మూడు ముక్కలు చెల్లవు, అమరావతి ఉద్యమం ఆగదు: లోకేష్

నందిగామ: అమరావతి పై ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదు, అసెంబ్లీ లో చర్చించి ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ గారు జై కొట్టిన తరువాతే
అమరావతి ని రాజధానిగా నిర్ణయించారని తెలుగుదేశం ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
‘అమరావతి ని రాజధానిగా ప్రకటించిన రోజే చంద్రబాబు గారు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రణాళిక ప్రకటించారు, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం  రాయలసీమని ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా పథకం వేశారు. విశాఖలో అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్న జగన్ గెలిచిన తరువాత మూడు ముక్కల రాజధాని అన్నారు,’ అని లోకేష్ నందిగామాలో మాట్లాడుతూ అన్నారు. సేవ్ అమరావతి ఉద్యమం 57 రోజులకు చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
ప్రపంచంలో ఒక్క దేశంలో మినహా ఎక్కడ మూడు ముక్కల రాజధాని లేదు. పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ లో కూడా ఒకే రాజధాని. 57 రోజులుగా రైతులు,మహిళలు,యువకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంత ఒక రాష్ట్రం ,ఒకే రాజధాని అని నినదిస్తున్నారు . రైతుల్ని పెయిడ్ ఆర్టిసులు అన్నారు.రైతులు బురదలో ఉండాలి అన్నారు.మహిళల్ని పోలీసు బూటు కాలుతో తన్ని అవమానించారు. అమరావతి కోసం రైతులు చనిపోతే పట్టించుకోని ప్రభుత్వం ఇది.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/english/features/tdp-mla-anagani-satya-prasadi-write-open-letter-to-cm-jagan-on-police-offician-kept-in-vr-without-salaries/

రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా. నందిగామ లో వైకాపా ఎంపీ గారికి గులాబీ పూలు ఇచ్చి యువకులు గాంధేయ మార్గంలో నిరసన తెలిపారు. కేవలం జై అమరావతి అన్నందుకు యువకుల పై అక్రమ కేసులు బనాయించారు. రైతులు,మహిళలు,యువకులు బయటకు రాకుండా ఉండాలి అని ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది
బ్రిటీషు కాలంలో జై హింద్ అంటే జైలుకి పంపేవారు.ఇప్పుడు జై అమరావతి అంటే జగన్ గారు జైలుకి పంపుతున్నారు. విశాఖ ని అభివృద్ధి చేసింది చంద్రబాబు గారు.హుద్ హుద్ వస్తే మొదట ఉన్నది చంద్రబాబు గారు. ఎన్నికల సమయంలో జగన్ గారు పెంచుకుంటూ పోతా అన్నారు
ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేస్తున్నారు. ఎన్నికల ముందు కూతలు కుసారు.ఇప్పుడు కోతలు మొదలయ్యాయి పెన్షన్లు,రేషన్ కార్డులు తీసేస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీల,కరెంట్ ఛార్జీలు, ఫైబర్ గ్రిడ్,ఇసుక ధర,పెట్రోల్ ధరలు ఇలా అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు జగన్ గారు. తుగ్లక్ ని మించిపోయారు జగ్లక్. జగ్లక్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఎన్ని కేసులు పెట్టినా అమరావతి ఉద్యమం ఆగదు