40 సంవత్సరాల తర్వాత హైదరాాబాద్ సామూహిక గణేష్ నిమజ్జనం బంద్…

హైదరాబాద్ లో కరోనా పరిస్థితులు వల్ల ఈ ఏడాడి గణేష్ సామూహిక నిమజ్జనం రద్దయింది.అదేవిధంగా గణేష్ మండపాలు గుంపులుండకూడా చూడాలి. ఎలాంటి సామూహిక ఉత్సవాలకుతావు లేదు. అదే విధంగా ఆడంబరాలకు పోకుండా సాదాసీదాగా గణేష్ చతుర్థి జరుపుకోవాలని  భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ప్రజలకు పిలునిచ్చింది.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ఈ విజ్ఞప్తి చేశారు.  ఈ ఏడాది అగస్టు 22 నుంచి సెప్టెంబర్ 1అనంత చతుర్దశి దాకా గణేష్ ఉత్సవాలు సాగుతాయి. చివరిరోజున గణేష నిమజ్జనం జరగుతుంది. భారతదేశంలో భారీ గణేష్ నిమజ్జనాలలో హైదరాబాద్ నిమజ్జనం ఒకటి. సుమారు లక్ష విగ్రహాల దాకా హైదరాబాద్ లోని 32 సరస్సులలో నిమజ్జనం చేస్తుంటారు. వీటిలో  హుసేన్ సాగర్ లో నిమజ్జనం భారీ కార్యక్రమం. సుమారు 60 నుంచి 70 వేల విగ్ర హాలను హుసేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తుంటారు. అయితే ఈ  ఇవన్నీ నామమాత్రంగా నే జరగాలని బిజియుఎస్ నిర్వహాకులకు సూచనలిచ్చింది. హుసేన్ సాగర్ వైపు రాకుండా ఆయా ప్రాంతా వాళ్లు తమ ఏరియాలో ఉన్న కుంటలలో, చెరువులలో గణేష్ నిమజ్జనం జరపాలి సమితి కోరింది.

 

హైదరాబాద్ ఈ  తరహా సామూహిక గణేశ నిమజ్జనం నలభై సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఈ నిమజ్జన ఊరేగింపు 1980నుంచి నిర్వహిస్తున్నట్లు  కొందరు చెబుతున్నారు. ఈ వూరేగింపులు బాలాపూర్ నుంచి మొదలవుతాయి.  ఈ యాత్ర అఫ్జల్ గంజ్, ఎం జెమార్కెట్, అబిడ్స్, లిబర్టీ మీదుగా హుసేన్ సాగర్ చేరుతుంది. ఈ ప్రతియేడు పెరుగుతూ వస్తున్నది. చివరకు బాలాపూర్ లడ్డు వేలం ఒక కీలకఘట్టంగా మారింది. హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలలో మరొక విశేషం ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం ఎత్తు. దేశంలో నే ఎత్తయిన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటుచేస్తారు.  ఈ సారి ఈ విగ్రహం ఎత్తు 27 అడుగులకు మించి ఉండదని దర్శనాలను ఆన్ లైన్ లో చేసుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విగ్రహాన్ని సాధారణంగా హుసేన్ సాగర్ నిమజ్జనం చేస్తారు. ఈ సారి హుసేన్ సాగర్ నిమజ్జనం ఉండదు.విగ్రహం ఏర్పాటుచేసిన ప్రాంతంలోనే నిమజ్జనం ఉండవచ్చని చెబుతున్నారు.
 పెద్ద పెద్ద  విగ్రహాల ఏర్పాటుచేయడం గురించి  పోటీ పడకుండా విగ్రహాలు ఏర్పాటు చేయాలని, సంక్షోభ సమయంలో ఆరోగ్యశాఖ ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్ళాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారుు.
కోవిడ్ కారణంగా సెప్టెంబర్ ఒకటిన జరగాల్సి‌ సామూహిక నిమజ్జనాన్ని విరమించుకుంటున్నామని, వినాయక మండపాలకు ఎవరి అనుమతి అవసరంలేదు. సామూహిక నిమజ్జనం లేదుకాబట్టి సంబంధించిన పీఎస్ కు సమాచారం ఇస్తే సరిపోతుందని ఆయన తెలిపారు.
దేవుడిని పూజించటానికి పర్మిషన్ అవసరంలేదు. రాజ్యాంగం రాకముందునుంచే దేవుడున్నాడు, కుండీలు, బకెట్లలో నిమజ్జనం చేయరాదు. బావులలో చెరువులో మాత్రమే నిమజ్జనం చేయాలి. తక్కువ మందితో మాత్రమే నిమజ్జనం జరుపుకోవాలి అని ఆయన చెప్పారు.
మండపాల దగ్గర నలుగురైదురుగు కంటే ఎక్కువ ఉండరాదు. మండపాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుందని ఆయన చెప్పారు.
కోవిడ్ వలన ఉగాది, హనుమాన్ జయంతి, శ్రీరామనవమిలను జరుపుకోలేకపోయిన విషయం కూడా ఆయన గుర్తు చేశారు.
విగ్రహాలను పెట్టే కమిటీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ 19 నియమాలను కచ్చితంగా పాటించాలని, సమితి సక్రెటరీ ఆర్ శశిధర్ చెప్పారు. ముఖ్యంగా నిమజ్జనం రోజు విగ్రహం వెంబడి నలుగురయిదుగురు మించి ఉండరాాదని, వారు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గణష్ ఉత్సవాల సందర్భంగా కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ఈ నియమాలను పాటించాలని ఆయన  చెప్పారు.