కరోనా మధ్యలో తెలంగాణలో ప్రజల్ని గాలి కొదిలేశారు: వంశీ చంద్ రెడ్డి

తెలంగాణా రాష్ట్రంలో కరోనా అంటువ్యాధి నియంత్రణ , నిర్వహణలో, రాష్ట్రప్రభుత్వం మరియు ముఖ్యమంత్రిగారు విఫలమైన తీరుపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే  వంశీచంద్ రెడ్డి గారు భగ్గుమన్నారు. తెలంగాణా ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందని, హైకోర్టు ఆదేశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా మొండివైఖరి ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఆదాయమార్గాలపై చూపిస్తున్నశ్రద్ధ కంటే, ప్రజల ఆరోగ్యంపైనా చూపిస్తే బాగుంటుందని వంశీ పేర్కొన్నారు.
రాష్ట్రంలో వ్యాధి నిర్ధారణపరీక్షలు తక్కువగా జరగడంవల్ల, కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం అత్యంత ప్రమాదస్థాయికి చేరుకుంటుందని , రాష్ట్రంలో కరోనా అంటురోగం విజృంభిస్తుందని హెచ్చరించారు.
ప్రభుత్వనిర్లక్ష్యాన్నివివరిస్తూ గత ఏప్రిల్ నెలలో, వ్యాధి లక్షణాలులేకుంటే కరోనాపరీక్షలు చేయవద్దని, కరోనా రోగితో ప్రాథమిక సంభందాలున్నా, చనిపోయినవారికి, కరోనాపరీక్షలు చేయవద్దని, ప్రజారోగ్య అధికారుల కు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయడం ప్రస్తావించారు.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనే సంస్థ కూడా, కరోనా అంటురోగ నియంత్రణ లో తెలంగాణప్రభుత్వం విఫలమైందని , వ్యాధి నిర్ధారణ లో, వ్యాధి గ్రస్తుల గుర్తింపులో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పు పట్టిందని తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనే సంస్థ వివరాల ప్రకారం తెలంగాణలో అత్యల్ప వ్యాధిగ్రస్తుల గుర్తింపు జరుగుతుందని, నమోదైన సంఖ్యల ప్రకారం తెలంగాణాలో -14, ఆంధ్రప్రదేశ్ లో – 54, తమిళనాడులో- 44, కేరళలో-40, కర్ణాటకలో-93 , ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వ్యాధి గ్రస్తుల గుర్తింపు, వ్యాధి నిర్ధారణపరీక్షలు ఎక్కువగా జరగాలని సూచించి తెలంగాణ ప్రభుత్వ ప్రస్తుత వైఖరిపై హెచ్చరించిందని తెలిపారు.
సాక్షాత్తు హైకోర్టు రంగంలోకి దిగి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలినన్ని కరోనా రోగ నిర్ధారణ పరీక్షలు చేయమని ఆదేశించినా , చలించక , అజ్ఞానంతో పూర్వ వైఖరిని కొనసాగిస్తూ పరిస్థితి దిగజారుస్తుందని మండిపడ్డారు.
హైకోర్టు ఇటీవల 37మంది డాక్టర్ల ఉదంతాన్ని ప్రస్తావిస్తూ , ప్రభుత్వం చాలినన్నిPPE కిట్లు , N -95 మాస్కులు, గ్లౌసులు ఇతర సౌకర్యాలు అన్నికల్పిస్తే 37 మంది డాక్టర్లకు కరోనా వ్యాధి ఎందుకు సోకిందని ప్రశ్నించింది.
కేంద్ర సంస్థాగత మంత్రుల కమిటీకి, తెలంగాణ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని, తెలంగాణప్రభుత్వం వద్ద 5.5 లక్షల PPE కిట్లు , 7.30 లక్షల N -95 మాస్కులు , 34లక్షల సర్జన్ మాస్కులు, 11లక్షల గ్లౌజులు , 47వేల పరీక్ష కిట్లు ఉన్నట్టు తెలిపిందని మరి 37 మంది డాక్టర్లకు వ్యాధి ఎలా సోకిందని ప్రశ్నించారు.
గుడులూ, బడులు మూసివేసి, బార్లు తెరిచి సామాజిక దూరాన్నివిస్మరించి ప్రభుత్వం మందు బాబుల మీద వచ్చే ఆదాయం మీద దృష్టి పెట్టిందని, మందు బాబుల ఆరోగ్యం, వారి కుటుంబ క్షేమాన్నీ విస్మరించారని విమర్శించారు .
కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి 20 లక్షల కోట్లు మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పంపిన నిధులను ఎలా ఖర్చు చేశారని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కరోనావ్యాధి నిర్ధారణ పరీక్షల్లో, జాతీయ సగటుకంటే, దేశంలోని అన్నిరాష్ట్రాలకంటే, చిట్ట చివరి స్థానంలోఉండటం సిగ్గుచేటని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం వాస్తవాలను దాచి, ప్రభుత్వ చేతగానితన్నాన్నికప్పిపుచ్చుకుంటూ తెలంగాణలో కరోనా వ్యాధిగ్రస్థులు తక్కువగా ఉన్నారని తప్పుడు లెక్కలు చూపిస్తూ డాబులకు పోతున్నారని, ఈవిధంగా తప్పుడులెక్కలు చూపితే రేపటినాడు, WHO సంస్థగానీ, కేంద్ర ప్రభుత్వం గాని వాక్సిన్ సరఫరాచేయడానికి, ఈ తప్పుడు అంకెలను పరిగణలోకి తీసుకొంటే తెలంగాణ సమాజం తీవ్ర ప్రమాదపుటంచులను చేరుకొంటుందని హెచ్చరించారు .
మిత్రుడు, మనోజ్ , 33 సంవత్సరాల యువ జర్నలిస్టు , నన్ను డాక్టర్లు పట్టించుకోవట్లేదు , ఊపిరి ఆడటం లేదు అని గాంధీ ఆసుపత్రి నుంచి ఇతర ఆసుపత్రికి తరలించమని, స్మశానానికి తరలించమని కోరాడంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో , ప్రభుత్వ ఆసుపత్రి , గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాలు ఏవిధంగా ఉన్నాయి అనే వాస్తవాలు కళ్ళకు కడుతున్న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు .
ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంటుకు ఒక్కరోజుకు లక్షరూపాయలు వసూలుచేస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రులు విఫలమైతే , ప్రభుత్వం తన బాధ్యతలు విస్మరిస్తే ,మరి పేదవాడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ప్రభుత్వ వైద్యులు వర్షం పడుతున్నాకూడా ప్రభుత్వ వైఖరి పై నిరసన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో గ్రహించి వెంటనే సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని కోరారు .
హైకోర్టు చెప్పినా కూడా , ఇతర ప్రభుత్వ సంస్థలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గవర్నరుగారిని కలిసి రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరుపమని , కాంగ్రెస్ పార్టీ తరపున కోరుతామని తెలిపారు .
తెలంగాణా ప్రభుత్వానికి , కోవిడ్ నివారణకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దుర్వినియోగం చేస్తున్నారని , ఆరోపణలు ఉన్నాయని , సత్వరమే శ్వేతపత్రం విడుదల చేయాలనీ కోరారు .
కోవిడ్ నియంత్రణకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ , సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వాడుతూ, రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ , జాగ్రత్తగా ఆరోగ్యాన్నికాపాడుకోవాలని సూచించారు.