సిమెంట్,స్టీల్ లేకుండా అయోధ్య ఆలయం, ఫ్రీగా కట్టేందుకు L&T సిద్ధం

(TTN Desk)
రామ జన్మభూమిలో గుడి కట్టేందుకు ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి (L&T) ముందుకు వచ్చింది. గుడికి సంబంధించిన డిజైన్ ను రూపొందించడంతో పాటు నిర్మాణానికి సంబంధించిన అన్నిపనులు చేపట్టేందుకు ఈ సంస్థ ఆసక్తి చూపిస్తున్నదని న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక కథనంప్రచురించింది.
ఈ వార్త ప్రకారం, ఎల్ అంట్ నిర్మాణాన్ని ఉచితంగా చేపట్టాలనుకుంటున్నది. విశ్వహిందూపరిషత్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఎల్ అండ్ టి సంప్రదింపులు జరుపుతున్నారని విశ్వహిందూపరిషత్ ప్రతినిధి ఒకరు న్యూఇండియన్ ఎక్స్ ప్రెస్ కు తెలిపారు.
రామాలయం నిర్మాణం తేదీని ఖరారు చేసేందుకు ట్రస్టు మార్చిమొదటి వారంలో అయోధ్యలో సమావేశంకానుంది. ఈ సమావేశంలో ఎల్ అండ్ టి ప్రతినిధిగా ఈ సంస్థసీనియర్ డిజైనర్ ఆర్ ఎం వీరప్పన్ పాల్గొనవచ్చనుకుంటున్నారు.
ఆలయ నిర్మాణంలోకి ఎల్ అండ్ టి ని దింపే విషయం మీద ట్రస్టు బోర్డు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చంపత్ రాయ్ చెప్పారు.
అయోధ్యలో 67 ఎకరాలలో రామాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారు. 270 అడుగుల పొడవుతో నగర శైలిలో ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నారు. నగర శైలి అంటే ఉత్తర భారతదేశంలో వైష్ణవ ఆలయనిర్మాణ శైలి.
నగర్ శైలినే ఎందుకు ఎంచుకున్నారంటే, అక్కడి ఆలయం మొదట నగర శైలిలోనేఉండిందని, అందుకే నూతనాలయాం కూడా పాత నమూనాలో నిర్మించాలని నిర్ణయించినట్లు ట్రస్టు ఛెయిర్మన్ మహింత్ నృత్య గోపాల దాస్ చెప్పారు.
ఆలయం రెండంతస్థుల లలో ఉంటుంది.ఆలయనిర్మాణంలో ఇనుము, సిమెంట్ ఉపయోగించరు, కేవలం రాతి బండలను మాత్రమే నిలబెడతారు.
ఇది ఇలా ఉంటే, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్​పీ) ముప్పై ఏళ్ల క్రితమే చేసిన నమూనా గుడి నిర్మాణం జరుగుతుందని ఈ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు సదాశివ కోక్జే ఆశాభావం వ్యక్తం చేశారు.గతంలో రామ జన్మభూమి న్యాస్ తయారు చేసిన నమూనా ప్రకారం ఆలయం నిర్మించేందుకు కేంద్ర ట్రస్టు సాయం కోరితే, అందించేందుకు విశ్వ హిందూ పరిషత్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
న్యాస్ రూపొందించిన నమూనా ప్రకారం ఆలయం నిర్మించేందుకు గత ముప్పై సంవత్సరాలుగా ఆలయ స్తంభాలను కళాత్మకంగా రూపొందించడం జరగుతుూ ఉందని కూడా ఆయన వెల్లడించారు.
ఆలయ నిర్మాణం 2024-25 నాటికి పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.