ఎమ్మెల్సీ ఓట్ల కోసమే తెలంగాణ స్కూళ్లు తెరిచారా?

ఎమ్మెల్సీ ఎన్నికలను  దృష్టిలో పెట్టుకుని ఉన్నఫలానా తెలంగాణలో పాఠశాలలో తెరచి  6 నుంది 8 తరగతులకు కూడా పాఠాలు చెప్పాలని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించడం వెనక వోట్ల రాజకీయముందనే విమర్శ ఎదువవుతూ ఉంది

ఎందుకంటే 4 రోజుల క్రితం విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రా రామచంద్రన్ చాలా క్లియర్ గా  ఈ సారి  పాఠశాలలు తెరవడం కష్టమేనని చెప్పారు.  “ఈ విద్యా సంవత్సరానికి 1నుండి 8 వ తరగతుల వరకు ప్రత్యక్ష బోధన ఇక లేనట్లే…” అని ఆమె ప్రకటించారు.

నిన్న  అకస్మాత్తుగా ఈరోజు 6 నుండి 8 తరగతులు ప్రారంభించడానికి ఉత్తర్వులు ఇచ్చారు.

ఇందులో మర్మమేమిటంటే

ప్రైవేటు పాఠశాలలో  6 వ తరగతి నుండి 8 తరగతి వరకు పాఠాలు  బోధించేది గ్రాడ్యుయేట్ టీచర్లే. వారి సంఖ్య చాలా ఎక్కువ. కెోవిడ్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఉద్యోగం లేక జీతాలు లేక  వారంతా చాలా మంటగా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాదు వరంగల్ లలో ప్రైవేటు పాఠశాలలు అధిక సంఖ్యలో ఉన్నాయి. వారికి ప్రభుత్వనుంచి గాని, పాఠశాలల నుంచి గానీ ఎలాంటి సాయం అందడం లేదు. వారున్నారన్న విషయం కూడా ప్రభుత్వం మర్చిపోయింది. వాళ్లు ఇపుడు గుర్తు కొచ్చారు. పాఠశాలలు ప్రారంభించారు.

ఇప్పుడెందుకు ప్రారంభం?

ఖచ్చితంగా రాజకీయ కోణంతోనే ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాదు, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులు ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. వరంగల్ కు సిట్టింగ్ పోటీ చేస్తున్నాడు. హైదరాబాదు కి చివరకు అభ్యర్థి దొరకలేదు. ఈ సందర్భంగా గెలుపు తరువాత కాని కనీసం హూందాగా ఓడాలని ఆలోచించింది. అందుకే ఆగమాగం రేపే ప్రారంభం చేసుకొండి అని ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రైవేటు పాఠశాలలు తమ ఫీజులు వసూలు చేసుకొని‌ కనీసం రెండు నెలలైనా జీతాలు ఇవ్వమని చెప్పింది. ‌అంతేకాదు యాజమాన్యం కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి వలననే ఈ జీతాలు ఇవ్వగలుగుతున్నాము కాబట్టి ప్రతి ప్రైవేటు టీచర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని‌ కూడా చెప్పుతుంది. ఇది నేటి రాజకీయ కోణం.

ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులలో ఉన్న మంటను ఇలా ఎంతో కొంత తగ్గించడానికే ఈ ఆకస్మిక ప్రారంభ తంటా…! అని చెబుతున్నారు.

ఆర్థిక కోణంలో…
ప్రభుత్వం పూర్తి గా ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయింది. మధ్యం, పెట్రోల్ పన్నుల పై ఆధారపడి నడుస్తున్నది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ లోనే పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యాయి.‌ ఇక్కడ కూడా అవుతాయని అందరూ భావించారు కాని అలా జరగలేదు.
అప్పుడు ప్రారంభం చేస్తే 119 గురుకులాలు జూనియర్ కాలేజీలు ప్రభుత్వ పాఠశాలలు కెజిబివిలు మోడల్ స్కూల్స్ లో ఉన్న లక్షలాది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలి. హాస్టల్ విద్యార్థులకు మరింత ఖర్చులు. పాఠశాలలకు పూర్తి గ్రాంట్లు ఇవ్వాలి. విద్యావాలంటీర్లను నియమించాలి. స్కావెంజర్లను నియమించాలి వారికి జీతాలు ఇవ్వాలి. ఇవన్ని తప్పించుకోవడానికి మాత్రమే పాఠశాలలు మూసి ఉంచింది కాని కరోనా కు బయపడి కాదు. ఇప్పుడు ప్రారంభించింది ప్రైవేటు ఉపాధ్యాయులపై ప్రేమతో కాదు. రాజకీయం.. అంతా ఓట్ల రాజకీయం అని ఒక పోస్టు సోషల్ మీడియా లో వైరలవున్నది.

పాఠశాలల ప్రారంభం ఎవరికి లాభం?

పాఠశాలల ప్రారంభం కేవలం పాఠశాల యాజమాన్యాలకు మాత్రమే లాభం. కేవలం రెండు నెలలు నడిపి సంవత్సరం ఫీజు మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తారు. దీనితో తల్లిదండ్రులకు గతంలో కంటే అధిక భారం పడుతున్నది. ఇప్పటికే ఆన్‌లైన్ పాఠాల కొరకు స్మార్ట్ ఫోనులను కొనిపించారు. పుస్తకాలు నోట్ బుక్స్ కొన్నారు. ఇంత చేసినా విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేదు ఈ రెండు నెలలలో విద్యార్థులు నేర్చుకునేది ఏమిలేదు.

యాజమాన్యాలకు ఏమి లాభం ?

ప్రైవేటు పాఠశాలల జమాన్యాలు చాలా లబ్ధి పొందుతాయి.‌ రెండు నెలలు కొరకు సంవత్సరం ఫీజు వసూలు చేస్తున్నారు. మనం ఈ వార్తలు చూస్తున్నాం. చివరికి హాస్టల్ ఫీజు కూడా లాక్కుంటున్నారు. ఈ ఎనిమిది నెలలలో ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేదు. ఇతర సిబ్బందిని రోడ్ల మీద వదిలేసింది. కరెంటు బిల్లులు, వెహికిల్స్ డిజిల్ ఖర్చు తప్పాయి. సుమారు యాభై శాతం ఖర్చు తప్పించు కున్నారు. ఐనా కాని జీతాలు ఇవ్వలేదు. ఇపుడు పూర్తి ఫీజు వసూలు చేయడానికి సిద్దపడ్డారు. ఇది తల్లిదండ్రులకు శరాఘాతం.

క్యాతరాజు సతీష్,  ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ జయశంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేరుతో ఈ పోస్టు వైరలవుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *