లక్షల ఉద్యోగాలిచ్చే ITIR ను ముంచిన పాపం కెసిఆర్ ప్రభుత్వానిదే…

లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నా భర్తీ చేయలేని అసమర్థ ప్రభుత్వం

మండలి ఎన్నికల్లో కేటీఆర్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు.

ఎన్నికల్లో కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వండి

హైదరాబాద్ మార్చి 1: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఐటీ ఉద్యోగుల,నిరుద్యోగుల ఓట్లు దండుకునేందుకు కేటీఆర్ అనేకరకాలుగా మభ్యపెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఏఐసీసీ అధికారప్రతినిధి డా.దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.ఈ మేరకు గాంధీ భవన్ లో జరిగిన పత్రిక విలేఖరుల సమావేశంలో పలు విషయాలపై మాట్లాడిన శ్రవణ్ తెరాస ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేసారు.

ITIR ప్రాజెక్టు ను బీజేపీ,తెరాస లు కలిసి సర్వనాశనం చేశాయని వీరిరువురు కలిసి లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టారని ITIR వస్తే ఏంతో మంది నిరుద్యోగుల కు ఉద్యోగాలు లభించేవని అన్నారు.

2013 లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయం లో ఈ అద్భుతమైన ప్రాజెక్టుకు రూపకల్పన చేసారని ఆ సమయం లోనే కెసిఆర్ కూడా అద్భుతమైన ప్రాజెక్టని పలు సందర్భాలలో వ్యాఖ్యానించారని తెలిపారు.తెలంగాణా సిద్దించిన తరువాత అసెంబ్లీ లో సైతం ఈ ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టుగా,తెలంగాణ దశ,దిశను మార్చే ప్రాజెక్టుగా పేర్కొన్నారని గుర్తుచేశారు.తెలంగాణ ఏర్పడిన తరువాత ఆంధ్ర కంపెనీలు తమ స్వ రాష్ట్రానికి తరలిపోతే తెలంగాణ లో మిగిలే గొప్ప ప్రాజెక్టులు గా ITIR,NIMZ,PHARMA CITY లు గా పేర్కొని వాటిని ఎందుకు నాశనం చేసారో తెలపాలని పేర్కొన్నారు.కేంద్రం లో ని బీజేపీ ప్రభుత్వం ఈ ITIR ను బుగ్గిపాలు చేస్తుంటే కెసిఆర్ ,కేటీఆర్ లు ఈ ప్రాజెక్టుని రక్షించడంలో వైఫల్యం ఎందుకుచెందారని సూటిగా ప్రశ్నించారు.

తాను 12/01/21 న తెలంగాణ ప్రభుత్వం లోని ఐటీ శాఖకు సమాచార హక్కు చట్టం ద్వారా లేఖరాసి పలు పత్రాలు పొందానని అందులో తెలంగాణా ప్రభుత్వం కేంద్రానికి రాసినవి ప్రేమలేఖలే తప్ప చిత్తశుద్ధి తో ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనే ఆసక్తి మాత్రం లేదని శ్రవణ్ దుయ్యబట్టారు.మనిషికోమాట గొడ్డుకో దెబ్బ అన్న రీతిన లక్షలాది మందికి తిండిపెట్టే ప్రాజెక్టును సాధించే ప్రక్రియ ఇదేనా..? అని ప్రశ్నించారు.ఒక్కరోజైనా పార్లమెంటులో ఈ అంశం లేవనెత్తరా అని శ్రవణ్ ప్రశ్నించారు.ఢిల్లీ లో ఉన్న సలహాదారులు ఒక్కసారైనా కేంద్రప్రభుత్వ పెద్దల్ని కలిసారా అని ప్రశ్నించారు శ్రవణ్.

ఈ మధ్యనే రాష్ట్ర మంత్రి కేటీఆర్ 07/01/2021 న కేంద్ర మంత్రి కి లేఖరాస్తూ రాష్ట్రానికి ITIR ను కేటాయించడాన్ని లేఖ లో ప్రస్తావిస్తూ లేనిపక్షం లో మరేదైనా మంచి పథకాన్ని కేటాయించాలని లేఖరాయడం కేటీఆర్ చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాయని ఎద్దేవా చేసారు.2013 లోనే చట్టంగా రూపొందిన ప్రాజెక్టును సాధించే పద్దతి ఇదేనా అని నిలదీశారు.పార్లమెంటులో బీజేపీ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2018 లోనే ఈ ప్రాజెక్టును అటకెక్కిచ్చినామనే సంబంధిత మంత్రి మాటలు విని 2021 లో కేటీఆర్ లేఖరాయడం లో ఆంతర్యం ఏంటో తెలపాలని శ్రవణ్ అన్నారు.

ఆ నాడు డీపీఆర్ ప్రకారం 13 వేల కోట్లు ఈ ప్రాజెక్టుకు అవసరం ఉండగా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా మోసం చేస్తే అద్భుతమైన ప్రాజెక్టు అని కితాబిచ్చిన మీరు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.విభజన చట్టం ప్రకారం తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించాల్సి ఉండగా దాని స్థానం లో కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించారని దానికి హీనపక్షంగా నాలుగు లక్షల కోట్లు కేటాయించారని దానికి ఇప్పటివరకు కేంద్రం జాతీయహోదాగాని ఒక్కరూపాయి గ్రాంటు గాని కేటాయించలేదని తెలిపారు.ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు cwc అనుమతి కూడా లేదని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అదనంగా ఒక్కఎకరానికి కూడా నీరందడం లేదని అట్లాంటి ప్రాజెక్టుకు లక్షల కోట్లు పెట్టి డబ్బంతా బూడిదలో పోసినట్టు చేసారని అన్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటె మీరు పాలించిన ఏడు సంవత్సరకాలంలో సంవత్సరానికి వెయ్యి కోట్లు కేటాయించినా ప్రాజెక్టు ప్రారంభమయ్యి ఉండేదని తెలిపారు.

 

మీకు చిత్తశుద్ధి ఉంటె కేంద్రప్రభుత్వం వద్దకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ తరపున మేమంతా వచ్చి పోరాడాటానికి సిద్ధమని అందరం కలిసి ఢిల్లీకి పోయి పోరాడదామని మోడీ మెడలు వంచైనా సరే నిధులు సాదిద్దామని మీకు చేత కాకుంటే దొబ్బేయ్యాలని ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రజలను,నిరుద్యిగులను మోసం చేసే హక్కులేదని 40లక్షాల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని శ్రవణ్ అన్నారు.NIMZ ద్వారా లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేదని తెలంగాణ ప్రభుత్వానికి ఉపాధి కల్పన పై చిట్టా శుద్ధి లేదని ఉంటె ఇన్ని అద్భుతమైన ప్రాజెక్టులను నీరుగార్చేవారు కాదని అన్నారు.అసలు మీకు ఉపాధి కల్పనపై సోయి ఉందా అని సూటిగా ప్రశ్నించారు.

డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు శ్రవణ్ టీచర్లు గా నిరుద్యోగులకీ అవకాశమిస్తే ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ పిల్లలకు ఉపయోగం కదా అని ఎందుకు గ్రూప్-1,గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయరు తెలంగాణ విద్యార్థులకు ఆర్డీఓ గా తహశీల్దార్లుగా డీఎస్పీలుగా ఉద్యోగాలు చేసే అర్హత లేదా అని ప్రశ్నించారు.

