Freelance Journalist, Mobile: 99482 93346,Email: sravone.babu@gmail.com)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *