Home Breaking డ్యూటీల్లో చేరండి, ఇక ఆర్టీసీలో యూనియన్లకు నో ఎంట్రీ : కెసిఆర్

డ్యూటీల్లో చేరండి, ఇక ఆర్టీసీలో యూనియన్లకు నో ఎంట్రీ : కెసిఆర్

156
0
ఎలాంటి షరతులు లేకుండా రేపు ఉదయమే విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసి కార్మికులకు పిలుపునిచ్చారు. అయితే, యూనియన్లను వదలుకోవాలని షరతు పెట్టారు. సమ్మే కాలంలో మృతి చెందిన ఆర్టీసీ వర్కర్ ల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాని ఆర్టీసీకి రూ.100కోట్లు విడుదల చేస్తామని చెప్పారు.అదే సమయంలో టికెట్ ధరలు పెంచుతున్నట్లు కూడా ప్రకటించారు.
సోమవారం నుంచి కిలో మీటర్ కు 20పైసలు చొప్పున చార్జీ పెంచి సంవత్సరానికి రూ.758కోట్లు అదనంగా ఆదాయం చేకూరుస్తామని తెలిపారు.
తెలంగాణ క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ లో మీడియాతో  మాట్లాడారు. వివరాలు:
ఇవ్వాళ రెండు ,మూడు విషయాల్లో ప్రధాన చర్చ జరిగింది. అందులో ఆర్టీసి ఒకటి. ఇప్పుడే కార్మికులు విధులు జాయిన్ చేసుకోవాలని చెప్తున్నా.
మీరు మా బిడ్డలే.
ప్రభుత్వ పరంగా రేపు 100 కోట్లు ఇస్తున్నాం.
ఆర్టీసీ సంస్థ మనది, మనలో భాగమే
చార్జీలు పెంచుతున్నాం. సమ్మె వలన ఆర్టీసీ నష్టపోయింది. ప్రజలు పెద్దమనసు చేసుకోవాలి
ఆర్టీసీ ఎండీ కి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నా.
జాయిన్ కండీ. మీకు ఎలాంటి షరతులు పెట్టడం లేదు.
ఇక యూనియన్ లు మూతే
ఎట్టిపరిస్థితుల్లోనూ యూనియన్ లను రానివ్వం.వారిని ప్రోత్సహించం.
ఆర్టీసీ కార్మికులు యూనియన్ నాయకుల మాటలు పట్టి ఆగం అయ్యారు
అనాలోచిత సమ్మె వాళ్ళ వల్లే వచ్చింది
టెంట్ కనబడితే చాలు ఉపన్యాసాలు చేస్తున్నారు.సమ్మె లో చనిపోయిన కార్మికుల ప్రతి కుటుంబానికి ఒక్క ఉద్యోగం ఇస్తాం.
తక్షణ సహాయం చేస్తాం.
మమ్ములను ఇష్టం వచ్చినట్టు తిట్టారు మేము పట్టించుకొం
క్రమశిక్షణ తో ఉంటే సింగరేణి ఏవిధంగా తెచ్చామో ఆర్టీసిని అలా మారుస్తాం.
యూనియన్ లేకుండా ఉంటే మీకు డిపో నుండి ఇద్దరి చొప్పున ప్రతినిధులుగా పెడుతాం
ఆర్టీసీ సమస్య పై కూడా ఇవ్వాళ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం అనుకున్నాం.క్యాబినెట్ లో తీసుకున్నాం.
ఎప్పుడో  ఆర్టీసీ వారికి బాధ్యత తో మేము చెప్పాము.
వాళ్ళు పాలించే ఏ రాష్ట్రంలో కూడా విలీనం చెయ్యలేదు
ఉద్యోగస్థులను రోడ్ పాలు చేసింది కూడా వాళ్ళే
ఉద్యోగం ఉంటుందో పోతుందో తెల్వదు,మాకు ఇంకా టైం ఉంది లేబర్ కోర్ట్ లో తేలే దాకా.
నెను చెప్పాను జాయిన్ కావాలి అని వారు మాత్రం లైట్ తీసుకున్నారు
ప్రతి పక్ష నేతలు చెప్పిన మాటలు నమ్మి రోడ్ మీద పడ్డారు
యూనియన్ నాయకులు వల్లే ఈ పరిస్థితి వచ్చింది
మేము ఆర్టీసీ నాయకులు పొట్ట కొడుతామా..ఇదంతా వితండ వాదం
ఎక్కువ జీతాలు ఇచ్చిన అంగన్ వాడిలు,హామ్ గార్డ్ లు,పోలీస్ లకు రిస్క్ అలవెన్స్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
సింగిల్ విమెన్ లకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం, బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం కూడా మనదే
ఇక్కడ బిజెపికి 4గురు ఎంపీలు ఉన్నారు. అక్కడ ప్రైవేటీకరణ చట్టం కు వీరు ఓటు వేశారు,ఇక్కడ  కార్మికులను మభ్యపెడుతున్నారు
మీకు కేంద్రంలో న్యాయం చేస్తాం అని చెప్తున్నారు. కేంద్రం వాటా పై కూడా మేము కోర్ట్ కు పోతాం
రేపు నోటీస్ లు ఇస్తాం
రాజకీయ చలి మంటలు కాపుకోవడం తప్ప వీళ్లెక్కడికీ రారు. వస్తారా….?
కార్మికుల బ్రతుకులతో ఆడుకోవడం కరెక్టేనా?
ఇప్పటి కైనా ఆర్టీసీ కార్మికులు విధుల్లో జాయిన్ కావాలి .
మధ్యప్రదేశ్ లో ఆర్టీసీ లేని విషయం మీకు తెలుసా?
ప్రైవేట్ పరం చేస్తే డబ్బులున్నవారికి రూట్లు ఇవ్వాలని అనుకోనేలేదు. ఉద్యోగులు విఆర్ ఎస్ తీసుకుంటే వారికి ఇద్దాం అనుకున్నాను
మీకు త్వరలో ఉద్యోగ భద్రత తీసుకువస్తాను.
మీకు సీనియర్ మంత్రి ని ఇన్ చార్జ్ గా పెడుతాం వారితో మీకు ఇబ్బందులు ఉంటే చర్చించేందుకు వీలు ఉంటుంది
త్వరలో ప్రతి ఆర్టీసీ డిపో నుండి 5గురిని పిలిచి మాట్లాడుతా..
ప్రతి అంశం పై క్షుణ్ణంగా వివరిస్తా…
నేను ఆర్టీసీ మంత్రిగా ఉన్నప్పుడు లాభాల బాటలో తెచ్చాను
క్రమశిక్షణ తో ఉంటే మీకు మంచి చేస్తాం
అద్భుతమైన ఆర్టీసీ గా నడుపుతాం.
ఆర్టీసీ లో తాత్కాలికంగా డ్యూటీ లు చేసిన వారికి కృతజ్ఞతలు.
నా మాట వింటే మీకు బోనస్ వస్తుంది
అనుభవం ఉన్నవారిని డీఎం లు చర్చలకు పిలుస్తారు మీరు రాండి. మంచిగా మాట్లాడుకుందాం.