కేసీఆర్‌కు ప్రధాని మోది, సీఎం జగన్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 66వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్‌కు దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని.. చిరకాలం ఆయురారోగ్యాలతో ఆయన ప్రజాసేవలో కొనసాగాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.