Home Breaking రైతుల మీద కేసులు పెడుతున్నపుడు భువనేశ్వరి ఎక్కడున్నారు? : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల

రైతుల మీద కేసులు పెడుతున్నపుడు భువనేశ్వరి ఎక్కడున్నారు? : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల

71
0
అమరావతిలో తిరిగి వ్యవసాయం వర్దిల్లాలని, అమరావతి ప్రాంతాన్ని ప్రభుత్వం అగ్రికల్చర్ జోన్ గా ప్రకటిస్తే స్వాగతిస్తానని వెఎస్ ఆర్ కాంగ్రెస్ మంగళగిరి ఎంఎల్ ఏ  ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
అమరావతి అగ్రికల్చర్ జోన్ కాావాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. రైతుల పేరుతో చంద్రబాబు ఈ రోజు తాను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొన్న భూములను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఆయన తీవ్రమయిన ఆరోపణ చేశారు.
ఇదే విధంగా చంద్రబాబు నాయుడి భార్య భవనేశ్వరీ దేవీ రెండు రోజుల కింద రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి బంగారుగాజులు విరాళంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజధానికి భూములు ఇవ్వాలని  రైతులను పోలీసు స్టేషన్ల ల్లో పెట్టికొట్టినప్పుడు ఎందుకు రోడ్లు పైకి భువనేశ్వరి రాలేదని ఆయన ప్రశ్నించారు.
‘ ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. వేల ఎకరాల భూములు తీసుకొని అమరావతిలో  ఒక్క పర్మినెంట్ బిల్డింగ్  ఎందుకు కట్టలేదని చంద్రబాబు ను భువనేశ్వరి అడగాలి,’ అని ఆళ్ల అన్నారు. భూములు ఇవ్వని రైతుల్ని చంద్రబాబు కొట్టించిన రోజున భువనేశ్వరి ఏమయ్యారు..? మూడు పంటలు పండే భూములు లాక్కున్నప్పుడు రైతులు ఆమకు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు.

అమరావతి ఉద్యమానికి బంగారు గాజులు బహూకరించిన నారా భువనేశ్వరి

ఇలాగే ఆయన జనసేన నేత పవన్ కల్యాణ్ మీద కూడా విరుచుకుపడ్దారు.
ఆళ్ల ఏమన్నాడో చూడండి:
లక్షల కోట్ల అవినీతి బైట పడుతుందని కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు.
-నీచ రాజకీయాలతో చంద్రబాబు రోజు రోజుకి దిగజారిపోతున్నాడు..
-రాజధానికి చంద్రబాబు పెద్ద శాపం.. రాజధానికి శ్రీ వైయస్ జగన్ వరం..
-ఎర్రబాలెం, కృష్ణాయపాలెం లో భయపెట్టి రైతుల నుండి అక్రమంగా భూములు లాక్కోలేదా..?
-ఐదేళ్లుగా రాజధాని రైతుల్ని దోచుకోవడం తప్ప.. రైతులకు చేసిందేమీ లేదు..
-మోసం చేసాడు కనుకే.. మంగళగిరి, తాడికొండలలో టీడీపీని ఓడించారు..
-రైతులకు ఇచ్చిన హామీలు పాక్షికంగా కూడా అమలు చేయలేదు..
-ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా కొన్న భూముల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నాడు..
-బినామీ భూముల విలువ పడిపోతుందని చంద్రబాబు తెగ బాధపడిపోతున్నాడు..
-13 జిల్లాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముందంజలోనే ఉన్నాయి.. ఇక్కడవారు విదేశాలకు వలసలు వెళ్లి స్దిరపడుతున్నారు
-ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలు అభివృద్ధి చెందాలి..
-బ్రతకలేక వలసలు వెళ్తున్న సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి చంద్రబాబుకి అవసరం లేదా..?
ఆ రోజు పవన్ ఏమయ్యాడు?
-ఐదేళ్లు రాజధానిలో అవినీతి జరిగితే పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు..?
-రాజధాని విషయంలో ప్యాకేజి తీసుకుని పవన్ కల్యాణ్ సైలెంట్ అయిపోయాడు..
-ప్యాకేజీ కోసమే పవన్ మంగళగిరిలో జనసేన అభ్యర్థిని పోటీకి పెట్టలేదు… వామపక్షాలకు ఇచ్చినా కనీసం ప్రచారం కూడా చెయ్యలేదు..
-రాజధాని రైతుల్ని ప్రత్యక్షంగా చంద్రబాబు మోసం చేస్తే.. ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ పరోక్షంగా మోసం చేసాడు..
-రాజధాని పేరుతో చంద్రబాబు లక్షల కోట్లల్లో అవినీతి చేశారు..
-నాపై బోండా ఉమా చేసిన ఆరోపణలు అవాస్తవం..
-నా ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచి ఉన్నాయి..
-నా భార్యకు నీరుకొండ గ్రామంలో ఐదు ఎకరాలు భూమి ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం..
-భూమి ఉందని కనిపెట్టిన వారికి ఆ ఐదు ఎకరాలు రాసి ఇచ్చేస్తా..
-లేదంటే స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేస్తా..
-శాశ్వతంగా రాజకీయాలు కు దూరంగా ఉంటాను.
-ఈనాడు ఆంధ్ర జ్యోతి నాకు భూముల ఉన్నాయని రాసారు..
-కనీసం నా వివరణ అడగకుండా రామోజీరావు, రాధాకృష్ణ ఎలా రాస్తారు…
-చంద్రబాబు కాపాడుకోవడానికి రామోజీరావు, రాధాకృష్ణ తెగ తాపత్రయం పడుతున్నారు..
-రాజధానిలో సొంత ఇల్లు కట్టుకోకుండా అక్రమ కట్టడంలో ఉండటానికి చంద్రబాబు, లోకేష్ కి సిగ్గులేదా..?
-ఐదేళ్లుగా రాష్ట్రంలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదు.. చెప్పండి..
-మంత్రిగా ఉన్న లోకేష్ మంగళగిరిలో ఎందుకు పర్యటించలేదు..
-రాజధానిలో ఎన్టీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎందుకు కట్టలేదని లోకేష్ చంద్రబాబు ను అడగాలి..
-నాన్న రాజధానిలో మన ఇల్లు ఎక్కడ అని లోకేష్ చంద్రబాబు ను అడగాలి..
-మంగళగిరి హద్దులు కూడా లోకేష్ కు తెలియవు..
-రాజధాని రైతులకు అభివృద్ది చేసిన ఫ్లాట్స్ ఇస్తామని సీఎం చెప్పారు..
-రాజధాని రైతులకు సీఎం శ్రీ వైయస్ జగన్ న్యాయం చేస్తారు..
-చంద్రబాబు హయంలో చెల్లించాల్సిన కౌలు శ్రీ వైయస్ జగన్ చెల్లించారు..
-రాజధానిపై సీఎం  వైయస్ జగన్ ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు..
-ఈ ప్రాంతంలో భూసేకరణ చట్టాన్ని అమలుచేయవద్దని కోరుతున్నా.
-వ్యవసాయం చేసుకోడానికి కావాలని ఎవరైనా భూములు వెనక్కి అడిగితే వారికి ఇచ్చెయ్యమని సీఎం ని కొరతా..
-అమరావతిని అగ్రికల్చర్ జోన్ గా ప్రకటిస్తే తప్పేముంది.
-అగ్రికల్చర్ జోన్ గా ప్రకటిస్తే స్వాగతిస్తా.