Home Breaking పరీక్ష లేకుండా కరోనాను గుర్తించే పరికరం తయారు చేసిన ఇరాన్

పరీక్ష లేకుండా కరోనాను గుర్తించే పరికరం తయారు చేసిన ఇరాన్

442
0
(Picture credits Alarabiya.net)
ప్రపంచమంతా కరోనా ఇన్ ఫెక్షన్ ని కనుగొనడం ఎట్లా, నియంత్రించడమెట్లా అనేది పెద్ద సమస్య అయింది. ఈ మార్గాలు కనిపెట్టేందుకు అన్ని దేశాలలో పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా నియంత్రణలో వైరస్ సోకినట్లు కనిపెట్టడం చాలా ముఖ్యమమయింది. కేవలం రోగ లక్షణాల మీద ఆధారపడటం సాధ్యం కాదు. ఎందుకంటే, చాలా మంది లో కరోనా వైరస్ సోకినా రోగ లక్షణాలుండటం లేదు. అందువల్ల రోగ లక్షణాలతో నిమిత్తం లేకుండా కరోనా రోగులను గుర్తించడం ఎలా అనేది పెద్ద ప్రశ్న.
ఇపుడు భారత దేశంలో కరోనా రోగలక్షణాలు కనిపించినపుడు పరీక్షలుచేసి క్వారంటైన్ చేస్తున్నారు. ఇలా ప్రతి మనిషికి పరీక్షలు చేసిన మాత్రమే రోగిని గుర్తించాల్సిన ఉన్నందున పరీక్షలు చేయడం పెద్ద కార్యక్రమంఅయింది. కరోనా పాజిటివ్ కేసులను గుర్తించడానికి చాలా సమయంపుడుతూ ఉంది. ఇలా కాకుండా పరీక్షలే లేకుండా కరోనా కేసులను గుర్తించగలిగితే…
సరిగ్గా ఇదే చేశానని ఇరాన్ ప్రకటిచింది. ప్రపంచంలో కరోనా తీవ్రంగా దెబ్బ తీసిన దేశాలలో ఇరాన్ ఒకటి. దూరాన్నుంచే మనిషి సమీపించకుండా, శాంపిల్ తీసుకుని పరీక్ష చేయకుండానే  శరీరంలో కరోనా వైరస్ ఉందని చెప్పే పరికరాన్ని ఇరాన్ తయారు చేసింది.

కరోనా రోగులను 100 మీటర్ల దూరాన్నుంచే గుర్తించే ఈ పరికరాన్ని తమ దేశనిపుణులు తయారుచేసినట్లు ఆదేశ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ కోర్ (IRGC) నాయకుడు జనరల్ హొసేన్ సలామి ప్రకటించారు. ఈ పరికరం ఎలా పనిచేస్తుందో ఆయన టివి ముందుకొచ్చి ప్రదర్శన ఇచ్చారు. నూరు మీటర్ల దూరాన్నుంచే కోవిడ్-19 కేసులను ఈ పరికరం గుర్తిస్తుందని ఆయన చెప్పారు.
ఈ పరికరం విశేషమేమిటంటే కరోనా వైరస్ నే కాదు, ఏ వైరస్ నైనా ఇది గుర్తిస్తుందని సలామి చెప్పినట్లు  Alarabiya రాసింది.
ఐఆర్ జిసి పారామిలిటరీ విభాగం బసిజ్ (Basij) నిపుణులు ఈ పరికరం రూపొందించినట్లు ఆయన చెప్పారు.
ఒక మాస్క్ ధరించి, ఐఆర్ జిసి హెడ్ క్వార్టర్స్ల్ లో ఆయన ప్రభుత్వ టివికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ పరికరంలో ఒక చేతపట్టుకునే డిటెక్టెర్, యాంటెనా, డిష్ ఉంటాయి.
దేశంలోని అనేక ఆసుపత్రులలో ఈ పరికరాన్ని పరీక్షించినట్లు , అది 80 శాతం దాకా ఫలితాలను కచ్చితంగాచూపినట్లు సలామీ చెప్పారు. ఈ పరికరం యాంటెనా లో పోలరైజ్డు వైరస్ లుంటాయి. ఇవి ఒక ఆయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. అపుడు నూరు మీటర్ల వ్యాసార్థంలో కరోనా వైరస్ ఎక్కడున్నా ఇది గుర్తిస్తుంది. అది కూడా ఐదు సెకన్లలోనే గుర్తిస్తుంది. ఈ పరికరాన్ని సామూహిక పరీక్షలకు, వైరస్ సోకిన ప్రాంతాలను, వ్యక్తులను గుర్తించేందుకు సులభంగా వాడవచ్చు. ఈ మిషన్ కు మోస్తాన్ (Mosta’an) అని పేరు పెట్టారు. ఇది అల్లాకున్న పేర్లలో ఒకటి. దీనర్థం ఆపదమొక్కుల వాడు అని.
ఇరాన్ ఆరోగ్య శాఖ లైసెన్స్ ఇవ్వగానే ఈ పరికరాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం జరుగుతందని జనరల్ సలామి చెప్పారు.
కరోనా మహమ్మారి దాడి చేశాక ఇరాన్ చాలా పరికరాలు తయారు చేసిందని, అందులో ఇదొక్కటని చెబుతున్నారు. ఇరాన్ కరోనా తో తీవ్రంగా దెబ్బతినింది. అక్కడ సుమారు 62 వేల కేసులు నమోదయ్యాయి. మృతులసంఖ్య నాలుగువేలు.
ఇది నిజమే అయితే, కరోనా రోగులును కనిపెట్టడంలో విప్లవాత్మక పరిణామమే. ఎందుకంటే, ప్రపంచదేశాలన్నీ ఇపుడు ముక్కునుంచి సేకరించిన శాంపిల్ ను పరీక్షించి కనుగొంటున్నారు. ఇదే మంత ఖచ్చితమయిన సమాచారాన్ని వ్వడం లేదన్న వివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పరీక్షలు లేకుండా కరోనాను కనిపెట్టే సాధనం రూపొందించినట్లు ప్రకటించింది.

(ప్రపంచ వ్యాపితంగా కరోనా పరిశోధన వార్తలను అందించడమే ఈ కాలమ్ ఉద్దేశం)