2004లో చంద్రబాబు తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ పరిశ్రమ అభివృద్ధి పై పలువురు సందేహాలు వెలిబుచ్చారని కానీ ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుండి 2014 వరకు ఐటీ పరిశ్రమను పరుగులు పెట్టించారని అన్నారు.తెలంగాణ లో కేటీఆర్ ఒక్కడే ఐటీ పరిశ్రమను అభివృద్ధి పరుస్తున్నట్లు పలు ట్వీట్ ల ద్వారా తెలుపుతున్నారని కానీ వాస్తవం మరోలా ఉందని అన్నారు.2004 లో 8870 కోట్ల టర్నోవర్ గా ఉంటె 2014 లో 57,278 కోట్ల టర్నోవర్ ను సాధించి 592% అభివృద్ధి సాధించిందని అదేవిధంగా 88942 మంది ఐటీ ఉద్యోగస్టులు 2004 లో ఉంటె 2014 వచ్చేవరకు 323396 ఉద్యోగాలు పొందారని అది 263% అభివృద్ధి అని తెలిపారు.కాగా అప్పటికే అన్ని సిద్దమయి అద్భుతమైన సదుపాయాలు సమకూర్చి కేటీఆర్ చేతిలో పెడితే దాన్ని 1,28,507 గా పెంచి కేవలం 124% మాత్రమే టర్నోవరును సాధించారని మూడు లక్షల ఉద్యోగాలను ఐదు లక్షల ఉద్యోగాలు గా మాత్రమే అభివృద్ధి పరిచారని కేవలం అది 124% మాత్రమే అని శ్రవణ్ పేర్కొన్నారు.అవి కూడా ఈ తెరాస ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కంపెనీలు కావని అవి టీడీపీ,కాంగ్రెస్ ప్రభుత్వాల కాలం లో ఏర్పడ్డ సంస్థలు విస్తరించడం వల్ల ఏర్పడిన ఉద్యోగాలే తప్ప మీరు సాధించింది శూన్యమని అన్నారు.

గేమింగ్ అండ్ యానిమేషన్ పరిశ్రమను కూడా నిర్వీర్యం చేసారని దుయ్యబట్టారు.లైఫ్ ఆఫ్ పై లాంటి అద్భుతమైన సినిమాలు రూపొందించిన ఈ పరిశ్రమ ను కూడా సర్వనాశనం చేసారు. కాంగ్రెస్ హయాం లో నల్గొండ,వరంగల్,ఖమ్మం,కరీంనగర్ లాంటి పట్టణాల్లో కూడా ఐటీ పరిశ్రమ విస్తరణకు పునాదులు పడ్డాయని దానినికూడా సర్వనాశనం చేసారని అన్నారు.

ఇది రైతుబంధు,పెన్షన్ లను మాత్రమే పట్టిచ్చుకునే ప్రభుత్వమని నిరుద్యోగులను,పట్టభద్రుల ను పట్టిచ్చుకోని ఈ ప్రభుత్వానికి మండలి ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని శ్రవణ్ అన్నారు.లక్షల ఓట్లు ఖాలీలుగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడం లో అలసత్వం ప్రదర్శించే తెరాసను మండలి ఎన్నికల్లో మట్టి కరిపించాలని శ్రవణ్ అన్నారు.

ITR కోసం పోరాడే NSUI యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మీ లాటలకు తూటాలకు భయపడే పార్టీ తమది కాదని గాంధీ వారసులమని శాంతికాముక పార్టీ తమదని 1.90 లక్షల ఉద్యోగాలు భర్తీచేసేవరకు తమ పోరాటం ఆగదని ఆఖరి ఉద్యోగ నియామకం అయ్యేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని శ్రవణ్ అన్నారు.

ఈ మండలి ఎన్నికల్లో తెరాసకు ఓట్లు అడిగే హక్కు లేదని ప్రజలు ఆలోచించాలని మండలి అభ్యర్థులుగా ఉద్యమం లో పోరాడిన రాములు నాయక్ ను వెన్న లాంటి మనసున్న చిన్నారెడ్డిని గెలిపించాలని కోరారు శ్రవణ్.
2014,18 లో ఓడించారని ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీ కి కల్పించాలని మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే నిరంతరం నిరుద్యోగుల వెంట ఉండి పోరాడుతామని మండలి లో నిరుద్యోగుల వానిని వినిపిస్తామని తెలియజేసారు శ్రవణ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *